ETV Bharat / technology

తడిచిన ఫోన్​ను బియ్యంలో పెడుతున్నారా? మరింత డ్యామేజ్​ పక్కా! ఇలా చేస్తే బెటర్

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 19, 2024, 2:17 PM IST

Mobile In Water What To Do : మీ ఐఫోన్​ నీళ్లలో లేదా ఏదైనా లిక్విడ్​ పదార్థంలో పడిపోయిందా? దానిని ఆన్​ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం రాలేదా? అయితే ఈ కథనం మీకోసమే. అనుకోకుండా ఐఫోన్/ ఆండ్రాయిడ్ ఫోన్​ నీళ్లలో పడిపోయినప్పుడు దానిని తిరిగి ఎలా బాగు చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

What To Do If My Smartphone Gets Wet
What To Do If My Smartphone Gets Wet

Mobile In Water What To Do : ప్రస్తుత రోజుల్లో మొబైల్​ ఫోన్​ లేనిదే బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. అది మన వెంట లేకపోతే ఏదో విలువైన వస్తువు మన దగ్గర లేదే అనే వెలితి కనిపిస్తుంటుంది. దాదాపు అందరి పరిస్థితి ఇదే. అంతలా మన జీవితంలో భాగమయిపోయింది ఈ ఎలక్ట్రానిక్​ గ్యాడ్జెట్​. దీనిని ప్రజలు కూడా అంతలా ఓన్​ చేసుకోవడానికి ప్రధాన కారణం ప్రపంచాన్ని మన చేతుల్లో చూపిస్తుంది కాబట్టే​. మరి అంతగా ప్రాధాన్యం ఇచ్చే ఆ పరికరాన్ని కాపాడుకోవాడానికి కూడా అనేక తంటాలే పడతారు చాలామంది. అంటే దాని సేఫ్టీ లేదా ప్రొటెక్షన్​ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి మన ఫోన్​ బైక్​ నడుపుతున్నప్పుడు ప్యాంట్​ జేబులో నుంచి కింద పడిపోవడమో, చొక్కా పాకెట్​లో నుంచి ఒక్కసారిగా నీళ్లు లేదా ఏదైనా లిక్విడ్​ పదార్థంలో పడిపోవడమో, స్విమ్మింగ్​ పూల్​ లేదా టాయిలెట్స్​లో పడిపోవడమో లాంటివి జరుగుతుంటాయి. ఆ తర్వాత ఫోన్​ను ఆన్​ చేయడానికి చేయని ప్రయత్నము అంటూ ఉండదు. ఈ నేపథ్యంలో అలా అనుకోకుండా మన మొబైల్​ఫోన్​ నీళ్లలో పడిపోతే ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? దానిని తిరిగి ఎలా ఆన్​ చేయాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఇలా అస్సలు చేయకండి
అయితే చాలామందికి ఉన్న ఒక అపోహ ఏంటంటే ఫోన్​ నీళ్లలో పడ్డ వెంటనే దానిని బియ్యం సంచిలో లేదా ఏదైనా బౌల్​లో బియ్యం పోసి దాని మధ్యలో పెట్టడం లాంటివి చేస్తుంటారు. అలా చేస్తే ఫోన్​లో పోయిన నీళ్లను బియ్యం త్వరగా పీల్చుకుంటుందని, దీంతో మొబైల్​ త్వరగా ఆన్​ అవుతుందని నమ్ముతుంటారు. కానీ, ఇలా చేయవద్దని సూచిస్తోంది ఐఫోన్​ తయారీదారు అయిన యాపిల్ కంపెనీ. ఎందుకంటే ఐఫోన్​ను అలా బియ్యంలో పెట్టినప్పుడు అందులో ఉండే సూక్ష్మమైన పార్టికల్స్(కణాలు)​ మొబైల్​కు ఉన్న పలు రంధ్రాల (ఇయర్​ఫోన్స్​, ఛార్జింగ్​ పోర్ట్ లాంటిది) ద్వారా లోపలికి వెళ్లి మీ ఫోన్​ మరితం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని చెబుతోంది.

ఒకవేళ మీ ఐఫోన్​ తడిస్తే ఇలా చేయండి..
యాపిల్​ తాజాగా తమ సపోర్ట్​ సైట్​ను అప్డేట్​ చేసింది. ఇందులో ఐఫోన్​ తడిగా ఉన్నప్పుడు మీకు ఒక అలర్ట్​ మెసేజ్​ వచ్చే విధంగా ఒక ఫీచర్​ను తీసుకువచ్చారు. అదే లిక్విడ్​-డిటెక్షన్​ అలర్ట్​ ఫీచర్​. ఎప్పుడైనా మీ ఐఫోన్ నీటిలో పడితే ఇది అలర్ట్ చేస్తుంది. మొబైల్​ను కాసేపు ఆరబెట్టిన తర్వాతే ఛార్జింగ్ పెట్టుకోవాలనే విషయాన్ని గుర్తుచేస్తుంది.​ ఇదిలా ఉంటే ఒకవేళ మీ ఐఫోన్ ​ నీళ్లలో పడ్డప్పుడు లేదా తడిచినప్పుడు ఏం చేసి దానిని సాధారణ స్థితికి తెచ్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.

  • ముందుగా మీ ఫోన్​లో లిక్విడ్​-డిటెక్షన్​ అలర్ట్​ ఫీచర్​ ఇన్​స్టాల్​ అయిందా లేదా చెక్​ చేసుకోండి.
  • ఒకవేళ అలర్ట్ వస్తే మీ ఫోన్​ను ఛార్జ్​ చేసేందుకు ప్రయత్నించకండి. ఒకవేళ పెట్టినా వెంటనే దానిని అన్​ప్లగ్​ చేయండి.
  • మీ డివైజ్​, ఛార్జింగ్​ స్లాట్​ పూర్తిగా తడి ఆరిపోయేంత వరకు మళ్లీ ఛార్జ్​ చేయవద్దు.
  • తడిచిన మొబైల్​ను పూర్తిగా పొడి ప్రదేశంలో ఆరబెట్టండి. అంతేకాకుండా లోపలికి వెళ్లిన నీటిని బయటకు తీసేందుకు మీ ఫోన్​ను సున్నితంగా మీ అరచేత్తో కొట్టండి. ఈ సమయంలో కేబుల్​ కనెక్టర్​ భాగం పైకి కాకుండా కిందకు ఉండేలా చూసుకోండి.
  • ఇలా చేసిన తర్వాత కనీసం 30 నిమిషాలు ఆగి మీ iPhoneను ఛార్జ్​ చేయండి. అయినప్పటికీ మీ డివైజ్​ లిక్విడ్​-డిటెక్షన్ అలర్ట్​ను పంపిస్తే మళ్లీ దానిని పొడి ప్రదేశంలోనే ఉంచండి. ఒక్కోసారి మొబైల్​ పూర్తిగా ఆరడానికి ఒక్కరోజు సమయం కూడా పట్టవచ్చు. అలా మళ్లీ మీరు మీ ఫోన్​ను ఛార్జ్​ చేసి ఆన్​ చేసుకోవచ్చు.

ఆండ్రాయిడ్​ ఫోన్​ తడిస్తే ఇలా చేయండి..

  • ముందుగా మీ ఆండ్రాయిడ్​ డివైజ్​ను ఆఫ్​ చేసేయండి. వీలైతే దానిలోని బ్యాటరీ, సిమ్​ కార్డు, మెమోరీ కార్డ్​ను కూడా బయటకు తీసేందుకు ప్రయత్నించండి.
  • ఫోన్​ బయటి భాగంలో ఉన్న తడిని ముందుగా కాటన్​ క్లాత్​ లేదా పేపర్​ టిష్యూతో తుడవండి. ఆ తర్వాత ఇయర్​ఫోన్స్​ జాక్​, ఛార్జింగ్​ పోర్ట్​ సహా ఇతర లోపలి భాగాల్లో ఉన్న తేమను కాటన్​ బాల్స్​​ సాయంతో శుభ్రంచేయండి.
  • అయితే నీళ్లలో పడ్డ డివైజ్​ను బాగా వెంటిలేషన్​ లేదా చల్లని గాలి వచ్చే ప్రదేశంలో మాత్రమే ఆరబెట్టండి. త్వరగా ఆరాలనే తొందర్లో హెయిర్​ డ్రైయర్​ లేదా హ్యాండ్​ డ్రైయర్​లను మాత్రం వాడవద్దు. ఎండ లేదా వేడి గాలులు వచ్చే ప్రదేశాల్లో తడిచిన ఫోన్​ను అస్సలు ఉంచవద్దని సూచిస్తున్నారు గ్యాడ్జెట్​ నిపుణులు.
  • అలా పూర్తిగా ఆరిన తర్వాత సంబంధిత సర్వీస్​ సెంటర్​కు తీసుకెళ్లి రిపేర్​కు ఇవ్వవచ్చు. అక్కడికి తీసుకువెళ్లేకన్నా ముందు పైన తెలిపిన విధంగా మీరు మీ ఇంట్లో చేస్తే ఫోన్​ త్వరగా ఆన్​ కావడానికి ఆస్కారం ఉంటుంది.

ఇలా కూడా చేయవచ్చు..

  • ప్రస్తుతం మార్కెట్​లో సిలికా జెల్​ అనే ప్యాకెట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా కూడా తడిచిన మీ ఫోన్​ను ఆరబెట్టవచ్చు. ఒకటి నుంచి రెండు రోజుల వరకు మీ వెట్​ డివైజ్​ను సీల్డ్​ సిలికా బ్యాగ్స్​లో ఉంచవచ్చు.
  • అలా మీ ఫోన్​ ఆరిన తర్వాత దానిని ఆన్​ చేసే ప్రయత్నం చేయండి. అప్పటికీ ఆన్​ అవ్వకపోతే దానిని పూర్తిగా ఛార్జ్​ చేసి స్విచ్ఛాన్​ చేయండి.
  • ఇన్ని ప్రయత్నాలు చేసినా ఇంకా మీ మొబైల్​ ఫోన్​ ఆన్​ కాకపోతే సంబంధిత సర్వీస్​ సెంటర్​కు తీసుకెళ్లి మీ సమస్యను వివరించండి. సరైన పరిష్కారం దొరుకుతుంది.

యూట్యూబర్స్​​ ఎంత సంపాదిస్తున్నారో తెలుసా? వింటే షాక్​ అవడం గ్యారెంటీ!

మీరు ఆ వన్​ప్లస్ మోడల్ కొన్నారా? అయితే పూర్తి ధర వాపస్- ఛాన్స్ అప్పటివరకే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.