చీరాల వైఎస్సార్సీపీలో ముసలం- భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలతో ఆమంచి భేటీ - Amanchi Dissent to YSRCP Party - AMANCHI DISSENT TO YSRCP PARTY
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 27, 2024, 12:55 PM IST
Amanchi Dissent to YSRCP Party : బాపట్ల జిల్లా చీరాల వైఎస్సార్సీపీలో ముసలం పుట్టింది. గత రెండు రోజులుగా చీరాల మాజీ ఎమ్మెల్యే (MLA) ఆమంచి కృష్ణమోహన్ అనుచరులతో సమావేశాలు నిర్వహించారు. స్థానికులకు టికెట్ ఇవ్వకుండా ఎక్కడ నుంచో వచ్చినవారికి టికెట్ ఇవ్వడమేంటని నేతలు అభిప్రాయపడ్డారు. కరణం వెంకటష్కు కాకుండా స్థానికుడైన ఆమంచికే టికెట్ ఇవ్వాలనే డిమాండ్‌ను నేతలు తెరపైకి తెచ్చారు. ఇటీవల ఆమంచిని పర్చూరు నుంచి కూడా తప్పించడంతో సోమవారం రాత్రి తన అనుచరులతో సమావేశం (Meeting) నిర్వహించారు. మరో రెండ్రోజుల్లో తన కార్యాచరణను వెల్లడిస్తానని అనుచరులతో చెప్పినట్లు సమాచారం.
ఇప్పటికే కరణం, ఆమంచి వర్గాల మధ్య కొంతకాలంగా పోరు జరుగుతుంది. 2019 ఎన్నికల్లో చీరాలలో వైఎస్సార్సీపీ తరపున పోటీచేసిన ఆమంచి టీడీపీ అభ్యర్థి కరణం బలరామకృష్ణమూర్తి చేతిలో ఓడిపోయారు. అనంతరం బలరాం వైఎస్సార్సీపీ (YSRCP) పంచన చేరారు. చీరాల టికెట్ కోసం ఆమంచి ప్రయత్నాలూ విఫలమయ్యాయి. ఇటీవల ఆమంచిని పర్చూరు నుంచి కూడా తప్పించారు. దీంతో ఆయన చీరాల లోనే ఉంటూ టికెట్ తనకే ఇవ్వాలని కోరారు.