వైసీపీ ప్రచార రథం ఢీకొని బాలుడు మృతి - విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు - A boy died in ycp campaign - A BOY DIED IN YCP CAMPAIGN
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 19, 2024, 10:16 PM IST
A boy Died in YCP Campaign at Vijayanagaram : అమ్మా వెంటనే వచ్చేస్తాను అంటూ బయటకు వెళ్లిన ఆ చిన్నారి అనంతలోకాలకు వెళ్లిపోయాడు. కళ్లెదుటే అంత వరకూ హుషారుగా ఇంట్లో తిరిగిన ఆ బాలుడు నిమిషాల్లోనే విగతజీవిగా మారిపోయాడు. మీ అబ్బాయిని వాహనం ఢీకొందంటూ అందిన సమాచారం ఆ తల్లిదండ్రులు కుప్పకూలేలా చేసింది. విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోని లచ్చయ్యపేటకు చెందిన అయిదో తరగతి విద్యార్థి కొండేటి భరద్వాజ్(10)ని గురువారం రాత్రి రాజాం వైసీపీ అభ్యర్థి డా.తలే రాజేష్ ప్రచార రథం ఢీకొనడంతో తీవ్రగాయాలయ్యాయి. అదే వాహనంలో చోదకుడు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. చివరికి చికిత్స పోందుతు బాలుడు మృతి చెందాడు.
ఈ ఘటనపై తెలుగుదేెశం అధినేత చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రచార రథం ఢీకొని బాలుడు మృతి చెందటం చాాాలా బాధకరమన్నారు. బాలుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు సమయానికి 108 అంబులెన్స్ రాక, బాలుడిని సకాలంలో ఆసుపత్రికి తీసుకు వెళ్లలేకపోవడంతో బాధాకరమన్నారు. నిర్లక్ష్యంగా ప్రచార రథాన్ని నడిపి తప్పు ఒకరు చేస్తే, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ అందించలేని వైసీపీ పాలనా నిర్లక్ష్యం మరొకటని మండిపడ్డారు. ఈ రెండూ కలిసి ఎంతో భవిష్యత్తు ఉన్న పసివాడి జీవితాన్ని బలి తీసుకున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. భరద్వాజ్ కుటుంబసభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు.