ETV Bharat / technology

చైనాకు షాకిచ్చిన యాపిల్- భారత్​లోనే ఐఫోన్ 17 తయారీ!

ఐఫోన్ 17 బేస్ మోడల్‌ ముందస్తు తయారీ ఇండియాలోనే!

iphone Manufacturing in India
iphone Manufacturing in India (Apple India)
author img

By ETV Bharat Tech Team

Published : Oct 31, 2024, 11:00 AM IST

iphone 17 Manufacturing in India: ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ చైనాకు భారీ షాక్ ఇచ్చింది. తన ఐఫోన్ 17 బేస్ మోడల్​ ముందస్తు తయారీనీ భారత్​లో చేపట్టినట్లు తెలుస్తోంది. కరోనా మహమ్మారి సమయంలో ఎదురైన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని చైనా నుంచి ఐఫోన్ల తయారీని ఇతర దేశాలకు యాపిల్ తరలించింది. ఈ క్రమంలో ఇప్పుడు యాపిల్‌ 17 ముందస్తు తయారీని తొలిసారి భారత్‌లో చేపడుతోంది.

గత కొన్నేళ్లుగా వివిధ ఐఫోన్‌ మోడళ్లు భారత్‌లో తయారవుతున్నాయి. ఇక్కడి నుంచి వీటిని భారీ సంఖ్యలో కంపెనీ ఇతర దేశాలకూ ఎగుమతి చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే 16 సిరీస్​ ఐఫోన్ల తయారీని ప్రారంభించింది. యాపిల్ ఇప్పటి వరకు ఈ తరహా తయారీని చైనాలో మాత్రమే నిర్వహించేంది. అయితే ప్రస్తుతం యాపిల్ భారత కార్యకలాపాలపై ప్రత్యేక ఆసక్తి చూపించింది.

సాధారణంగా ఒక ప్రొడక్ట్‌ విడుదలైన తర్వాత తయారీ చేపడుతుంటారు. అమెరికాలో యాపిల్‌ పార్క్‌లో నెక్ట్స్​ రాబోయే ఐఫోన్ సిరీస్ మొబైల్‌ డిజైన్‌ ఖరారు అయ్యాక, కమర్షియల్‌ లాంచ్‌కు ముందు ఫోన్లను చైనాలో మాత్రమే ముందస్తు తయారీని ఇన్నాళ్లూ యాపిల్‌ చేపడుతూ వస్తోంది. అంటే పూర్తి స్థాయి తయారీకి ముందు ఉన్న ఐఫోన్లు అన్నీ చైనాలో రూపొందించినవే.

ఈ ప్రక్రియ అక్టోబర్‌ నుంచి మే నెల మధ్యలో జరుగుతుంటుంది. అయితే తొలిసారి యాపిల్‌ తన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. యాపిల్‌ ఐఫోన్ 17 ముందస్తు తయారీని భారత్‌లోని ఓ ప్లాంట్‌లో చేపడుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇలా రూపొందిన ఫోన్‌ను 2025 రెండో అర్ధభాగంలో యాపిల్‌ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా కొవిడ్-19 సమయంలో యాపిల్‌కు ఎదురైన చేదు అనుభవం దృష్ట్యా యాపిల్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఫాక్స్‌కాన్‌ ప్లాంట్‌ మూతపడి, ప్రొడ్క్ట్ నిలిచిపోవడంతో యాపిల్‌ తన ఐఫోన్ల ఉత్పత్తిని చైనా వెలుపల చేపట్టాలని నిర్ణయించింది. అలా ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చిన యాపిల్‌ తొలుత బేస్‌ మోడళ్ల తయారీ మాత్రమే చేపట్టింది. ఇటీవల విడుదలైన యాపిల్‌ 16 ప్రో మోడళ్లను సైతం ఇక్కడే చేపడుతున్నట్లు సమాచారం.

షావోమీ 15 సిరీస్ స్మార్ట్​ఫోన్స్ లాంచ్- ఓయమ్మా ఇవేం ఫీచర్లు రా సామీ..!

దీపావళి వేళ ఖరీదైన మోటార్​సైకిల్ లాంచ్- కొంటే ఇలాంటి బైక్ కొనాలి భయ్యా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.