ETV Bharat / technology

2024లో జీమెయిల్ షట్​ డౌన్ అవుతుందా? ​యూజర్ల పరిస్థితి ఏమిటి?

Is Gmail Going To Shut Down In 2024 : గూగుల్ కంపెనీ త్వరలో జీమెయిల్ సేవలు నిలిపివేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనితో జీమెయిల్ యూజర్లు అందరూ ఆందోళనకు గురవుతున్నారు. ఇంతకీ ఇది వాస్తవమేనా? వాస్తవమైతే యూజర్ల పరిస్థితి ఏమిటి?

Gmail shut down news 2024
Is Gmail Going To Shut Down In 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 23, 2024, 3:02 PM IST

Is Gmail Going To Shut Down In 2024 : ప్రస్తుతం సోషల్ మీడియాలో 'జీమెయిల్​ షట్​ డౌన్ న్యూస్​' ట్రెండింగ్ అవుతోంది. గూగుల్ సంస్థ ఈ 2024 ఆగస్టులో జీమెయిల్ సేవలు నిలిపివేస్తున్నట్లు సామాజిక వేదికల్లో ప్రచారం జరుగుతోంది. మరి ఇది వాస్తవమేనా? లేదా కేవలం ఒక రూమరేనా?

రూమర్ మాత్రమే​!
గూగుల్ కంపెనీ త్వరలో జీమెయిల్​ సర్వీసెస్​ నిలిపివేస్తున్నట్లు సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అది కూడా ఈ 2024 ఆగస్టు 1తోనే ఈ సేవలు ముగుస్తాయని రూమర్ స్ప్రెడ్​ అయ్యింది. దీనితో జీ మెయిల్ యూజర్లు చాలా ఆందోళనకు గురయ్యారు. మొదట్లో దీనిపై గూగుల్ కంపెనీ కూడా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. చివరికి జీమెయిల్​ తన అధికారిక ఎక్స్​ (ట్విట్టర్​) అకౌంట్​లో 'జీమెయిల్ సేవలు ఇకపైనా కొనసాగుతాయి' అని చిన్న సందేశాన్ని పోస్ట్ చేసింది. దీనితో జీమెయిల్ సేవలు నిలిచిపోతాయనే వార్త ఒక రూమర్​ అని తేలిపోయింది.

జీమెయిల్ సేవలు ఆగిపోతే పరిస్థితి ఏమిటి?
జీమెయిల్ సేవలు ఆగిపోతే డిజిటల్​ మార్కెట్లో ఎంతో గందరగోళం ఏర్పడుతుంది. ఎందుకంటే జీమెయిల్​ను వ్యక్తిగత అవసరాల కోసం మాత్రమే కాకుండా, వ్యాపారాల కోసం, సబ్​స్క్రిప్షన్ల కోసం ఉపయోగిస్తూ ఉంటారు.

గూగుల్ కంపెనీ ఎంటర్​ప్రైజెస్ కస్టమర్ల కోసం కస్టమైజ్డ్​ జీమెయిల్ ఐడీలను కూడా ఇస్తుంది. వీటిని ద్వారా పెద్ద ఎత్తున వ్యాపార, వ్యవహారాలు నడుస్తుంటాయి. అంతేకాదు ఆండ్రాయిడ్ ఫోన్లలో, థర్డ్ పార్టీ యాప్స్​లో లాగిన్ కావడానికి కూడా జీమెయిల్ ఐడీ ఉపయోగిస్తూ ఉంటారు. అందువల్ల జీమెయిల్ సేవలు నిలిచిపోతే, కోట్లాది మంది యూజర్ల ఉనికి (డిజిటల్ ఎగ్జిస్టెన్స్)​ ప్రశ్నార్థకమవుతుంది.

ఈ రూమర్​ను ఎందుకు నమ్మాల్సి వస్తోంది!
గూగుల్ కంపెనీ ఇటీవలి కాలంలో పలు ప్రొడక్టులను నిలిపివేస్తూ వస్తోంది. వాటిలో 'స్టడియా' (Stadia) ఒకటి. గూగుల్ ఈ స్టడియాకు సపోర్ట్ ఇవ్వడాన్ని నిలిపేసింది. దీనితో స్టడియా గేమర్లు బుర్ర గోక్కోవలసి వస్తోంది. అందుకే జీమెయిల్ సేవలు కూడా నిలిచిపోతాయనే రూమర్​ను చాలా మంది నమ్మారు. ఫలితంగా అది సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యింది.

వాట్సాప్​లో 4 కొత్త టెక్ట్స్ ఫార్మాటింగ్ ఫీచర్స్​ - ప్రత్యేకతలు ఇవే!

మీకు ఎక్కువ జీ-మెయిల్​ అకౌంట్లు ఉన్నాయా? - ఒకే టైమ్​లో ఎలా లాగిన్​ కావాలో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.