Hyderabad Nexon EV Fire Case: టాటా నెక్సాన్ ఈవీలో మంటలు చెలరేగిన కేసులో హైదరాబాద్‌లోని వినియోగదారుల కోర్టులో టాటా మోటార్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కారు ఓనర్‌కు కారు పూర్తి ధరను వాపసు చేయాలని కంపెనీని కోర్టు ఆదేశించింది.
బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం:
- జోనాథన్ బ్రైనెర్డ్ అనే వ్యక్తి టాటా మోటార్స్‌కు చెందిన పాపులర్, అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారు టాటా నెక్సాన్‌ను 2022లో కొనుగోలు చేశారు.
- అయితే అది కొన్న కొన్ని నెలలకే కారు డ్రైవింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద పేలుడు సంభవించి కారులో మంటలు చెలరేగాయి.
- ఆ సమయంలో తాను తన కారును గంటకు 38 కి.మీ తక్కువ వేగంతోనే డ్రైవింగ్ చేస్తున్నట్లు బ్రైనెర్డ్ తెలిపారు.
- 2023 జూన్ 1న జరిగిన ఈ ఘటనలో కారు కాలిపోయింది.
- వెంటనే కారు దిగి ప్రాణాలు కాపాడుకున్నాడు.
- మంటలు వేగంగా వ్యాపించడంతో కారు డోర్లు జామ్ అయ్యాయి.
- ఆ సమయంలో ఆయన సైడ్ డోర్ నుంచి బయటికి వచ్చి ప్రాణాలను కాపాడుకున్నారు.
- ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా కూడా మారింది.
- ఈ ఘటన తర్వాత బ్రెయినార్డ్ వినియోగదారుల కోర్టులో టాటా మోటార్స్‌పై కేసు వేశారు.
- సాంకేతిక సమస్యల కారణంగానే ఈ ఘటన జరిగిందని కారు యజమాని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Early Battery Discharge:
- కారు బ్యాటరీ తొందరగా డిశ్చార్జ్ అవుతుందని బ్రైనర్డ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
- అదే సమయంలో కారును 18 శాతం ఛార్జ్ చేసిన తర్వాత కూడా అది స్టార్ట్ కాలేదన్నారు.
- ఆయన కారును సర్వీస్ సెంటర్లో చూపించగా మొదట కారు హెచ్‌వి బ్యాటరీ చెడిపోయిందని చెప్పినట్లు తెలిపారు.
- అయితే కొత్త బ్యాటరీని అమర్చకుండా పాత రీఫర్బిష్డ్ బ్యాటరీని కారులో అమర్చారని కారు ఓనర్ ఆరోపించారు.
రూ. 16.95 లక్షలు వాపసు ఇవ్వాలని ఆదేశం: ఈ కేసును విచారణ చేపట్టిన హైదరాబాద్‌లోని వినియోగదారుల కోర్టు కారు యజమానికి కారు పూర్తి ధరను అంటే రూ. 16.95 లక్షలను తిరిగి చెల్లించాలని టాటా మోటార్స్‌ను ఆదేశించింది.
ఓపెన్ ఏఐ సీటీవో మిరా మురాటి రాజీనామా- ఎందుకో తెలుసా? - OpenAI CTO Mira Murati Resigns