How To Stop Background Running Apps in Android : ప్రస్తుత కాలంలో చాలా మంది ఆండ్రాయిడ్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. అయితే కొన్నిసార్లు ఆండ్రాయిడ్ ఛార్జింగ్ చాలా ఫాస్ట్‌గా డ్రైన్ అయిపోతుంది. మీకు కూడా ఇలాంటి సమస్యే ఎదురైందా? మన మొబైల్ బ్యాక్ గ్రౌండ్లో రన్ అవుతుండడం వల్ల ఇలా జరగడానికి ప్రధాన కారణమని టెక్ నిపుణులు చెబుతున్నారు. మరి మన ఫోన్ఛార్జింగ్ ఎక్కువ సమయం రావాలంటే ఏం చేయాలి? ఫోన్ బ్యాక్ గ్రౌండ్ రన్నింగ్‌ను ఏవిధంగా క్లోజ్ చేయాలి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
బ్యాంక్ గ్రౌండ్లో ఏయే యాప్‌లు రన్ అవుతున్నాయో తెలుసుకోవడం ఎలా?
- Settingsను ఓపెన్ చేసి స్క్రోల్ డౌన్ చేయండి.
- About Phone ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- Software information ఆప్షన్‌లోని Build Number ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- ఏడుసార్లు బిల్డ్ నంబర్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే డెవలపర్ ఆప్షన్లు ఎనెబుల్ అవుతాయి.
- ఇప్పుడు మీ పిన్ను ఎంటర్ చేయండి(డివైస్ పాస్‌కోడ్)
- పాస్‌కోడ్ ఎంటర్ చేసిన వెంటనే మీకు You're now a developer అనే మెసేజ్ వస్తుంది.
- స్క్రోల్ డౌన్ చేస్తే Running services అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. మీ రన్నింగ్ సర్వీసెస్ ఆప్షన్ కనిపిస్తుంది.
- ఆయా యాప్‌ల మెమరీ యూసేజ్ వివరాలు కూడా మీరు గమనించవచ్చు.
- మీ ఆండ్రాయిడ్‌లోని బ్యాటరీ యూసేజ్ మెనూ లకి వెళ్లి ఏయే యాప్‌లు ఎక్కువగా బ్యాటరీని ఉపయోగిస్తున్నాయో తెలుసుకోవచ్చు.
ఆండ్రాయిడ్ యాప్స్‌లో బ్యాంక్గ్రౌండ్ రన్నింగ్‌ను ఆఫ్ చేయడం ఎలా?
ఏదైనా ఒకే యాప్ వల్ల వేగంగా ఛార్జింగ్ అయిపోతున్నప్పుడు ఆ యాప్ బ్యాక్‌గ్రౌండ్‌ను క్లోజ్ చేయడానికి ఈ విధంగా చేయండి.
- మొదట మీ స్మార్ట్‌ఫోన్‌లో సెట్టింగ్స్ మెనూపై క్లిక్ చేయండి.
- సెట్టింగ్స్‌లో APPS అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేయండి.
- మీరు యాప్ బ్రాక్‌గ్రౌండ్ రన్నింగ్‌ను స్టాప్ చేయాలనుకుంటున్న యాప్ ఇన్ఫోపై క్లిక్ చేయండి.
- యాప్ ఇన్ఫోలో Force stop అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
- కన్ఫామ్ చేసేందుకు OK పై క్లిక్ చేయండి.
Restrict Battery Usage for Apps
ఆండ్రాయిడ్ ఫోన్లో బ్యాటరీ ఛార్జింగ్ తరచూ డ్రైన్ అయిపోతుంటే ఈ ఆప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు. మీరు అంతగా ఉపయోగించని యాప్‌ల బ్యాక్ గ్రౌండ్లో రన్ అవుతూ ఉన్నట్లయితే ఛార్జింగ్ చాలా వేగంగా డ్రైన్ అయిపోతుంది. అందువల్ల ఈ సూచనలు పాటించి అలా కాకుండా చేసుకోండి.
- Settings యాప్‌ను ఓపెన్ చేయండి
- బ్రౌక్గ్రౌండ్ రన్నింగ్ ఆఫ్ చేయాలనుకుంటున్న యాప్‌పై క్లిక్ చేయండి
- APP Info ఆప్షన్‌పై క్లిక్ చేయాలి
- అక్కడ బ్యాటరీ ఆప్షన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి
- Restricted అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోండి.
గమనిక : ఈ ఆప్షన్‌ను ఉపయోగించడం వల్ల సంబంధిత యాప్ నోటిఫికేషన్లు మీకు రావు. అందువల్ల ముఖ్యమైన యాప్‌లకు ఈ ఆప్షన్‌ను ఉపయోగించకపోవడమే మంచిది.
How To Enable the Adaptive Battery Feature
- మీ ఆండ్రాయిడ్‌లోని Settings యాప్‌ను క్లిక్ చేయండి
- Battery ఆప్షన్‌ను ఎంచుకోండి
- త్రీ డాట్ మెనూపై క్లిక్ చేసి Adaptive battery అనే ఆప్షన్‌ను ఎంచుకొండి.
- పైన వివరించిన పవర్ సేవింగ్ ఆప్షన్ ఉపయోగించే క్రమంలో కొన్నిసార్లు మీ మొబైల్‌కు నోటిఫికేషన్లు రాకపోయే అవకాశం ఉంది. కనుక మీకు అంతగా ముఖ్యం కానీ యాప్‌ల విషయంలో మాత్రమే ఈ ఆప్షన్లను ఉపయోగించుకోవాలి.
మీ ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతోందా? ఈ ట్రిక్స్ పాటిస్తే ప్రాబ్లమ్ సాల్వ్!
ఐఫోన్ 15 సిరీస్ బ్యాటరీ లైఫ్, ఛార్జింగ్ స్పీడ్‌పై టెక్ లవర్స్ అసంతృప్తి!..