New Bajaj Pulsar N125: స్వదేశీ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో ప్రొడక్ట్స్‌లో పల్సర్ మోడల్స్ క్రేజ్ వేరే లెవల్. దానికి తగ్గట్టుగానే కంపెనీ కూడా పాత మోడల్స్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా మార్కెట్లోకి మరో కొత్త పల్సర్ బైక్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ బైక్‌ను తీసుకురాబోతున్నట్లు కంపెనీ తెలిపినప్పటికీ దీని రిలీజ్ డేట్‌ను ఇంకా వెల్లడించలేదు. దీంతోపాటు ఈ బైక్‌కు సంబంధించిన ధర, టెక్నికల్ స్పెసిఫికేషన్స్ గురించి కూడా ఎలాంటి సమాచారాన్ని అందించలేదు. ఈ సందర్భంగా ఈ బజాజ్ పల్సర్ ఎన్125 గురించి ఇప్పటివరకు ఉన్న వివరాల గురించి తెలుసుకుందాం రండి.
ఈ కొత్త బజాజ్ పల్సర్ N125 విలక్షణమైన అగ్రెసివ్ పల్సర్ స్టైలింగ్‌ను కలిగి ఉంది. దీనిలో సరికొత్త LED హెడ్‌లైట్ యూనిట్, ముందుభాగంలో చాలా ప్లాస్టిక్ క్లాడింగ్‌ను అమర్చారు. ఈ మోటార్‌సైకిల్‌లో ఫోర్క్ కవర్, హెడ్‌లైట్ చుట్టూ ఉన్న ప్యానెల్‌ను ప్లాస్టిక్‌తో కవర్ చేశారు. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే హెడ్‌లైట్ చుట్టూ ఉన్న ప్లాస్టిక్ ప్యానెల్ మీకు కావాల్సిన షేడ్‌ను బట్టి అనేక కలర్ ఆప్షన్స్‌లో అందిస్తారు.
ఈ కొత్త బజాజ్ పల్సర్ N125 చక్రాలు.. పెద్ద పల్సర్ N150కి సమానంగా ఉంటాయి. దీని డిస్ప్లే, ఇండికేటర్స్ బజాజ్ ఇటీవల రిలీజ్ చేసిన ఫ్రీడమ్ 125 CNG మాదిరిగానే ఉంటాయి. అంటే బజాజ్ పల్సర్ N125ని బేసిక్ బ్లూటూత్ ఫంక్షనాలిటీతో తీసుకునిరావొచ్చు. యూత్‌కి తగ్గట్టుగా ఈ పల్సర్ N125లో సైడ్ ప్యానెల్స్, టెయిల్ విభాగంలో కొన్ని కొత్త గ్రాఫిక్స్‌తో తీసుకుని రానున్నారు. TVS రైడర్, Hero Xtreme 125R లాగానే ఈ కొత్త పల్సర్ N125 కూడా స్ప్లిట్ సీట్లు ఉంటాయి.
బజాజ్ పల్సర్ N125 ధర ఎంతంటే?: ఈ కొత్త బజాజ్ పల్సర్ N125 ధర మార్కెట్లో దీని ప్రత్యర్థులైన హీరో, TVSల మాదిరిగానే ఉంటుందని అంచనా. అంటే దీని ధర సుమారు రూ. 90,000 నుంచి రూ. 1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండొచ్చు.
కొత్త చీఫ్ టెక్నాలజిస్ట్‌ను నియమించిన గూగుల్- ఆయన ఎవరో తెలుసా?