ETV Bharat / technology

మీ ఫోన్​/ ట్యాబ్​ నీటిలో పడిపోయిందా? ఈ సింపుల్​ చిట్కాలతో వాటిని సేవ్​ చేసుకోండి! - How to fix your water damaged phone

How To Save A Phone Dropped In Water : కొన్నిసార్లు మన ఫోన్/ ట్యాబ్ పొరపాటున నీళ్లలో పడిపోతుంటుంది. అప్పుడు ఏం చేయలో తెలియక కంగారుపడుతుంటాం. దానిని వెంటనే స్విచ్ ఆన్ చేయటం లేదా ఇతరత్రా తప్పిదాలు ఏవో చేస్తుంటాం. అయితే నీటిలో పడిన ఫోన్​/ ట్యాబ్​లను కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

How to Save a Tablet Dropped in Water
How to Save a Phone Dropped in Water
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 17, 2024, 4:44 PM IST

How To Save A Phone Dropped In Water : ఈ డిజిటల్ యుగంలో చేతిలో ఫోన్ లేకుండా ఉండటం చాలా కష్టం. అయితే కొన్ని వేల రూపాయలు ఖర్చు చేసి కొన్న ఈ ఫోన్​లు పొరపాటున కొన్నిసార్లు నీళ్లలో పడుతుంటాయి. అప్పుడు ఏంచేయాలో తెలియక మనం ఇబ్బంది పడుతుంటాం. అయితే కొన్ని సింపుల్​ చిట్కాలను పాటించడం ద్వారా మన ఫోన్ లేదా ట్యాబ్​లను నీటిలో పడినా, పాడవకుండా రక్షించుకోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

  1. వెంటనే స్విచ్ ఆఫ్ చేయాలి : ఒకవేళ మీ ఫోన్ లేదా ట్యాబ్ నీటిలో పడితే, మీరు చేయాల్సిన మెుదటి పని వెంటనే వాటిని స్విచ్ ఆఫ్ చేయటం. ఒకవేళ మీ ఫోన్ ఆటోమేటిక్​గా స్విచ్ ఆఫ్ అయితే, దానిని తిరిగి ఆన్ చేసే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఫోన్​లో నీరు ఉన్నప్పుడు ఎట్టిపరిస్థితుల్లోనూ ఫోన్ ఆన్​లో ఉండకూడదు. ఒక వేళ ఫోన్ ఆన్​లో ఉంటే షార్ట్ అవుట్ అవుతుంది. ఫలితంగా ఫోన్/ ట్యాబ్ శాశ్వితంగా డామేజ్ అవుతాయి. ఒక్కోసారి మీకు ఎలక్ట్రిక్ షాక్​ కూడా తగలవచ్చు.
  2. వీలైనంత వరకు ఫోన్​ను ఆరబెట్టాలి : మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసాక దానిని పూర్తిగా ఆరబెట్టాలి. మీ ఫోన్​లో గనుక బ్యాటరీ తీసే ఆఫ్షన్ ఉంటే, దానిని తీసి ఆరబెట్టాలి. దానితో పాటు సిమ్, మెమరీ కార్డులను తీసి, పొడి వస్త్రంతో తుడవాలి. అయితే దూది లాంటి వాటితో ఫోన్లను తుడవకూడదు. నీటిలో పడిన ఫోన్​ లేదా ట్యాబ్లెట్​లను ఎండలో ఉంచకూడదు. హెయిర్​ డ్రయ్యర్స్​ను కూడా వాడకూడదు. ఇలా చేస్తే ఫోన్ పార్టులు డ్యామేజ్​ అయ్యే అవకాశం ఉంది. చాలా మంది బియ్యంలో ఫోన్ ఉంచుతూ ఉంటారు. కానీ దీని వల్ల మంచి కంటే, చెడే ఎక్కువ జరిగే అవకాశం ఉంది.
  3. యూఎస్​బీ పోర్ట్స్​, ఆడియో జాక్స్​, స్పీకర్స్​ క్లీన్ చేయాలి : సాధారణంగా ఫోన్ నీటిలో పడిపోయినప్పుడు యూఎస్​బీ పోర్టులు​, ఆడియో జాక్స్, స్పీకర్స్​లో నీరు చేరుతుంది. కనుక వాటిలోని నీటిని వీలైనంత త్వరగా తుడిచేయాలి. ఇందు కోసం సిలికా జెల్ వాడడం మంచిది. ఈ సిలికా జెల్​ను స్పీకర్స్​, యూఎస్​బీ పోర్టులకు అంటించి కనీసం 24 నుంచి 48 గంటల పాటు ఉంచాలి. కుదరని పక్షంలో కనీసం 12 గంటలైనా ఉంచాలి. ఇలా చేస్తే ఆ రంధ్రాలలో దాగి ఉన్న నీరు పూర్తిగా డ్రై అయిపోతుంది. ఇలా చేసిన కొన్ని గంటల తర్వాత మీ ఫోన్​ను స్విచ్ ఆన్ చేయాలి. ఒక వేళ అది స్విచ్ ఆన్​ కాకపోతే, మీరు కచ్చితంగా సర్వీస్ సెంటర్​కు వెళ్లాలి.
  4. సర్వీస్ సెంటర్​కు తీసుకెళ్లాలి : మీ ఫోన్ స్విచ్ ఆన్ కాని పక్షంలో సర్వీస్ సెంటర్​కు దానిని తీసుకెళ్లాలి. హార్డ్​వేర్ డ్యామేజ్ అయితే, దానిని రీప్లేస్ చేయాలి. ఒకవేళ మీ ఫోన్​కు వారంటీ ఉంటే, దానిని ఉపయోగించుకోవాలి. చాలా మంది స్థానికంగా ఉండే వ్యక్తుల దగ్గర రిపేర్ చేయిస్తుంటారు. కానీ అఫీషియల్ సర్వీస్ సెంటర్​కు వెళ్లడమే మంచిది.
  5. ఫోన్​ను పూర్తిగా చెక్ చేయాలి : మీ ఫోన్​ను రిపేర్ చేయించాక, దానిలోని కెమెరా, స్క్రీన్, ఆడియో, స్పీకర్స్ సరిగ్గా ఉన్నాయో లేదో కొద్ది రోజులపాటు గమనించండి. సాధారణంగా మీ ఫోన్​లో తేమ కనుక ఉంటే ఐఓస్ డివైస్​లో 'లిక్విడ్ డిటెక్టెడ్ ఇన్​ లైటెనింగ్ కనెక్టర్​' అని, శాంసంగ్​ డివైజ్​లో 'మాయిశ్చర్​ డిటెక్టెడ్' అని వార్నింగ్ వస్తుంది. అలా వస్తే మొబైల్​లో నీరు ఉన్నట్లే. అలాంటప్పుడు మరోసారి సర్వీస్ సెంటర్​ను సంప్రదించండి. వాళ్లే మీకు తగిన పరిష్కారం చూపిస్తారు.

భవిష్యత్​లో ఇలాంటి సమస్యలు మళ్లీ తలెత్తకుండా మీ ఫోన్​/ ట్యాబ్​ కోసం మంచి బీమా పాలసీని తీసుకోవాలి. అలాగే బాత్​రూమ్​లో, నీళ్లు వాడికం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో సెల్​ఫోన్లు వాడకండి. అప్పుడే మీ ఫోన్ సురక్షితంగా ఉంటుంది.

ట్రూకాలర్​ నుంచి మీ ఫోన్​ నంబర్​ తొలగించాలా? ఈ సింపుల్ స్టెప్స్​ ఫాలో అవ్వండి!

ఓపెన్ AI మరో సంచలనం- మ్యాటర్ ఇస్తే వీడియో రెడీ- ఎలా పనిచేస్తుందంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.