వర్షపు నీరు దారి మళ్లింపులో గొడవ- ఓ వ్యక్తి మృతి - Man Killed In Nandyal
🎬 Watch Now: Feature Video
Man Killed In Nandyal: మంగళవారం మద్యహ్నం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో ఆ వర్షపు నీటి వల్ల తమ ఇంట్లోకి నీరు వస్తుందంటూ ఓ వ్యక్తం కాలువా తీసే ప్రయత్నం చేశాడు. ఎదుటి ఇంటి వారు దీనికి అభ్యంతరం చెప్పారు. ఇద్దరికి మధ్య మాటామాటా పెరిగి ఇరు కుటుంబాల గొడవకు దిగారు. ఈ గొడవలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కరివేన గ్రామంలో చోటుచేసుకుంది.
మద్యాహ్నం కురిసిన వర్షానికి కరివేన గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు ఇంట్లోకి నీరు చేరింది. ఈ సందర్భంగా ఆ నీటిని ఇంట్లోకి రానివ్వకుండా కాలనీలోని రోడ్డుపై అడ్డుకట్ట వేశాడు. రోడ్డుపై కాలవా తీయడాన్ని అదే వీధీలో ఉంటున్న శ్రీనివాసులు అభ్యంతరం తెలిపాడు. దీంతో శ్రీనివాసులుకు వెంకటేశ్వర్లకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మాటామాటా పెరింగింది. ఒకరిపై ఒక్కరు దాడిచేసుకున్నారు. ఈ దాడిలో శ్రీనివాసులు, అతని కుమారుడు విజయ్ కిరణ్.. వెంకటేశ్వర్లపై దాడి చేశారు. ఈ దాడిలో వెంకటేశ్వర్లకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడే ఉన్న కుటుంబ సభ్యులు అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వెంకటేశ్వర్లను పరీక్షించిన వైద్యులు అతను మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. వెంకటేశ్వర్ల మృతిపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చెపట్టినట్లు తెలిపారు.