ఓటర్లను ఆకట్టుకునేందుకు వైసీప నేతల ప్రయత్నాలు- చీరల పంపిణీకి తెరతీసిన అంబటి రాంబాబు - Ambati Distribute Sarees to Voters
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 14, 2024, 9:40 AM IST
Ambati Rambabu Has Distribute The Sarees to Voters: రాష్ట్రంలో ఇంకా ఎన్నికల తేదీ ఖరారు కాాకముందే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వైసీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గరపడటంతో అధికార పార్టీ నేతలు ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు కానుకలు ఎర వేస్తున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు ఓటర్లను ఆకట్టుకునేందుకు చీరల పంపిణీకి తెర తీశారు. స్థానిక వైసీపీ నాయకురాలు ఆసుపత్రి, అంగన్వాడీ సిబ్బందికి చీరలు పంపిణీ చేశారు. రాజుపాలెం పరిసర ప్రాంతాల్లో వైసీపీ నేతలు మహిళా ఓటర్లుకు చీరలు పంచారు. అలాగే గ్రామాల్లో ఉన్న వాలంటీర్ల ద్వారా మహిళలకు చీరలు అందజేస్తున్నారు.
ఇదే విధంగా మంగళవారం రాత్రి ఊటుకూరు, బయ్యవరం గ్రామాల్లో వైసీపీ నేతలు మహిళలకు కుక్కర్లు పంపిణీ చేశారు. నాలుగు రోజుల క్రితం పారుపల్లి అడ్డరోడ్డు వద్ద సుమారు 200 కుక్కర్లతో వెళ్తున్న వాహనాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అలాగే సోమవారం అర్ధరాత్రి హస్సానాబాద్ వద్ద 7కుక్కర్లతో వెళ్తున్న వాహనాన్ని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కుక్కర్లు ఎక్కడ కొన్నారు ఎక్కడికి తీసుకెళ్తున్నారని వాహనదారులను పోలీసులు ప్రశ్నించారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అధికార పార్టీల నేతలు కుక్కర్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.