ఎన్నికల్లో వ్యూహంపై కూటమి కార్యాచరణ - పార్లమెంటు అభ్యర్థుల సమన్వయ సమావేశం - Alliance meeting - ALLIANCE MEETING
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 5, 2024, 9:50 AM IST
Alliance Parliamentary Candidates Meeting in Vijayawada : తెలుగుదేశం జనసేన బీజేపీ పార్లమెంటు స్థాయి ఉమ్మడి సమన్వయ సమావేశాలు నేడు (శుక్రవారం) జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంట్ స్థాయిలో ఉమ్మడి సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చించి కూటమి కార్యాచరణను రూపొందించుకోనున్నారు. ఎన్నికలు సన్నద్ధత, ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్, కొత్త ఓటర్లు, ఇతర ప్రాంతాల్లో నివసించే ఓటర్లు, పోస్టల్ ఓట్లు, బూత్ ఏజెంట్ లు తదితర అంశాలపై చర్చించనున్నారు.
కూటమి తరపున భారీ బహిరంగ సభలు నిర్వహణ, సామాజిక మాధ్యమాల్లో ఎంపీ ఎమ్యెల్యే అభ్యర్థులు ప్రచారం పై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఎంపీ అభ్యర్థి మేనిఫెస్టో ఇతర స్థానిక సమస్యలపైనా చర్చించనున్నారు. కూటమి పార్లమెంట్ స్థాయి అభ్యర్థులు, పార్టీ అధ్యక్షులు పాల్గొనున్నాంట్లు సమాచారం. అంతే కాకుండా 7 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులు, 7 నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు కార్యాచరణ రూపొందిస్తున్నారని పలువురు చర్చించుకుంటున్నారు.