బాలుడిని బలితీసుకున్న బిస్కెట్ - అల్లూరి జిల్లాలో విషాదం - Three years Boy Died Biscuit Stuck on Throat - THREE YEARS BOY DIED BISCUIT STUCK ON THROAT

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 9, 2024, 5:06 PM IST

A Boy Died After Biscuit got Stuck his Throat in Alluri District : అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని బోందుగుడ గ్రామానికి చెందిన కిండంగి తేజ (3) శనివారం సాయంత్రం ఆడుకుంటూ బిస్కెట్ నోట్లో వేసుకున్నాడు. అయితే ఆ బిస్కెట్ గొంతులో అడ్డంగా ఉండి పోయింది. ఊపిరి తీసుకోవటంలో బాలుడికి ఇబ్బందై తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన బాలుడిని ఆటోలో అరకులోయ ప్రాంతీయ వైద్యకేంద్రానికి తరలించారు.

Three years Boy Died Biscuit Stuck on Throat : ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నా బాలుడిని రక్షించమని వైద్యులను వేడుకున్నారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించారు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అదేవిధంగా ఆసుపత్రి ఆవరణలో ఉన్నవారు సైతం బాలుడి మృతితో కంటతడి పెట్టారు. బిస్కెట్ గొంతులో అడ్డం పడటంతో ఊపిరాడక బాలుడు మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.