ETV Bharat / technology

స్మార్ట్‌ఫోన్‌ల తయారీలో భారత్‌ సరికొత్త రికార్డ్- భారీగా వృద్ధి రేటు..! - INDIA SMARTPHONE MARKET 2024

దూసుకుపోతున్న దేశీయ స్మార్ట్​ఫోన్ మార్కెట్- 47.1 మిలియన్ యూనిట్ల షిప్పింగ్​తో 9శాతం వృద్ధి: రిపోర్ట్

India Smartphone Market 2024
India Smartphone Market 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Tech Team

Published : Oct 21, 2024, 5:38 PM IST

India Smartphone Market 2024: ప్రస్తుతం స్మార్ట్​ఫోన్లదే హవా. మొబైల్ అందుబాటులో లేకుంటే పూట గడవని పరిస్థితిలో వీటి సేల్స్ భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త స్మార్ట్​ఫోన్లను తీసుకురావడంపై దృష్టి సారిస్తున్నాయి. కస్టమర్ల ఆసక్తి, అభిరుచికి అనుగుణంగా మార్కెట్లోకి కొత్త కొత్త మోడల్స్​ను తీసుకొస్తున్నాయి. దీంతో దేశీయ స్మార్ట్​ఫోన్ మార్కెట్ దూసుకుపోతున్నట్లు మార్కెట్ రీసెర్చ్ సంస్థ కెనాలిస్ నివేదిక తెలిపింది. రూరల్ డిమాండ్, మాన్​సూన్ సేల్స్ ప్రారంభంతో భారతీయ స్మార్ట్​ఫోన్ మార్కెట్ జూలై- సెప్టెంబర్ కాలంలో 9శాతం వృద్ధి చెందినట్లు తాజా నివేదిక వెల్లడించింది. ఈ మేరకు దేశీయంగా 47.1 మిలియన్ యూనిట్ల స్మార్ట్​ఫోన్లను షిప్పింగ్ చేసినట్లు పేర్కొంది.

"మార్కెట్‌లోని టాప్ బ్రాండ్‌లు తమ పోర్ట్‌ఫోలియోను మిడ్-హై రేంజ్‌లో విస్తరిస్తున్నాయి. పండుగ సేల్స్​ సమయంలో ఇన్వెంటరీని క్లియర్ చేసే అవకాశం ఉంది. అదే సమయంలో టాప్-5 అవుట్​ సైడ్​ బ్రాండ్స్​ మరో స్ట్రాంగ్ క్వార్టర్​లో ఉన్నాయి. ఆపిల్ ఐఫోన్ 15తో గణనీయమైన వాల్యూమ్స్​ను పెంచింది. వీటికి చిన్న సిటీల నుంచి భారీ డిమాండ్ వస్తోంది." - సన్యామ్ చౌరాసియా, సీనియర్ విశ్లేషకుడు

మోటరోలా, గూగుల్, నథింగ్ వంటి ఇతర బ్రాండ్స్​ ప్రత్యేకమైన డిజైన్, క్లీన్ యూజర్ ఇంటర్​ఫేస్, ఛానెల్ విస్తరణ స్ట్రాటజీలతో వాటి సేల్స్ పెంచుకుంటున్నాయి. ఈ క్రమంలో వీవో 19శాతం మార్కెట్ షేర్​, 9.1 మిలియన్ యూనిట్లను షిప్పింగ్​తో దూసుకుపోతూ మొదటిసారి పోల్​ పొజిషన్​ను క్లెయిమ్​ చేసింది. ఇక Xiaomi రెండో స్థానంలో నిలిచింది. ఇది దాని బడ్జెట్ 5G లైనప్​తో 7.8 మిలియన్ యూనిట్లను షిప్పింగ్ చేసింది. 7.5 మిలియన్ యూనిట్లతో శాంసంగ్ మూడో స్థానంలో నిలిచింది. OPPO (OnePlus మినహా) 6.3 మిలియన్ షిప్పింగ్​తో నాలుగో స్థానంలో నిలవగా realme 5.3 మిలియన్ యూనిట్లతో ఐదో స్థానంలో నిలిచింది.

నివేదిక ప్రకారం.. రీప్లేస్మెంట్, అప్​గ్రేడ్​ కొనుగోలుదారులు మిడ్​-టు-హై ఎండ్​ ఆఫర్స్​, కాంపిటీటివ్ ట్రేడ్-ఇన్ డీల్స్, యాక్సెస్ చేయగల ఫైనాన్సింగ్ ఆప్షన్‌ల కారణంగా అధిక ధర ఉన్న మోడల్స్​పై మొగ్గు చూపారు. అయితే పెరుగుతున్న ధరల కారణంగా కస్టమర్లు దీపావళి తర్వాత వీటిని కొనుగోలు చేయాల్సి రావడంతో ఎంట్రీ లెవల్ డిమాండ్ బలహీనంగా ఉంది.

"సాధారణంగా దీపావళి సీజన్‌కు ముందు బ్రాండ్‌లు ఆఫ్‌లైన్ విక్రయాలపై ఆధారపడతాయి. సంవత్సరాంతపు ఇన్వెంటరీ లెవల్స్​ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తాయి." అని చౌరాసియా చెప్పారు. H2 2024లో స్టాక్‌ను సమర్థవంతంగా నిర్వహించేందుకు భారీ తగ్గింపులు, ఛానెల్ మార్జిన్​లు పొడిగించడం వంటివి తప్పనిసరి అని నివేదిక పేర్కొంది.

వాట్సాప్​లో ఇంట్రస్టింగ్ చాట్ మెమరీ ఫీచర్!- ఇది ఎలా పనిచేయనుందంటే?

మార్కెట్లో ఏఐ హవా- 2028 నాటికి 730 మిలియన్ Gen AI స్మార్ట్‌ఫోన్స్​ షిప్‌మెంట్స్​: రిపోర్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.