Hyundai Motor Hits Major Milestone: దక్షిణ కొరియాకు చెందిన కార్ల దిగ్గజం హ్యుందాయ్ అరుదైన మైలు రాయికి చేరింది. నేటితో ఆ కంపెనీ 10 కోట్ల కార్లను తయారుచేసినట్లు ప్రకటించింది. కంపెనీని స్థాపించిన 57 ఏళ్లలో ఈ అరుదైన ఘనతను సాధించింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆటోమోటీవ్ కంపెనీల్లో ఒకటిగా హ్యుందాయ్ నిలిచింది.
10 కోట్ల వాహనంగా అయోనిక్ 5: హ్యుందాయ్ సంస్థ అయోనిక్ 5 మోడల్ ఫస్ట్ కారును 10 కోట్ల వాహనంగా దక్షిణ కొరియాలోని ఉల్సాన్ ప్లాంట్‌లో కస్టమర్‌కు అందజేసింది. ఈ అరుదైన ఘనత సాధించడంపై హ్యుందాయ్ సంస్థ ప్రెసిడెంట్, సీఈవో జేహూన్ ఛాంగ్ ఆనందం వ్యక్తం చేశారు.
"ప్రపంచవ్యాప్తంగా మా వాహనాల ఉత్పత్తి 100 మిలియన్ల (10 కోట్ల) మార్కును దాటడం చెప్పుకోదగ్గ విషయం. ఇది కేవలం మా కస్టమర్ల మద్దతుతోనే సాధ్యమైంది. వారు హ్యుందాయ్ మోటార్స్‌కు మద్దతుగా నిలిచారు. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని.. సృజనాత్మకతను సుస్థిరంగా కొనసాగించడం మా వృద్ధికి కారణంగా నిలిచింది." - జేహూన్ ఛాంగ్, సంస్థ ప్రెసిడెంట్, సీఈవో
"మేము 100 మిలియన్ల మైలు రాయిని చేరడానికి హ్యుందాయ్ మోటార్స్ సంస్థలోని ప్రతి ఉద్యోగి తీవ్రంగా శ్రమించారు. మా సంస్థ ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్ కార్లు ముందుకు వెళ్లేందుకు ఇదే మొదటి మెట్టు." అని కంపెనీ దేశీయ విక్రయ విభాగం అధిపతి, చీఫ్ సేఫ్టీ ఆఫీసర్ డాంగ్ సీక్ వెల్లడించారు.
హ్యుందాయ్ తయారీ ప్లాంట్స్:
- 1968లో ఉల్సాన్ ప్లాంట్ కార్యకలాపాలను ప్రారంభించింది.
- కొరియా ఆటోమొబైల్ పరిశ్రమ జన్మస్థలంగా దీనిని భావిస్తారు.
- దక్షిణ కొరియా దేశంలో తొలిసారి భారీగా ఉత్పత్తి చేసిన 'ది పోనీ' కారును 1975లో ఇక్కడే తయారు చేశారు.
- ప్రస్తుతం ఉల్సాన్ ప్లాంట్ ఎలక్ట్రికల్ కార్ల తయారీ హబ్‌గా నిలిచింది.
- ఇందుకోసం ప్రత్యేక ప్లాంట్‌నే హ్యుందాయ్ ఏర్పాటు చేసింది.
- ఈ సంస్థ జెన్సిస్ పేరిట ప్రీమియ బ్రాండ్ కార్లను, హైపెర్ఫార్మెన్స్ బ్రాండ్-ఎన్, ఎలక్ట్రికల్ కార్ల విభాగంలో అయోనిక్ 5 మోడాల్స్ కార్లను ఈ-జీఎంపీ ప్లాట్‌ఫారంఫై తయారుచేస్తోంది.
- ప్రపంచ వ్యాప్తంగా తుర్కియే, భారత్, అమెరికా, చెక్ రిపబ్లిక్ హ్యుందాయ్ తయారీ ప్లాంట్లు ఉన్నాయి.
ఆటో మార్కెట్‌ను శాసిస్తున్న హ్యుందాయ్!: 1967 నుంచి 2024 ఆగస్టు వరకు బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా అవంటే ఉంది. ఇవి 15.37 మిలియన్ యూనిట్లు అమ్ముడయ్యాయి. యాక్సెంట్ 10.25 మిలియన్ యూనిట్లు, సొనాటా 9.48 మిలియన్ యూనిట్లు, టక్సన్ 9.36 మిలియన్ యూనిట్లు, టక్సన్ శాంటా ఫే 5.95 మిలియన్ యూనిట్లతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. హ్యుందాయ్ క్రెటా కారు ప్రస్తుతం ఇండియన్ ఆటో మార్కెట్‌ను శాసిస్తోంది.
పేదలకు అండగా ఆయుష్మాన్ హెల్త్ స్కీమ్- ఉచిత వైద్యం కోసం అప్లై చేసుకోండిలా! - AB PM JAY Yojana