మంచిర్యాలలో ఆరేళ్ల చిన్నారి కిడ్నాప్​ కలకలం - మహిళకు దేహశుద్ది చేసిన స్థానికులు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Feb 12, 2024, 2:01 PM IST

6 Years Girl Kidnap Case in Mancherial : గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా చిన్నారుల కిడ్నాప్​లు కలకలం రేపుతున్నాయి. తాజాగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి ఆరేళ్ల చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా​కు చెందిన ఓ కుటుంబం మంచిర్యాలలోని బంధువుల ఇంటికి వచ్చారు. వీరి బంధువులు స్థానికంగా ఓ అపార్ట్​మెంట్​ను కొనుగోలు చేసేందుకు చూడటానికి వెళ్లారు. అదే సమయంలో ఒంటరిగా ఉన్న ఆరేళ్ల కుమార్తె అపార్ట్​మెంట్‌ కింద ఆడుకుంటుండగా, కాసిపేటకు చెందిన సుమిత్ర అనే మహిళ మాయమాటలు చెప్పి చిన్నారిని తీసుకెళ్లింది.

Kidnap In Mancherial : ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు తమ కుమార్తె కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. చిన్నారి కోసం చుట్టుపక్కల వెతికారు. ఈ క్రమంలోనే స్థానికులు పాపను తీసుకెళ్తున్న మహిళను పట్టుకుని దేహశుద్ది చేశారు. అనంతరం ఆ మహిళను మంచిర్యాల పోలీసులకు అప్పజెప్పారు. పోలీసులు చిన్నారిని తల్లిదండ్రులకు అప్పజెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.