ETV Bharat / technology

ఐఫోన్ యూజర్లకు గుడ్​న్యూస్- మీ వద్ద ఈ మోడల్ ఫోన్ ఉందా?- అయితే ఫ్రీ సర్వీస్​ ఆఫర్..! - APPLE SERVICE PROGRAM

ఐఫోన్ యూజర్స్​కు బిగ్​ అలెర్ట్- వారికి ఫ్రీ రిపేర్ సర్వీస్..!

Representational Image
Representational Image (AP File Photo)
author img

By ETV Bharat Tech Team

Published : Nov 3, 2024, 5:56 PM IST

Apple Service Program: ఐఫోన్ యూజర్లకు గుడ్​న్యూస్. యాపిల్ తన పాపులర్ మోడల్స్​లో ఒకటైన 'ఐఫోన్ 14 ప్లస్' ఫోన్​ బ్యాక్​ కెమెరాను ఉచితంగా రిపేర్ చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు 'ఐఫోన్ 14 ప్లస్' బ్యాక్ కెమెరా సమస్యలను పరిష్కరించడానికి ఒక సర్వీస్​ ప్రోగ్రామ్​ను ప్రారంభించినట్లు వెల్లడించింది. బ్యాక్ కెమెరాకు సంబంధించిన సమస్యలతో ఇబ్బందిపడుతున్న యూజర్ల ఐఫోన్​ను ఎలాంటి కాంప్లిమెంటరీ ఛార్జీలు తీసుకోకుండానే రిపేర్ చేస్తామని తెలిపింది. అంతేకాక ఈ ప్రకటనకు ముందే రిపేర్లు చేయించుకున్నవారికి రిపేర్​కు అయిన డబ్బులను కూడా రిఫండ్ చేస్తామని తెలిపింది

కాగా ఈ సమస్య ముఖ్యంగా ఏప్రిల్ 2023 నుంచి ఏప్రిల్ 2024 మధ్య తయారైన ఐఫోన్ 14 ప్లస్ మొబైల్స్​లో తలెత్తింది. ఈ మోడల్స్​లో చాలా తక్కువ శాతం బ్యాక్ కెమెరాను ఉపయోగించిన సమయంలో ప్రివ్యూలను చూపించడంలో విఫలమవుతుందని యాపిల్ పేర్కొంది. ఈ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వినియోగదారులు యాపిల్ రిటైల్ స్టోర్, అధీకృత సర్వీస్ ప్రొవైడర్‌లు లేదా మెయిల్-ఇన్ సర్వీస్ ఆప్షన్ ద్వారా ఉచిత రిపేర్‌ను పొందొచ్చని తెలిపింది.

12 నెలల పాటు ఈ కాంప్లిమెంటరీ రిపేర్లను పొందవచ్చని వెల్లడించింది. కాగా 'ఐఫోన్ 14 ప్లస్' మోడల్‌లోని ఫోన్లలో మాత్రమే ఈ బ్యాక్ కెమెరా సమస్యలు ఉన్నాయని, వారికి మాత్రమే ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది. ఈ నేపథ్యంలో యూజర్లు తమ 'ఐఫోన్ 14 ప్లస్' మొబైల్​కు ఈ ఫ్రీ సర్వీస్​ వర్తిస్తుందో లేదో చెక్​ చేసుకోవాలని సూచించింది.

ఈ మోడల్ ఐఫోన్ కొనుగోలు తేదీ నుంచి 3 ఏళ్ల పాటు మాత్రమే రిపేరింగ్ కవరేజ్ అందుబాటులో ఉంటుందని యాపిల్ తెలిపింది. ఈ ప్రోగ్రామ్ కేవలం 'ఐఫోన్ 14 ప్లస్' మోడల్‌ బ్యాక్​ కెమెరా సమస్యలపై మాత్రమే కవర్ చేస్తుంది. ఈ సర్వీస్ కింద ఇతర మోడల్ ఐఫోన్స్​ ఏవీ కవర్ అవ్వవు. కేవలం బ్యాక్​ కెమెరా సమస్యకు సంబంధించిన రిపేర్ల కోసం గతంలో రిపేర్ చేయించుకున్న కస్టమర్లకు మాత్రమే రీఫండ్ చేస్తుంది.

అర్హత ఉందో లేదో చెక్​ చేసుకోండిలా!:

  • ఐఫోన్ 14 ప్లస్ యూజర్లు యాపిల్ సర్వీస్ ప్రోగ్రామ్ వెబ్​పేజీలో వారి సీరియల్ నంబర్​ను రిజిస్టర్ చేసుకుని వారి మొబైల్​కు అర్హత ఉందో లేదో చెక్​ చేసుకోవచ్చు.
  • మీ ఐఫోన్ 14 ప్లస్‌లో సీరియల్ నంబర్‌ను గుర్తించేందుకు సెట్టింగ్స్​ ఓపెన్ చేయండి.
  • అందులో General> About పై ట్యాప్ చేయండి.
  • ఈ స్క్రీన్​లోని సీరియల్ నంబర్​పై లాంగ్​ ప్రెస్ చేయండి.
  • ఇలా చేయడం వల్ల కాపీ షార్ట్​కట్​ డిస్​ప్లే అవుతుంది.
  • ఈ సర్వీస్​ ప్రోగ్రాం కోసం యాపిల్​ సపోర్ట్ పేజీలోని ఫీల్డ్​లో టెక్స్ట్​ పేస్ట్ చేసేందుకు యూజర్లకు అనుమతిస్తుంది.

గూగుల్, యాపిల్​ కంపెనీలకు బిగ్ షాక్- సొంత ఓఎస్​పై నథింగ్ ఫోకస్

షేర్​ 'లవ్' ఆన్ స్టేటస్- వాట్సాప్​లో ఈ క్రేజీ ఫీచర్ గమనించారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.