ఊటుకూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో కిసాన్ మేళా

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 24, 2024, 7:26 PM IST

 Agriculture Officials Conducted Kisan Mela: రైతులకు సుస్థిర వ్యవసాయం నేల నీటి నాణ్యత ప్రమాణాల గురించి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క వ్యవసాయ అధికారిపై ఉందని ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్ సి రమణ అన్నారు. కడప ఊటుకూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో రైతులు, డీలర్లకు కిసాన్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు.  రైతులకు కావలసిన సలహాలు సూచనలను అధికారులు తెలియజేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి నివారణ మార్గాలు, పంట దిగుబడి, నేల సాంద్రత సుస్థిర వ్యవసాయం తదితర వాటి గురించి అధికారులు అవగాహన కల్పించారు. 

  డ్రోన్ ద్వారా పంటలకు పిచికారి చేసే విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. గతంలో మనుషులతో  పిచికారి చేయడం వల్ల అనారోగ్య సమస్యలు, అధిక ఖర్చులు ఉండేవని తెలిపారు. డ్రోన్ ద్వారా పిచికారి చేస్తే, ఎకరాకు కేవలం 600 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుందని తెలిపారు. తక్కువ వ్యవధిలోనే ఒక ఎకరాకు పిచికారి చేయవచ్చునని చెప్పారు. రైతులకు డ్రోన్ ద్వారా పిచికారి చేసే విధానంపై కూడా అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.  ప్రభుత్వం తమకు సబ్సిడీ ద్వారా డ్రోన్లు ఇప్పిస్తే ఎంతో ఉపయోగకరంగా  ఉంటుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులు పేర్కొన్నారు. ప్రభుత్వం ద్వారా సబ్సిడీ వస్తువులు అందడం లేదని పేర్కొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.