జీ 20 సదస్సు పేరుతో వైఎస్సార్​సీపీ నేతలు కోట్లు దోచేశారు - Alliance Leaders on GVMC Corruption - ALLIANCE LEADERS ON GVMC CORRUPTION

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 27, 2024, 4:46 PM IST

Alliance Leaders Accused of Massive Corruption in GVMC: వైఎస్సార్​సీపీ ఐదేళ్ల పాలనలో విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పెద్దఎత్తున అవినీతి జరిగిందని కూటమిపక్ష నేతలు ఆరోపించారు. విశాఖ మాజీ ఎంవీవీ సత్యనారాయణ, ఇతర వైఎస్సార్​సీపీ నేతలు టీడీఆర్ బాండ్ల పేరిట కోట్లు కాజేశారని చెప్పారు. అంతే కాకుండా వేల ఎకరాల భూములు కబ్జా చేశారని అన్నారు. మేయర్‌, డిప్యూటీ మేయర్‌లు సహా వైఎస్సార్​సీపీ ఫ్లోర్‌ లీడర్లు అవినీతిలో భాగస్వాములని ఆరోపించారు. జీ 20 సదస్సు పేరు చెప్పి మొక్కలు పేరుతో కోట్లు కుంభకోణం జరిగిందని కూటమి కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేసారు. గత వైఎస్సార్​సీపీ హయాంలో కనీసం వీధి దీపాలు పెట్టలేదని ఆరోపించారు. పనిముట్లు కూడా ఇవ్వకుండా వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టిందని కూటమి నేతలు ఆరోపించారు. అంతే కాకుండా మేయర్​తో సహా డిప్యూటీ మేయర్​లు, వైసీపీ ఫ్లోర్ లీడర్లు నిట్టనిలువునా అవినీతి చేసారని కూటమి పక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.