Top Trending Cars With Low Budget in India: ఇంతకుముందు కేవలం ధనవంతుల ఇంట్లోనే కారు ఉండేది. అయితే ప్రస్తుతం ప్రతి ఇంట్లో కారు ఉండటం కామన్ అయిపోయింది. సొంతింటి తర్వాత కారు కొనేందుకే ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో కార్ల సెల్స్ భారీగా పెరిగిపోతున్నాయి. కస్టమర్ల అభిరుచి, ఆసక్తికి తగినట్లుగా అన్ని కంపెనీలు ఎప్పటికప్పుడు సరికొత్త కార్లను లాంచ్ చేస్తున్నాయి. దీంతో కొత్తగా కారు కొనాలని అనుకునేవారు ఏది కొనాలో తెలియక తికమక పడుతున్నారు. దీంతోపాటు వారి బడ్జెట్లో మంచి మైలేజ్ ఉన్న కారు దొరుకుతుందో లేదో అని సందేహపడుతుంటారు. అలాంటివారి కోసం మార్కెట్లో బెస్ట్ ఫీచర్లతో ట్రెండింగ్‌లో ఉన్న టాప్ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీటిని చూస్తే మీ బడ్జెట్లో ఏ కారు బెస్ట్‌గా ఉంటుందో మీకు ఓ క్లారిటీ వస్తుంది.
1. Maruti Suzuki Alto K10:
మైలేజ్: 24.39 to 33.85 కి.మీ/లీటర్
ఇంజిన్: 998 సీసీ
సేఫ్టీ: 2స్టార్ (గ్లోబల్ ఎన్‌క్యాప్)
ఫ్యూయల్ టైప్: పెట్రోల్ అండ్ సీఎన్జీ
ట్రాన్స్ మిషన్: మాన్యువల్ / ఆటోమాటిక్
సింటింగ్ కెపాసిటీ: 4 & 5 సీటర్
ధర: రూ. 4.79 లక్షలు
2. Maruti Suzuki Swift Hatchback:
మైలేజ్: 24.8 to 25.75 కి.మీ/లీటర్
ఇంజిన్: 1197 సీసీ
ఫ్యూయల్ టైప్: పెట్రోల్
ట్రాన్స్ మిషన్: మాన్యువల్ / ఆటోమేటిక్
సీటింగ్ కెపాసిటీ: 5 సీటర్
ధర: రూ. 7.83 లక్షలు
3. Tata Tiago Hatchback:
ఇంజిన్: 1199 సీసీ
టార్క్: 95 ఎన్ఎం- 113 ఎన్ఎం
మైలేజ్: 19 నుంచి 20.09 కి.మీ/ లీటర్
పవర్: 72.41 - 84.48 బీహెచ్పీ
ట్రాన్స్ మిషన్: ఆటోమేటిక్ / మాన్యువల్
ఫ్యూయల్ టైప్: పెట్రోల్ అండ్ సీఎన్జీ
ధర: రూ. 5.65 లక్షల నుంచి రూ. 8.90 లక్షలు(ఎక్స్-షోరూమ్)
4. Hyundai EXTER:
ఇంజిన్: 1197 సీసీ
టార్క్: 95.2 ఎన్ఎం- 113.8 ఎన్ఎం
డ్రైవ్ టైప్: FWD
పవర్: 67.72 - 81.8 బీహెచ్పీ
ట్రాన్స్ మిషన్: మాన్యువల్ / ఆటోమేటిక్
మైలేజ్: 19.2 నుంచి 19.4 కి.మీ/లీటర్
ధర: రూ. 6.13 - 10.43 లక్షలు