సీఎం మీటింగ్​ కోసం ఇంటర్ పరీక్ష వాయిదా వేయడం సరి కాదు: ఏఐఎస్ఎఫ్ - Jagan meeting in Eluru

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 2, 2024, 7:19 PM IST

AISF Accused Jagan of Postponing Environmental Exam: విద్యార్థుల భవిష్యత్తుతో జగన్ ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి ఎం. సాయికుమార్ విమర్శించారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు శనివారం జరగాల్సిన పర్యావరణ విద్య పరీక్ష జగన్ సర్కార్ రాజకీయ సభ కోసం ఈ నెల 23కి వాయిదా వేసిందని మండిపడ్డారు. సీఎం జగన్ సభ శనివారం ఏలూరు జిల్లా దెందులూరులో ఉండటంతోనే ఈ పరీక్షను వాయిదా వేశారని దుయ్యబట్టారు. శనివారం జరగాల్సిన ఈ పరీక్షను ఈనెల 23కు వాయిదా వేయడం సరైంది కాదన్నారు. శనివారమే పర్యావరణ విద్య పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ప్రతినిధులు ఇంటర్ బోర్ధు కమిషనర్​ను కలిసి వినతిపత్రం అందజేశారు. పరీక్ష వాయిదా పడటంతో విద్యార్థులు గందరగోళానికి గురౌతున్నారన్నారు. 

ప్రశ్నా పత్రాలు లీకేజీ వంటి గందరగోళ పరిస్థితుల్లో వాయిదా పడుతున్న పరీక్షలు ఇలా ముఖ్యమంత్రి పాల్గొనే సభ కోసం వాయిదా వేయడం ఏమిటని సాయి కుమార్ ప్రశ్నించారు. రాష్ట్రం మొత్తం జరిగే పరీక్షను ఈ ప్రాంతంలో జరిగే సభ కోసం వాయిదా వేయడం సమంజసం కాదన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల బస్సుల్లో జనాలను తరలించడం కోసమే ప్రభుత్వం ఈ పరీక్షను వాయిదా వేసిందని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.