ETV Bharat / technology

స్మార్ట్​ఫోన్ ప్రియులకు శుభవార్త- ఆరేళ్ల పాటు సెక్యూరిటీ, సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్​తో శాంసంగ్ మొబైల్ - SAMSUNG GALAXY A16 5G

శాంసంగ్‌ గెలాక్సీ ఏ16 5జీ లాంచ్- ధర, ఫీచర్లు ఇవే..!

Samsung Galaxy Mobiles
Samsung Galaxy Mobiles (Samsung)
author img

By ETV Bharat Tech Team

Published : Oct 18, 2024, 5:46 PM IST

Samsung Galaxy A16 5G: స్మార్ట్​ఫోన్ ప్రియులకు గుడ్​న్యూస్. మార్కెట్లోకి శాంసంగ్​ నుంచి అదిరే ఫీచర్లతో కొత్త ఫోన్ వచ్చింది. A సిరీస్‌లో ఫోన్లకు మంచి ప్రజాదరణ వస్తున్న నేపథ్యంలో శాంసంగ్‌ గెలాక్సీ ఏ16 5జీ పేరుతో కంపెనీ దీన్ని లాంచ్ చేసింది. శాంసంగ్.. ఈ కొత్త గెలాక్సీ ఏ16 5జీ స్మార్ట్​ఫోన్​ను ఆరేళ్ల పాటు సెక్యూరిటీ, సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్లతో తీసుకురావడం విశేషం. మైక్రో ఎస్‌డీ కార్డ్‌ సాయంతో దీనిలో 1TB వరకు స్టోరేజీ పెంచుకొనే సదుపాయం ఉందని కంపెనీ చెబుతోంది. అంతేకాక ఈ ఫోన్​ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండున్నర రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌ వస్తుందని శాంసంగ్ తెలిపింది. ఈ సందర్భంగా ఈ కొత్త శాంసంగ్ గెలాక్సీ ఏ16 5జీ స్మార్ట్​ఫోన్ ధర, ఫీచర్స్ వంటి వివరాలు మీకోసం.

శాంసంగ్‌ గెలాక్సీ ఏ16 5జీ ఫీచర్స్:

  • డిస్‌ప్లే: 6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ అమోలెడ్‌
  • రిఫ్రెష్‌ రేటు: 90Hz
  • ప్రాసెసర్‌: మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300
  • మెయిన్ కెమెరా: 50ఎంపీ
  • అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ సెన్సర్‌: 5ఎంపీ
  • మ్యాక్రో లెన్స్‌: 2ఎంపీ
  • ఫ్రంట్​ కెమెరా: 13ఎంపీ
  • బ్యాటరీ: 5,000mAh
  • 25W ఛార్జింగ్‌ సపోర్ట్‌

శాంసంగ్‌ గెలాక్సీ ఏ16 5జీ వేరియంట్స్:

  • 8జీబీ + 128జీబీ వేరియంట్‌
  • 8జీబీ +256జీబీ వేరియంట్‌

శాంసంగ్‌ గెలాక్సీ ఏ16 5జీ కలర్ ఆప్షన్స్:

  • బ్లూ బ్లాక్‌
  • గోల్డ్‌
  • లైట్‌ గ్రీన్‌

శాంసంగ్‌ గెలాక్సీ ఏ16 5జీ ధర:

  • 8జీబీ + 128జీబీ వేరియంట్‌ ధర: రూ. 18,999
  • 8జీబీ +256జీబీ వేరియంట్‌ ధర: రూ. 20,999

ఆ కార్డ్స్​తో రూ.1,000 వరకు డిస్కౌంట్​: ఈ కొత్త శాంసంగ్ గెలాక్సీ ఏ16 5జీ మొబైల్​ను అమెజాన్‌, ఫ్లిప్‌కార్డ్‌, శాంసంగ్‌ వెబ్‌సైట్లతో పాటు ఇతర రిటైల్‌ స్ట్రోర్స్​ ద్వారా కొనుగోలు చేయొచ్చని కంపెనీ తెలిపింది. యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్‌ సాయంతో కొనుగోలు చేస్తే వెయ్యి రూపాయల వరకు డిస్కౌంట్‌ అందిస్తోంది. IP54 రేటింగ్‌తో లాంచ్‌ చేసిన ఈ కొత్త గెలాక్సీ ఏ16 మొబైల్‌లో శాంసంగ్‌ నాక్స్‌ వాల్ట్‌ సెక్యూరిటీ ఫీచర్లు కూడా అందిస్తున్నట్లు శాంసంగ్ తెలిపింది.

యూత్​ఫుల్ లుక్​లో బజాజ్ పల్సర్​ N125- రిలీజ్ ఎప్పుడంటే?

గూగుల్​ పిక్సెల్ 9ప్రో సేల్స్ ప్రారంభం- ధర, ఫీచర్లు ఇవే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.