రాజధాని తరలిపోతే భావితరాలకు తీవ్రనష్టం: అమరావతి రైతులు - Amaravati Farmers
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 15, 2024, 11:42 AM IST
Amaravati Women Farmers campaign in Firangipuram Mandal : అమరావతి రాజధాని తరలిపోతే భావితరాలకు తీవ్ర నష్టం కలుగుతుందని అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) కన్వీనర్ పువ్వాడ సుధాకర్ పేర్కొన్నారు. సీఎం జగన్ మాటలు నమ్మి ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలోని వేములూరిపాడు, అమీనాబాద్ గ్రామాల్లో గురువారం సాయంత్రం జేఏసీ సభ్యులు పర్యటించారు. 'ఆంధ్రప్రదేశ్‌ను-అమరావతి రాజధాని కాపాడుకుందాం-కలిసి రండి కదలి రండి' అని నినాదాలు చేశారు. మహిళలు ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేశారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డికి మరో అవకాశం ఇస్తే విశాఖను రాజధాని చేస్తే అమరావతి రైతులు నష్టపోతారని పువ్వాడ సుధాకర్ వ్యాఖ్యానించారు. సీఎం జగన్ ఇంటికి పంపించడానికి రాష్ట్రం ప్రజలు సిద్ధంగా ఉన్నారని అమరావతి మహిళ రైతులు పేర్కొన్నారు. జగన్ అయిదేళ్ల పరిపాలన గుంతల రోడ్డులతో, ప్రభుత్వ కార్యాలయాన్ని తాకట్టు పెడుతూ రాష్ట్రాన్ని భ్రఘ్ట పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో దళితులు, బడుగు బలహీనవర్గాలు, ముస్లింలకు అన్యాయం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అమరావతి రాజధాని మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.