ETV Bharat / technology

యూట్యూబ్​లో కొత్త ఫీచర్లు- వీటి ఉపయోగం తెలిస్తే వావ్ అనాల్సిందే!- ఇవెలా పనిచేస్తాయంటే? - YOUTUBE NEW FEATURES

యూట్యూబ్​లో సరికొత్త ఫీచర్స్- ఇకపై టైమ్​ సెట్​ చేసుకుని హాయిగా నిద్రపోవచ్చు!

Youtube New Features
Youtube New Features (Youtube Blog)
author img

By ETV Bharat Tech Team

Published : Oct 16, 2024, 7:03 PM IST

Youtube New Features: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ యూట్యూబ్‌ యూజర్లను ఆకర్షించడంలో భాగంగా కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. స్లీప్‌ టైమర్‌, రీసైజబుల్‌ మినీ ప్లేయర్‌, ఫేవరెట్‌ ప్లే లిస్ట్.. వంటి అనేక కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. ఈ విషయాన్ని కంపెనీ తన బ్లాగ్‌పోస్ట్‌ ద్వారా వెల్లడించింది. ఈ కొత్త ఫీచర్లు ఎలా పనిచేయనున్నాయో కూడా అందులో వివరంగా తెలిపింది.

స్లీప్‌ టైమర్‌:

  • యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూనే చాలామంది నిద్రలోకి జారుకుంటారు.
  • దీంతో వీడియోలు అలానే ప్లే అవుతూ ఉంటాయి.
  • ఈ సమస్యకు చెక్‌ పెడుతూ యూట్యూబ్‌ సరికొత్త స్లీప్‌ టైమర్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది.
  • ఈ కొత్త ఫీచర్‌ సాయంతో టైమర్‌ని సెట్‌ చేసుకొని యూట్యూబ్‌లో వీడియోస్​ ప్లే చేయొచ్చు.
  • మనం సెట్ చేసుకున్న టైమ్ అయిపోగానే మనం వీడియో ఆఫ్‌ చేయడం మర్చిపోయినా, నిద్రలోకి జారుకున్నా వీడియో ఆటోమెటిక్​గా ఆగిపోతుంది.

స్లీప్​ టైమర్​ ఫీచర్​ను యాక్టివేట్ చేసుకోవడం ఎలా?:

  • యూట్యూబ్​లో వీడియో ప్లే చేశాక స్క్రీన్‌పై కనిపించే సెట్టింగ్స్ ఐకాన్‌ని ట్యాప్‌ చేయగానే 'Sleep Timer' ఆప్షన్‌ కన్పిస్తుంది.
  • దానిపై క్లిక్‌ చేసి మీకు కావాల్సినంత టైమ్​ను సెట్​ చేసుకోవచ్చు.
  • ఇంతకుముందు ప్రీమియం యూజర్లకు మాత్రమే పరిమితం చేసిన ఈ ఫీచర్​ను యూట్యూబ్​.. ప్రస్తుతం అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది.

ప్లే లిస్ట్‌కు థంబ్‌నైల్స్‌:

  • యూట్యూబ్​లో ప్లే లిస్ట్​ను క్రియేట్ చేసుకునే ఫెసిలిటీ ఇప్పటికే ఉంది.
  • ప్రస్తుతం వాటిని క్యూఆర్‌ కోడ్‌ సాయంతో నచ్చిన వ్యక్తులకు పంపే ఆప్షన్​ను కొత్తగా తీసుకొచ్చింది.
  • అంతేకాక ఆ లిస్ట్‌కు నచ్చిన థంబ్‌నైల్స్‌ను AI సాయంతో రూపొందించుకోవచ్చు.
  • అందులో కావాలంటే మీ ఫొటోలను కూడా పెట్టుకోవచ్చని యూట్యూబ్‌ తెలిపింది.

నచ్చినట్లుగా మినీ ప్లేయర్‌:

  • మల్టీటాస్కింగ్‌లో భాగంగా మినీ ప్లేయర్‌లో కొత్త సదుపాయాలను యూట్యూబ్‌ జత చేసింది.
  • సాధారణంగా యూట్యూబ్‌లో మినీ ప్లేయర్‌ కుడివైపు కిందిభాగంలో కన్పిస్తుంది.
  • దాన్ని ఏవైపు కదిలించకుండా మన పని మనం చేసుకోవచ్చు.
  • అయితే ఇకపై మీ మినీ ప్లేయర్‌ని మీకు నచ్చిన చోటుకు మార్చుకోవచ్చు.
  • అంతేకాక కావాలంటే దాని సైజ్‌ను కూడా పెంచడం లేదా తగ్గించడం చేసుకోవచ్చని తెలిపింది.

బ్యాడ్జ్ సదుపాయం:

  • వీటితో పాటు యూట్యూబ్‌, యూట్యూబ్‌ మ్యూజిక్‌ యాప్‌ల కోసం బ్యాడ్జ్ సదుపాయాన్ని తీసుకొచ్చింది.
  • వీటిలో కొన్ని ఫీచర్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి.
  • మరికొన్ని ఫీచర్లు త్వరలోనే రానున్నాయని యూట్యూబ్​ వెల్లడించింది.

మార్కెట్లోకి శాంసంగ్ ఫస్ట్​ పిట్​నెస్​ రింగ్- ధర ఎంతో తెలుసా?​

హలో సైడ్​ ప్లీజ్- స్పేస్​ నుంచి రాయల్​ ఎన్​ఫీల్డ్​ ఈవీ వస్తోంది- టీజర్ చూశారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.