ETV Bharat / technology

ఆండ్రాయిడ్ ఫోన్​తో బెస్ట్​ ఫొటోస్​, వీడియోస్ తీయాలా? టాప్-10 టిప్స్ & ట్రిక్స్​ ఇవే! - Android Camera Tips And Tricks - ANDROID CAMERA TIPS AND TRICKS

Android Camera Tips And Tricks : మీ దగ్గర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ ఉంటే చాలు. మీరు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్‌గా మారిపోవచ్చు. కొన్ని టిప్స్, ట్రిక్స్​తో హై క్వాలిటీ ఫొటోస్​, వీడియోస్​ తీసేయొచ్చు. మరి ఆ టిప్స్ అండ్ ట్రిక్స్​ ఏమిటో చూద్దామా?

Mastering Android Camera
Android Camera Tutorial (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 26, 2024, 5:11 PM IST

Android Camera Tips And Tricks : మీ దగ్గర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ ఉందా? అయితే మీరు కూడా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్‌కు ధీటుగా తయారు కావచ్చు. కొన్ని టూల్స్, ఫీచర్స్, ప్రత్యేకమైన సెట్టింగ్స్‌ను వినియోగించుకొని హై క్వాలిటీ ఫొటోలను ఫోన్ కెమెరాలోనే బంధించవచ్చు. ఇందుకోసం మీరు ఫోటోగ్రఫీలో డిగ్రీ చేయాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని టిప్స్ గురించి తెలుసుకుంటే చాలు. ఇక మీ ఫొటోలకు లైకులు వెల్లువెత్తడమే తరువాయి.

1. గ్రిడ్స్‌
ఫోన్ కెమెరాలో ఫొటోను తీసేటప్పుడు గ్రిడ్స్‌ ఫీచర్‌ను వాడటం బెటర్. మొత్తం 9 దీర్ఘచతురస్ర గ్రిడ్స్‌కుగానూ కనీసం మూడోవంతు భాగంలో సీన్ కవరయ్యేలా చూడాలి. ఇలా చేస్తే ఫొటో ఫ్రేమింగ్‌లో చాలా కచ్చితత్వం ఉంటుంది. సీన్ సమగ్రంగా కెమెరాలో కవర్ అవుతుంది. ఈ గ్రిడ్స్‌ను మనం ఎంత సమర్ధంగా వాడుకుంటే, ఫొటో అంత క్వాలిటీతో వస్తుంది. ఫోన్ వినియోగదారులు కెమెరా యాప్‌లోని సెట్టింగ్‌లలోకి వెళ్లి గ్రిడ్ లైన్‌లను ఆన్ చేయాలి. కొద్దిగా భిన్నమైన గోల్డెన్ రేషియో కోసం గ్రిడ్ లైన్‌ల వంటి అదనపు ఆప్షన్లను కూడా వాడుకోవచ్చు.

2. హై డైనమిక్ రేంజ్
హై డైనమిక్ రేంజ్ (హెచ్‌డీఆర్) అనే ఫీచర్ టెలివిజన్‌లు, స్మార్ట్‌ఫోన్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ ఫీచర్ ప్రభావంతో ఫొటోలకు అదనపు మెటాడేటా జత కలుస్తుంది. తద్వారా మనం ఫొటోను తీసేటప్పుడు ఏయే కలర్ ఎంతెంత మోతాదులో ఉండాలనే దానిపై గైడెన్స్ లభిస్తుంది. హెచ్‌డీఆర్ ఫీచర్ కారణంగా రంగులకు సంబంధించిన గైడెన్స్‌ను స్క్రీన్ మనకు లెక్కలేసి మరీ చెప్పగలుగుతుంది. వాస్తవానికి అన్ని స్మార్ట్‌ఫోన్ కెమెరాలలో హెచ్‌డీఆర్ ఫీచర్ అందుబాటులో ఉండదు. ఈ ఫీచర్ ఉండాలంటే ఫోనులో 1000 నిట్‌ల బ్రైట్‌నెస్ రేటింగ్‌తో డిస్‌ప్లే అవసరం. సరికొత్త మోడళ్ల ఫోన్లలోనే హెచ్‌డీఆర్ ఫీచర్ లభిస్తుంది. ఫోనులోని కెమెరాను ఓపెన్ చేసి, స్క్రీన్‌పై ఉన్న హెచ్‌డీఆర్ బటన్‌ను నొక్కాలి. శాంసంగ్ హెచ్‌డీఆర్10+ అనేది హెచ్‌డీఆర్ యొక్క అప్‌గ్రేడెడ్ వెర్షన్. ఇది కొన్ని ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్‌లలోనే అందుబాటులో ఉంటుంది.

3. లాక్ స్క్రీన్ నుంచి కెమెరాను తెరవడం
చాలా మందికి లాక్ స్క్రీన్ నుంచి కెమెరా యాప్‌ను తెరవడం ఎలాగో తెలియదు. వాస్తవానికి ఇది చాలా ఈజీ. ఇందుకోసం ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి, అందులోని 'సిస్టమ్' అనే ఆప్షన్‌లోకి వెళ్లాలి. ఇందులో 'గెశ్చర్స్' అనే మరో ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే 'ఎనేబుల్ కెమెరా క్విక్ లాంఛ్​' అనే ఆప్షన్ వస్తుంది. దీన్ని క్లిక్ చేసి ఎనేబుల్ చేసుకోవాలి. దీంతో ఫోన్‌లోని పవర్ బటన్‌ను రెండుసార్లు ప్రెస్ చేయగానే కెమెరా తెరుచుకుంటుంది. కెమెరా విడ్జెట్‌ను లాక్ స్క్రీన్‌పై ఉంచుకోవడం ద్వారా కూడా వెంటనే మనం కెమెరాను తెరవొచ్చు.

4. ట్రైపాడ్
స్మార్ట్‌ఫోన్‌ను చేతిలో పట్టుకొని ఫొటోలు తీసేటప్పుడు, మన చేతులు వణికే అవకాశం ఉంటుంది. దీనివల్ల మొత్తం ఫొటో ఫ్రేమ్ చెదిరిపోతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే, ట్రైపాడ్‌ను వాడాలి. మీరు టైమ్ లాప్స్ వీడియో తీయాలనుకున్నప్పుడు కూడా ట్రైపాడ్ చాలా ఉపయోగపడుతుంది. ఫోన్ నిశ్చలంగా ఉండటం వల్ల ఫొటో క్లారిటీ అద్భుతంగా వస్తుంది. ఫొటో షాట్‌లకు మంచి యాంగిల్‌ను ఎంపిక చేసుకునేందుకు కూడా ట్రైపాడ్‌లు అనువుగా ఉంటాయి.

5. అరచేతితో సెల్ఫీలు, గ్రూప్ ఫోటోలు
గ్రూప్ ఫొటోలు, సెల్ఫీలు దిగడానికి చాలా ఉపయోగపడే ఫీచర్ 'పామ్ డిటెక్షన్'. కెమెరా సెట్టింగ్స్‌లోకి వెళ్లి 'పామ్ డిటెక్షన్' ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. అనంతరం మీరు ఫొటో దిగేటప్పుడు, అరచేతిని కెమెరా లెన్స్ వైపు చూపించాలి. ఆ వెంటనే 3 సెకన్ల టైమర్ ఆన్ అవుతుంది. అది సున్నాకు చేరగానే కెమెరా మన గ్రూప్ ఫొటో లేదా సెల్ఫీ ఫొటోను తనలో బంధిస్తుంది. ఫొటో తీసేందుకు ఎవరూ లేని టైంలో ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ ఫీచర్‌ను వాడే క్రమంలో మనం ఫ్రంట్ కెమెరాను మాత్రమే వాడాల్సి ఉంటుంది. అందువల్ల ఫొటో క్వాలిటీ అంత బెటర్‌గా రాకపోవచ్చు.

6. చీకటిలో అద్భుతం - 'నైట్ మోడ్‌'
రాత్రి సమయంలో ఫొటోలు అంత క్లియర్‌గా రావు. అయితే ఆ టైంలో ఫొటోలు దిగేటప్పుడు మనం తప్పకుండా నైట్ మోడ్ ఆప్షన్‌ను ఆన్ చేసుకోవాలి. ఈ ఆప్షన్‌ను వాడితే వివిధ ఎక్స్‌పోజర్ స్థాయిలతో ఒకే సమయంలో అనేక ఫోటోలను కెమెరా తీస్తుంది. మనం వీటన్నింటిని చూసి, సరైన ఫొటోను ఎంపిక చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ వాడేటప్పుడు ప్రతికూల అంశం ఏమిటంటే, ఇది ఆన్‌లో ఉన్నప్పుడు ఫోటో తీయడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. గూగుల్‌కు చెందిన ఆస్ట్రోఫోటోగ్రఫీ మోడ్, శాంసంగ్‌కు చెందిన ఆస్ట్రోఫోటో మోడ్‌లతో ఆకాశం ఫొటోలను అద్భుతంగా తీయొచ్చు.

7. టైమ్ లాప్స్, స్లో మోషన్‌
ఆండ్రాయిడ్ కెమెరా యాప్‌లో స్లో మోషన్ సెట్టింగ్ కూడా ఉంటుంది. ఇది అధిక ఫ్రేమ్ రేట్‌తో వీడియో ఫుటేజీని క్యాప్చర్ చేయడానికి, తక్కువ వేగంతో రీప్లే చేయడానికి ఉపయోగపడతుంది. ఈ ఆప్షన్‌ను ఆన్ చేస్తే డీఫాల్ట్ సెట్టింగ్ సాధారణంగా సమయాన్ని నాలుగు రెట్లు మేర తగ్గిస్తుంది. కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లు రియల్ టైం ఫుటేజీ కంటే ఎనిమిది లేదా 16 రెట్లు నెమ్మదిగా స్లోమోషన్ వీడియోలను రికార్డ్ చేయగలవు. ఇలాంటి వీడియోను తీసేటప్పుడు ఫోన్‌ను స్థిరంగా కదల్చకుండా ఉంచాలి. స్లో మోషన్ రికార్డింగ్‌లకు పూర్తి వ్యతిరేకంగా ఉండేవే టైమ్-లాప్స్ వీడియోలు. సూర్యాస్తమయం, ఒక ప్రదేశంలో సుదీర్ఘ నడక వంటివి టైమ్ లాప్స్‌ వీడియోలు అద్భుతంగా ఉంటాయి.

8. పోర్ట్రెయిట్ మోడ్
పోర్ట్రెయిట్ మోడ్ అంటే ఫొటోలను నిలువుగా తీయడం. ఈ మోడ్‌ను వాడినప్పుడు ఫొటోలోని వ్యక్తి జూమ్ అయి కనిపిస్తాడు. దీనివల్ల వ్యక్తి ముఖం బాగా హైలైట్ అవుతుంది. అయితే బ్యాక్ గ్రౌండ్ పెద్దగా హైలైట్ కాదు. ఈ మోడ్ ఒక్కో ఫోన్‌లో ఒక్కో రకమైన క్వాలిటీలో లభిస్తుంది. కెమెరా యాప్ దిగువన ఒక మెనూ ఉంటుంది, దాని ద్వారా వినియోగదారులు పోర్ట్రెయిట్ మోడ్ ఆప్షన్‌ను ఆన్ చేయొచ్చు. ఈ మోడ్‌లో ఫొటో తీసేటప్పుడు మొహంపైకి లైటింగ్ సరిగ్గా ప్రసరిస్తుందో, లేదో తప్పకుండా చెక్ చేసుకోవాలి.

9. గూగుల్ మ్యాజిక్ ఎరేజర్
ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం గూగుల్ చాలా ఫీచర్లు తెచ్చింది. గూగుల్ ఫొటోస్ యాప్‌ని మనం డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఈ యాప్‌లో మంచి ఎడిటింగ్ టూల్స్ ఉన్నాయి. ఈ యాప్‌లో ఫొటోను తెరిచి, స్క్రీన్ దిగువన ఉన్న సవరణ బటన్‌ను క్లిక్ చేయాలి. ఫిల్టర్‌లను జోడించడం, కాంట్రాస్ట్ వంటి అనేక ఆప్షన్లను ఇది అందిస్తుంది. ఒకవేళ మీరు గూగుల్ వన్ సబ్‌స్క్రైబర్ అయితే ఫోన్ కెమెరాలో మ్యాజిక్ ఎరేజర్ అనే ఆప్షన్ ఉంటుంది. మీ ఫోటోలో మీరు కోరుకోని ఎవరైనా లేదా ఏదైనా ఉన్నట్లు గమనిస్తే, ఈ ఫీచర్ ద్వారా తీసేయొచ్చు. మీరు టూల్‌ను తెరిచి, ఫొటోలో తొలగించాల్సిన అంశం చుట్టూ సర్కిల్ డ్రా చేయాలి. దీంతో వెంటనే అది తొలగిపోతుంది.

10. ఇమేజ్ ఫార్మాట్
ఫోన్ కెమెరాలో మనం తీసే ఫొటోలను జేపీఈజీ వంటి ఫార్మాట్లలో సేవ్ చేయాలి. దీనివల్ల ఫొటో నాణ్యత దెబ్బతినదు. ఇలా సేవ్ చేసుకున్న ఫొటోలను నాణ్యత దెబ్బతినకుండా మన అవసరాలకు అనుగుణంగా ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో రా ఫార్మాట్‌లోనే ఫొటోలు ఆటోమేటిక్‌గా సేవ్ అయిపోతుంటాయి.

మీరు బైక్ లవర్సా? ఈ పిచ్చెక్కించే 'కాన్సెప్ట్ బైక్స్'​ను ఎప్పుడైనా చూశారా? - Crazy Concept Bike

రూ.1000 బడ్జెట్లో మంచి ఇయర్​బడ్స్ కొనాలా? టాప్​-10 ఆప్షన్స్ ఇవే! - Best Earbuds Under 1000

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.