అయోధ్య బాలరాముడికి బహుబలి కానుకలు - 1600 కేజీల గద, 1100కిలోల ధనుస్సు - 1600 KG Gada To Ayodhya Ram Mandir - 1600 KG GADA TO AYODHYA RAM MANDIR
🎬 Watch Now: Feature Video
Published : Jun 16, 2024, 12:51 PM IST
1600 KG Gada To Ayodhya Ram Mandir : అయోధ్య బాలరాముడికి ఇంకా కానుకలు వస్తూనే ఉన్నాయి. తాజాగా 1600 కిలోల గద, 1100 కిలోల రామ్ ధనుస్సును రాజస్థాన్‌కు చెందిన సుమేర్‌పుర్ శ్రీజీ సనాతన్ సేవా సంస్థ కానుకగా ఇవ్వనుంది. జూన్ 12న అయోధ్యకు బయలు దేరిన ఈ కానుకలు జూన్ 16న రామమందిరానికి చేరుకుంటాయి. జూన్ 17న ప్రత్యేక పూజలు చేసి బాలరాముడి సమర్పించునున్నారు. ఈ భారీ గదను 26 అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పుతో రూపొందించారు. రామ్ ధనుస్సును 31 అడుగుల ఎత్తుతో 5 లోహలతో కలిపి తయారు చేశారు. మొత్తం 24 మందికి పైగా కళాకారులు కలిసి వీటిని రూపొందించిన్నట్లు శ్రీజీ సనాతన్ సేవా సంస్థ పేర్కొంది. శ్రీరామ నవమి రోజు నుంచి తయారు చేయడం ప్రారంభించామని తెలిపింది.
హనుమాన్కు 700 కిలోల గద
700 KG Gada to Ghazipur Hanuman temple : ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజిపుర్ హనుమాన్కు 700 కిలోల భారీ గదను కానుకగా ఇచ్చారు. రాయబరేలీలోని మహారాజ్‌గంజ్‌కు చెందిన రామ్ కుమార్ యాదవ్ గదను ఇస్తున్నారు. మొత్తం 18 మంది కళాకారులతో 45 రోజలు పాటు శ్రమించి 22 అడుగుల ఎత్తులో దీనిని రూపొందించారు. జూన్ 16 సాయంత్రం హనుమాన్ దేవాలయ ప్రవేశ ద్వారం వద్ద ప్రతిష్ఠాపన చేయనున్నారు.