thumbnail

సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం- అబ్దుల్‌ సలాం కుటుంబానికి ఆహ్వానం - Salam Family Invite to CBN Oath

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 11, 2024, 5:03 PM IST

Abdul Salam Family Invited to Chandrababu Oath Ceremony: వైఎస్సార్సీపీ ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన నంద్యాలకు చెందిన ఆటో డ్రైవర్‌ అబ్దుల్‌ సలాం కుటుంబానికి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానం అందింది. ఓ బంగారు దుకాణంలో పనిచేసే అబ్దుల్ సలాం చోరీ చేశాడని పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదైంది. ఈ కేసులో సలాంను పోలీసులు తీవ్రంగా హింసించి రిమాండ్​కు తరలించారు. 42 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలైన సలాం ఆటో నడుపుతూ జీవనం సాగించేవారు. 

ఆటోలో నగదు పోయిందని ఓ ప్రయాణికుడు ఫిర్యాదు చేయటంతో మరోసారి సలాంను పోలీసులు చిత్రహింసలకు గురి చేశారు. చేయని తప్పులకు శిక్ష అనుభవిస్తున్నానని భావించిన సలాం తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి 2020 నవంబర్ 3న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. 2022లో కర్నూలు వచ్చిన జగన్ బాధిత కుటుంబాన్ని ఓదార్చి విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు. నేటికీ ఈ కేసుపై పురోగతి సాధించలేదు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానం అందిన నేపథ్యంలో అబ్దుల్‌ సలాం కుటుంబాన్ని ఈటీవీ భారత్ పలకరించింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.