NASA Discovers Long Sought Global Electric Field on Earth: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా భూమిపై మొట్ట మొదటిసారిగా విద్యుత్ క్షేత్రాన్ని గుర్తించింది. నాసాకు చెందిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం సుదీర్ఘ పరిశోధనల తర్వాత సబ్ ఆర్బిటాల్ రాకెట్ నుంచి పొందిన డేటాను ఉపయోగించి భూమిపై దీన్ని కనుగొన్నారు. ఇది కణాల గురుత్వాకర్షణ నుంచి తప్పించుకోవడానికి సహాయపడుతుంది. గత 6 దశాబ్దాల్లోని నాసా అతిపెద్ద ఆవిష్కరణల్లో ఇది ఒకటి. నాసా గుర్తించిన విద్యుత్ క్షేత్రానికి సంబంధించిన వివరాలను సోషల్ మాధ్యమం వేదిక ఎక్స్‌లో చేసిన పోస్ట్‌లో వెల్లడించింది.
విద్యుత్ క్షేత్రంపై 60 ఏళ్ల క్రితమే ఊహాగానాలు: భూమిపై వ్యాపించి ఉన్న విద్యుత్ క్షేత్రాన్ని 'అంబిపోలార్ ఎలక్ట్రిక్ ఫీల్డ్'గా పిలుస్తారు. భూమిపై ఈ విద్యుత్ క్షేత్రం ఉంటుందని 60 ఏళ్ల క్రితమే శాస్త్రవేత్తలు ఊహించారు. అయితే ఆ సమయంలో అందుబాటులో ఉన్న సాంకేతికతతో దీనిని గుర్తించటం చాలా కష్టం. ఈ నేపథ్యంలో 2016లో నాసా శాస్త్రవేత్త గ్లిన్ కొలిన్సన్, ఆయన బృందం భూమి బైపోలార్ ఫీల్డ్‌ను కొలిచేందుకు ఓ పరికరాన్ని కనుగొన్నారు. నాసా ఎండ్యూరెన్స్ మిషన్ రాకెట్ నుంచి పొందిన డేటాను ఉపయోగించి ఈ పరికరం ద్వారా దీని ఉనికిని గుర్తించారు. బైపోలార్ ఫీల్డ్ అనేది ఎగువ వాతావరణంలో బలహీనమైన విద్యుత్ క్షేత్రం ఛార్జ్డ్ కణాలను అంతరిక్షంలోకి బ్రౌన్స్ చేయగల ప్రాంతం.
Discovery alert! 🚨
— NASA Sun & Space (@NASASun) August 28, 2024
After 60 years of searching, scientists found the global electric field extending Earth’s atmosphere into space. It took a journey to the Arctic, a new instrument, and a powerful rocket to find it.
This is the story of Endurance. 🚀 https://t.co/cQzceoswRS pic.twitter.com/69dCi3BMcM
ఈ పరిశోధన ఎలా మొదలైంది?: 1960లో భూమి ధ్రువాల మీదుగా ఎగురుతున్న అంతరిక్ష నౌక మన వాతావరణం నుంచి అంతరిక్షంలోకి ప్రవహించే కణాల ప్రవాహాలను గుర్తించింది. ఈ ప్రవాహానికి 'ధ్రువ గాలి' అని పేరు పెట్టారు. ఈ ప్రవాహాలకు గల కారణం ఏంటనే విషయాలపై తెలుసుకునే క్రమంలో శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు విద్యుత్ క్షేత్రాన్ని కనుగొనేందుకు దారితీశాయి. అయితే ఈ ధ్రువ గాలిలో అనేక రహస్యాలు ఇప్పటికీ అంతుచిక్కడం లేదు. దీనిలోని కణాలు వేడిక్కిన సంకేతాలు లేవు. అందులో అనేక కణాలు చల్లగా ఉన్నాయి. అయినప్పటికీ అవి సూపర్సోనిక్ వేగంతో ప్రయాణిస్తున్నాయి.