IPhone 16 Series Launch Date : టెక్ దిగ్గజం యాపిల్ ఏటా కొత్త ఐఫోన్ సిరీస్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకొస్తుంటుంది. ఈ క్రమంలో ఐఫోన్ 16 సిరీస్‌ను ఈ సెప్టెంబరు 10న మార్కెట్లో లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మరెందుకు ఆలస్యం ఈ ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ల ధరలు, స్పెక్స్, ఫీచర్లపై ఓ లుక్కేద్దాం పదండి.
సెప్టెంబర్ 10న ఐఫోన్ 16 సిరీస్ లాంఛ్ ఈవెంట్ జరగనుండగా, సెప్టెంబర్ 20 నుంచి ఫోన్లను అందుబాటులోకి రానున్నాయని సమాచారం. ఐఫోన్ 16 సిరీస్‌లో ఈసారి కూడా నాలుగు ఫోన్లు రిలీజ్ కానున్నాయి. స్టాండర్డ్ వేరియంట్ ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఫోన్లను యాపిల్ తీసుకురానుంది. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ 256జీబీ, 512జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో రానున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్ 512జీబీ, 1టీబీ స్టోరేజ్ ఆప్షన్లలో రానున్నట్లు సమాచారం.
IPhone 16 Price : ఐఫోన్ 16 మోడల్ ఫోన్లు కింది ధరల్లో లభించనున్నట్లు తెలుస్తోంది.
- ఐఫోన్ 16 ధర - 799 డాలర్లు (రూ.67,100)
- ఐఫోన్ 16 ప్లస్ ధర -899 డాలర్లు (రూ.75,500)
- ఐఫోన్ 16 ప్రో ధర - 1,099 డాలర్లు (రూ.92,300)
- ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ - 1,199 డాలర్లు (రూ.1,00,700)
IPhone 16, IPhone 16 Plus Features : ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ 8జీబీ ర్యామ్‌తో, ఏ18 చిప్సెట్తో రావచ్చని అంచనా. ఐఫోన్ 16 ఫోన్ 6.1 అంగుళాల డిస్ప్లే , ఐఫోన్ 16 ప్లస్ 6.7 అంగుళాల డిస్ప్లే కలిగి ఉంటాయని సమాచారం. ఐఫోన్ 16 స్టాండర్డ్ మోడల్ 3,561 mAh బ్యాటరీ, ప్లస్ మోడల్ 4,006 mAh బ్యాటరీతో రావచ్చని తెలుస్తోంది.
ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తాయని తెలుస్తోంది. ఈ సెటప్‌లో ఎఫ్/1.6 ఎపార్చర్, 2 ఎక్స్ జూమ్‌తో కూడిన 48 ఎంపీ ప్రైమరీ వైడ్ కెమెరా, ఎఫ్/2.2 ఎపార్చర్ 0.5 ఎక్స్ జూమ్‌తో కూడిన అల్ట్రా వైడ్ కెమెరా ఉండొచ్చని సమాచారం.
IPhone 16 Pro , IPhone 16 Pro Max Features : ఐఫోన్ 16 ప్రో ఫోన్ 6.3 అంగుళాల డిస్ప్లే, ఐఫోన్ 16 ప్రో మాక్స్ 6.9 అంగుళాల స్క్రీన్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 16 ప్రో మాక్స్ సన్నని బెజెల్స్‌తో వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు మోడల్స్‌లో ఏ18ప్రో చిప్సెట్ అమర్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఐఫోన్ 16 ప్రో వేరియంట్ 3,355 mAh బ్యాటరీ, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ 4,676 mAh బ్యాటరీతో రానున్నట్లు సమాచారం.
ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో ఉండవచ్చని అంచనా. ఇందులో వైడ్ కెమెరా, అల్ట్రా వైడ్ కెమెరా, టెలిఫొటో కెమెరాలు ఉంటాయి. ఐఫోన్ ప్రో 48ఎంపీ ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. అలాగే ఐఫోన్ ప్రోలో టెలిఫొటో కెమెరా 12 మెగా పిక్సెల్ సెన్సార్ 5x ఆప్టికల్ జూమ్‌తో లభించనున్నట్లు తెలుస్తోంది. అల్ట్రా వైడ్ కెమెరా పిక్సెల్ బిన్నింగ్ టెక్నాలజీతో 48 ఎంపీ అప్ గ్రేడ్‌తో వస్తుంది. అలాగే ఐఫోన్ 16 సిరీస్ ప్రో మోడల్స్ యాపిల్ ప్రోలా ఫొటోలు, కొత్త JPEG-XL ఇమేజ్ ఫార్మాట్‌కు సపోర్ట్ చేస్తాయని తెలుస్తోంది. డాల్బీ విజన్‌తో 120 ఎఫ్‌పీఎస్ వద్ద 3K వీడియో రికార్డింగ్‌కు కూడా ఇది సపోర్ట్ చేసే అవకాశం ఉంది.
యాపిల్ వాచ్ కూడా
ఐఫోన్లతో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 10, ఎయిర్‌పాడ్స్ 4ను కూడా లాంఛ్ చేసే అవకాశం ఉంది. త్వరలోనే ఈవెంట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
మీ ఐఫోన్‌ను చాలా ఫాస్ట్‌గా ఛార్జ్ చేయాలా? ఈ 9 టిప్స్ మీ కోసమే! - How To Charge IPhone Faster
మీ ఐఫోన్‌కు 2 జతల AirPods కనెక్ట్ చేసుకోవచ్చు - ఎలాగో తెలుసా? - AirPods Share Audio Feature