ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లిన కారు - వీడియో వైరల్ - CAR ACCIDENT IN MEDAK TOWN - CAR ACCIDENT IN MEDAK TOWN
🎬 Watch Now: Feature Video
Published : Sep 23, 2024, 10:49 AM IST
CAR ACCIDENT IN MEDAK TOWN : మెదక్ జిల్లా కేంద్రంలో ఆర్థోపెడిక్ హాస్పిటల్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో నేరుగా ఫుట్‌పాత్ పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆసుపత్రిలో పని చేస్తున్న పోచమ్మ అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి మెరుగైన చికిత్స కోసం ఆమెను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అలాగే ఆసుపత్రి ఎదుట పార్కింగ్ చేసిన మూడు ద్విచక్ర వాహనాలను కారు ఢీకొట్టింది. వాహనాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ప్రమాదానికి నిద్ర మత్తే కారణమని పోలీసులు భావిస్తున్నారు.
అదుపుతప్పి ద్విచక్ర వాహనాల మీదకు వెళ్లిన కారు ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదాలు కాకుండా పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేస్తున్నా వాహనదారులు పట్టించుకోకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వాహనం నడిపేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.