భూమి మళ్లీ కుంగింది- కడపలో మిస్టరీగా భారీ గుంతలు - Agricultural land sunk 6 feet deep - AGRICULTURAL LAND SUNK 6 FEET DEEP
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 5, 2024, 12:31 PM IST
Agricultural Land Has Sunk 6 Feet Deep in YSR District : వైఎస్సార్ జిల్లా దువ్వూరు మండలం చింతకుంట గ్రామంలో వ్యవసాయ భూమి బుధవారం సుమారు 6 అడుగుల లోతు కుంగిపోయింది. పెద్ద బావిలా వృత్తాకారంలో సాగు భూమి కుంగిపోవడంతో రైతు మానుకొండు శివ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి అక్కడ ఎలాంటి పంట వేయలేదు. 2019లోనూ ఇదే భూమి కుంగిందని అప్పట్లో దాన్ని పూడ్చేందుకు రూ.50 వేలు వెచ్చించినట్లు రైతు తెలిపారు. అసలు ఇలా భూమి ఎందుకు కుంగిపోతుంతో అధికారులు పరిశీలించాలని రైతు కోరుతున్నారు. భూమిలో పంటసాగు చేయకపోవడం, పొలంలో ఎవరూ లేని సమయంలో భూమి కుంగడంతో ప్రమాదం తప్పిందని రైతు తెలిపారు.
మరోవైపు వరద ముంపుతో ఇక్కట్లు పడ్డ ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లు నీట మునిగి పునరావాసాల్లో తలదాచుకున్న వాసులు ఇళ్ల బాట పడుతున్నారు. వరద విలయంతో రాష్ట్రమంతా అతలాకుతలమైన విషయం విధితమే.