వైఎస్సార్ జిల్లాలో 9 నెమళ్లు అనుమానాస్పద మృతి - 9 Peacocks Died in YSR District - 9 PEACOCKS DIED IN YSR DISTRICT
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : May 21, 2024, 3:02 PM IST
9 Peacocks Died in YSR District : వైయస్సార్ జిల్లా పెద్దముడియం మండలం ఉప్పలూరులో దారుణం చోటు చేసుకుంది. గ్రామ సమీపంలోని వాగు పక్కన ఒకేచోట 9 నెమళ్లు చనిపోయి ఉండటం చర్చనీయాంశంగా మారింది. విషాహారం తిని మృతి చెందాయా, లేక ఎవరైనా చంపి పడేశారా అనే అనుమానం స్థానికుల్లో రేకెత్తిస్తోంది. నెమళ్ల మృత్యువాతపై అటవీశాఖ అధికారులు ఆరా తీయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఒకేసారి తొమ్మిది నెమళ్లు విగతజీవిగా పడి ఉండటం చూసిని స్థానికులు కంగారుపడ్డారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు తెలియజేశారు. కాగా అసలు నెమళ్లు ఎలా చనిపోయాయనే విషయంపై ఎలాంటి సమాచారం తెలియరాలేదు.
అక్రమంగా వన్యప్రాణుల్ని పట్టుకుని, వాటిని విక్రయిస్తున్నారన్న ఘటనలు, పోలీసుల దాడులు, నివారణ చర్యలు జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. వన్యప్రాణుల్ని అక్రమంగా తరలించడం, చంపడం వంటివి చట్టరీత్యా నేరం అయినప్పటికీ ఇలాంటి ఘటనలు జరగడం దారుణమని జంతు ప్రియులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేేస్తున్నారు. కాగా నెమళ్ల మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.