Worlds First Tri Foldable Smartphone: టెక్ మార్కెట్లో రాణించాలంటే కస్టమర్ల అభిరుచి, ఆసక్తికి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త రకం ప్రొడక్ట్స్‌ను విడుదల చేయాలి. దీంతో ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థలు కొత్త తరహా మొబైల్స్‌ను తీసుకొచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఫోల్డబుల్ మొబైల్స్‌దే హవా. మార్కెట్లో ఫోల్డబుల్ మొబైల్ ఫోన్స్‌కు మంచి క్రేజ్ ఉంది. దీంతో ఈ తరహా స్మార్ట్ఫోన్లపై అనేక సంస్థలు ఫోకస్ చేశాయి.
కస్టమర్ల అభిరుచి, ఆసక్తికి అనుగుణంగా వీటిని రూపొందించి మార్కెట్లో రిలీజ్ చేసేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తన ఫస్ట్ ట్రై ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో హువావే లాంచ్ చేసింది. దీంతో ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రై ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ చేసిన కంపెనీగా హువావే అవతరించింది. సెప్టెంబర్ 20 నుంచి ఈ ట్రై పోల్డ్ మొబైల్స్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో దీని ధర, ఫీచర్లుపై ఓ లుక్కేద్దామా?
Huawei Mate XT Features:
- డిస్‌ప్లే: 6.4 అంగుళాల ఓఎల్‌ఈడీ
- అన్‌ఫోల్డ్ చేసినప్పుడు డ్యూయల్ స్క్రీన్: 7.9 అంగుళాలు
- ట్రిపుల్ స్క్రీన్ ఓపెన్ చేస్తే డిస్‌ప్లే: 10.2 అంగుళాలు
- పూర్తిగా అన్‌ఫోల్డ్ చేశాక ఈ ఫోన్ మందం: 3.6ఎంఎం
- ప్రాసెసర్: కిరిన్ 9 సిరీస్
- మెయిన్ కెమెరా: 50 ఎంపీ
- యాంగిల్ కెమెరా: 12 ఎంపీ అల్ట్రా వైడ్
- టెలీఫొటో లెన్స్: 12 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా: 8 ఎంపీ
- బ్యాటరీ: 5,600ఎంఏహెచ్
- 66W వైర్డ్ ఛార్జింగ్
- 50W వైర్‌లెస్ ఛార్జింగ్
వేరియంట్స్:
- 16జీబీ+256జీబీ వేరియంట్
- 512 స్టోరేజీ వేరియంట్
- 1టీబీ వేరియంట్
The world's first trifold phone is here❗️
— Ben Geskin (@BenGeskin) September 10, 2024
Huawei Mate XT | Ultimate Design
Starting at ¥19999 ($2800) pic.twitter.com/PaGlmhbHqG
ధరలు:
- 16జీబీ+256జీబీ వేరియంట్ ధర: 19,999 యువాన్లు
- 512 స్టోరేజీ వేరియంట్ ధర: 21,999 యువాన్లు
- 1టీబీ వేరియంట్ ధర: 23,999 యువాన్లు
ఇండియన్ కరెన్సీ ప్రకారం ధరలు:
- 16జీబీ+256జీబీ వేరియంట్ ధర: రూ.2.35 లక్షలు
- 512 స్టోరేజీ వేరియంట్ ధర: రూ.2.59 లక్షలు
- 1టీబీ వేరియంట్ ధర: రూ.2.83 లక్షలు
అయితే భారత్ గానీ, ప్రపంచంలోని ఇతర మార్కెట్లలో గానీ హువావే మేట్ ఎక్స్‌టీ ఫోన్ లాంచ్ చేసే అవకాశం లేదని టెక్ వర్గాలు చెబుతున్నాయి. కాగా టెక్నో సంస్థ కూడా ఈ తరహా ట్రై ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇటీవలే దీని ఫస్ట్ లుక్‌ను కూడా రిలీజ్ చేసింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తుందనే విషయాన్ని ఇంకా వెల్లడించలేదు. వచ్చే ఏడాది ముగిసేలోగా టెక్నో ట్రై ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అందుబాటులోకి రానున్నట్లు టెక్ నిపుణులు అంచనా.