ETV Bharat / technology

షావోమీ 15 సిరీస్ స్మార్ట్​ఫోన్స్ లాంచ్- ఓయమ్మా ఇవేం ఫీచర్లు రా సామీ..! - XIAOMI 15 SERIES LAUNCH

బిగ్ బ్యాటరీ, లేటెస్ట్ చిప్​తో షావోమీ 15 సిరీస్- ఫీచర్లు చూస్తే ఫిదా అయిపోతారంతే..!

Xiaomi 15 Series Launched
Xiaomi 15 Series Launched (Xiaomi)
author img

By ETV Bharat Tech Team

Published : Oct 30, 2024, 5:01 PM IST

Updated : Oct 30, 2024, 5:20 PM IST

Xiaomi 15 Series Launch: మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్​ఫోన్స్ వచ్చాయి. చైనీస్ స్మార్ట్​ఫోన్ తయారీ కంపెనీ షావోమీ తన 15 సిరిస్ మొబైల్స్​ను లాంచ్ చేసింది. ఈ కొత్త ఫ్లాగ్​షిప్ సిరిస్​లో స్టాండర్డ్ షావోమీ 15, 15 ప్రో మోడల్స్ ఉన్నాయి. కంపెనీ.. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌తో లాంచ్ చేసిన ఈ మొబైల్స్ ప్రపంచవ్యాప్తంగా క్వాల్​కామ్ లేటెస్ట్ చిప్​తో వచ్చిన మొట్టమొదటి స్మార్ట్​ఫోన్స్​. అయితే షావోమీ ఈ మొబైల్స్​ను చైనా మార్కెట్లో లాంచ్ చేసింది. త్వరలో ఇండియన్ మార్కెట్లోకి రానున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా వీటి ధర, ఫీచర్లపై మరిన్ని వివరాలు మీకోసం.

షావోమీ 15 సిరీస్ కెమెరా: ఫొటోస్, వీడియోస్ కోసం షావోమీ రెండు స్మార్ట్​ఫోన్లలో ట్రిపుల్​-కెమెరా సెటప్​ను అందించేందుకు Leicaతో తన భాగస్వామ్యాన్ని కొనసాగించింది. షావోమీ 15, షావోమీ 15 ప్రో రెండూ 50MP ప్రైమరీ కెమెరా సెన్సార్, 50MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌ను కలిగి ఉన్నాయి. దీని స్టాండర్డ్ మోడల్ 3.2x జూమ్‌తో 50MP టెలిఫోటో కెమెరాతో వస్తుంది. అయితే ప్రో మోడల్ 5x జూమ్‌తో 50MP సోనీ IMX858 పెరిస్కోపిక్ లెన్స్‌తో వస్తుంది.

ఈ రెండు స్మార్ట్​ఫోన్స్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌తో వస్తున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా క్వాల్​కామ్ లేటెస్ట్ చిప్​తో వచ్చిన మొదటి స్మార్ట్​ఫోన్స్​గా ఇవి నిలిచాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లను కంపెనీ 16GB RAM, 1TB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఆప్షన్స్​లో అందించింది. అయినప్పటికీ షావోమీ 15 ప్రో.. స్టాండర్డ్ మోడల్​లోని 5400mAh బ్యాటరీతో పోలిస్తే పెద్ద 6100mAh బ్యాటరీతో వస్తుంది.

షావోమీ 15 స్పెసిఫికేషన్స్:

  • డిస్‌ప్లే: 6.36-అంగుళాల మైక్రో-కర్వ్డ్ OLED (LTPO)
  • రిజల్యూషన్: 1.5K
  • రిఫ్రెష్ రేట్: 120Hz
  • బ్రైట్‌నెస్: 3200 nits
  • ప్రాసెసర్: Qualcomm Snapdragon 8 Elite
  • RAM: 16GB వరకు (LPDDR5X)
  • స్టోరేజీ: గరిష్టంగా 1TB (UFS 4.0)
  • బ్యాక్ కెమెరా: 50MP ప్రైమరీ (OIS) + 50MP అల్ట్రా-వైడ్ + 50MP టెలిఫోటో (3.2x జూమ్)
  • ఫ్రంట్ కెమెరా: 32MP
  • బ్యాటరీ: 5400mAh
  • ఛార్జింగ్: 90W వైర్డ్, 50W వైర్‌లెస్
  • OS: Android 15 బేస్డ్ HyperOS 2

షావోమీ 15 ప్రో స్పెసిఫికేషన్స్:

  • డిస్‌ప్లే: 6.73-అంగుళాల OLED (LTPO)
  • రిఫ్రెష్ రేట్‌: 120Hz
  • రిజల్యూషన్: 2K

  • బ్యాక్ కెమెరా: 50MP ప్రైమరీ (OIS) + 50MP అల్ట్రా-వైడ్ + 50MP పెరిస్కోపిక్ టెలిఫోటో (5x జూమ్)
  • ఫ్రంట్ కెమెరా: 32MP
  • బ్యాటరీ: 6100mAh
  • ఛార్జింగ్: 90W వైర్డ్, 50W వైర్‌లెస్
  • OS: Android 15 బేస్డ్ HyperOS 2

ఇండియాలో లాంచ్..?: ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో షావోమీ 14 సిరీస్ సేల్స్ కొనసాగుతున్నాయి. షావోమీ 15 సిరీస్​ చైనా మార్కెట్లో లాంచ్ చేశారు. ఈ సిరీస్​ త్వరలో ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతాయని అంతా భావిస్తున్నారు. అయితే దీని లాంచ్ టైమ్​లైన్​ గురించి కచ్చితమైన సమాచారం ఇంకా రివీల్ అవ్వలేదు.

మార్కెట్లో యాపిల్ జోరు- సూపర్ స్పీడ్​ మినీ డెస్క్​టాప్ కంప్యూటర్ లాంచ్

దీపావళి వేళ ఖరీదైన మోటార్​సైకిల్ లాంచ్- కొంటే ఇలాంటి బైక్ కొనాలి భయ్యా..!

Last Updated : Oct 30, 2024, 5:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.