కౌంటింగ్ రోజు అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు : ఎస్పీ - votes counting day precautions - VOTES COUNTING DAY PRECAUTIONS

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 1, 2024, 5:19 PM IST

SP Meeting With Political Party Leaders: అనకాపల్లి జిల్లాలో ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. కౌంటింగ్‌ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఆయన అవగాహన సదస్సు నిర్వహించారు. జూన్‌ 6 వరకు ఎలాంటి ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతులు లేవన్నారు. కౌంటింగ్‌ రోజు ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

అందరి సహకారంతో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని అదే స్ఫూర్తితో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా ప్రశాంతంగా కొనసాగేలా సహకరించాలని ఎస్పీ కేవీ మురళీకృష్ణ కోరారు. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎన్నికల నేపథ్యంలో 144 సెక్షన్, 30 పోలీసు యాక్ట్ వంటివి పటిష్టంగా అమల్లో ఉన్నాయని, కాబట్టి ప్రజలంతా గ్రహించి సహకరించాలని అన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ అవగాహన కార్యక్రమానికి నర్సీపట్నం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.