గొర్రెల మందపై కుక్కల దాడి - 30 మూగజీవాలు బలి - కుక్కల దాడిలో 30గొర్రెలు మృతి
🎬 Watch Now: Feature Video
Published : Feb 18, 2024, 1:52 PM IST
30 Sheeps Killded in Dogs Attack at Jagtial : జగిత్యాల జిల్లాలో గొర్రెలపై కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో 30కి పైగా మూగజీవాలు చనిపోయాయి. మరికొన్ని గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం, జగిత్యాల జిల్లా మోతె గ్రామంలో మల్లేశం అనే రైతు గొర్రెలను పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజు మాదిరి వాటిని మేతకు తీసుకువెళ్లి తిరిగి వచ్చారు. ఒంట్లో కాస్త నలతగా ఉండటంతో గొర్రెల షెడ్లో బాగా దోమలు ఉన్నాయని, ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకున్నాడు.
మరుసటి రోజు ఉదయం వచ్చి చూసే సరికి షెడ్లో 30కి పైగా గొర్రెలు మృతి చెంది ఉన్నాయి. ఇంకా 30, 40 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దృశ్యాన్ని చూసి మల్లేశం ఒక్కసారిగా కంగుతిన్నాడు. సుమారు రూ.3 లక్షల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశాడు. గాయాలైన జీవాలూ బతుకుతాయో లేదో అని వాపోయాడు. ప్రభుత్వం స్పందించి తనకు సహాయం చేయాలని కోరాడు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు.