క్రికెట్‌ను అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యం: కేశినేని చిన్ని - ACA New president on AP Cricket - ACA NEW PRESIDENT ON AP CRICKET
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18-08-2024/640-480-22235942-thumbnail-16x9-aca-new-president-keshineni-chinni-on-cricket-stadium.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 18, 2024, 4:27 PM IST
ACA New president Keshineni Chinni on Cricket Stadium: రాష్ట్రంలో క్రికెట్‌ను అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు కేశినేని చిన్ని అన్నారు. విద్యార్థి దశ నుంచే క్రికెట్‌ను ప్రోత్సహిస్తూ మట్టిలో మాణిక్యాలను వెలుగులోకి తెస్తామని చెప్పారు. ఏడాదిలో మంగళగిరి ఇంటర్నేషనల్ స్టేడియంను సిద్ధం చేసి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ నిర్వహణకు కృషి చేస్తామని ప్రకటించారు. అవసరమైన చోట్ల క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సెప్టెంబరు 8న అధికారికంగా బాధ్యతలు స్వీకరించబోతున్న కేశినేని చిన్నితో మా ప్రతినిధి సూర్యారావు ముఖాముఖి.
"రాష్ట్రంలో క్రికెట్‌ను అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తాం. విద్యార్థి దశ నుంచే ప్రోత్సహించి మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తాం. మంగళగిరి ఇంటర్నేషనల్ స్టేడియంను సిద్ధం చేసి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ నిర్వహణకు కృషి చేస్తాం. అవసరమైన చోట్ల క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేస్తాం." - కేశినేని చిన్ని, ఏసీఏ కొత్త అధ్యక్షుడు