How To Overcome Phone Addiction : ఇప్పుడంతా డిజిటల్ హవా నడుస్తోంది. స్మార్ట్‌ఫోన్స్ మన జీవితాన్ని మార్చేస్తున్నాయి. కూర్చున్న చోటే మనకు కావాల్సిన సమాచారాన్ని, వినోదాన్ని అందిస్తున్నాయి. ఎవరితో అయినా సులభంగా మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. అయితే స్మార్ట్ఫోన్లను పరిధికి మించి ఉపయోగిస్తే, ఎన్నో మానసిక, ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మీ ప్రొడక్టివిటీ, రిలేషన్షిప్స్ కూడా దెబ్బతింటాయి. అందుకే ఈ స్మార్ట్‌ఫోన్ అడిక్ట్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
1. అవగాహన ముఖ్యం : మీరు ఇప్పటికే స్మార్ట్‌ఫోన్ బానిసలుగా మారినట్లయితే, ముందుగా దానికి గల కారణాలను తెలుసుకోండి. మీరు ఫోన్ ఎక్కువగా వాడటం వల్ల మీరు చేయాల్సిన పనులకు ఏవిధంగా అంతరాయం ఏర్పడుతుందో పరిశీలించండి. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో సంబంధాలను ఫోన్ వాడకం ఏవిధంగా ప్రభావితం చేస్తుందో కూడా చూసుకోండి. దీని వల్ల మీ సమస్యను మీరే గ్రహించగలుగుతారు. మరీ అవసరమైతే వేరొకరి సహాయం కూడా తీసుకోండి. అందులో తప్పేమీ లేదు.
2. సరైన లక్ష్యాలు : మీరు స్మార్ట్ ఫోన్ వినియోగాన్ని తగ్గించుకునేందుకు సరైన లక్ష్యాలను ఏర్పరుచుకోండి. మీ స్క్రీన్ సమయాన్ని చాలా వరకు తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మీరు ఏదైనా పనిలో ఉన్నప్పుడు ఫోన్‌ను మ్యూట్‌లో పెట్టుకోవడం మంచిది. అలాగే రాత్రి పడుకునే ముందు ఫోన్‌ను సైలెంట్లో పెట్టుకోండి.
3. మానిటరింగ్ యాప్స్ : మనం ప్రతిరోజూ ఎంత సమయం ఫోన్ ఉపయోగిస్తున్నామనే విషయాన్ని గుర్తించే యాప్స్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి. దీనికోసం ప్లేస్టోర్‌లో బోలేడు యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఒక మంచి యాప్‌ను ఇన్స్టాల్ చేసుకుని, ఫోన్ యుసేజ్ టైమ్‌ను సెట్ చేసుకోండి. ఆ సమయం పూర్తవ్వగానే మీకు అలర్ట్ వస్తుంది. దీంతో మీరు వెంటనే ఫోన్ వాడకాన్ని ఆపేయడానికి వీలవుతుంది.
4. ఫోన్-ఫ్రీ జోన్‌లను క్రియేట్ చేసుకోండి : డైనింగ్ టేబుల్ లేదా బెడ్‌రూమ్ వంటి కొన్ని ప్రాంతాలను ఫోన్-ఫ్రీ జోన్‌లుగా మార్చుకోండి. ఈ విధంగా మీకు మీరే సరిహద్దులను ఏర్పరచుకోండి. ఇది మొదట్లో కొంచెం కష్టంగా అనిపించినా, తర్వాత క్రమంగా అలవాటుగా మారుతుంది.
5. స్క్రీన్-ఫ్రీ టైమ్ సెట్ చేయండి : భోజనం చేసే సమయంలో, నిద్రించే ముందు ఫోన్ వాడకూడదని చాలా మందికి తెలుసు. కానీ ఇలాంటి సమయాల్లోనే చాలా మంది ఫోన్లు వాడుతుంటారు. ఫలితంగా మనం తిన్న ఆహారం ఒంటికి పట్టదు. అంతేకాదు నిద్రించేప్పుడు ఫోన్ చూస్తే నిద్రలేమి సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది.
6. అనవసరమైన నోటిఫికేషన్‌లను డిజేబుల్ చేయండి: మీ ఫోన్‌లో అనవసర నోటిఫికేషన్‌లను ఆఫ్ చేయండి. ఎందుకంటే మీరు ఫోన్ వాడుతున్న సమయంలో ఏదో ఒక నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది. దీంతో ఆ నోటిఫికేషన్లు చూస్తూ, సమయం అంతా వేస్ట్ చేసుకుంటూ ఉంటాం. అందుకే ఇలాంటి అవసరంలేని నోటిఫికేషన్లను డిజేబుల్ చేసేయడం చాలా మంచిది.
7. ప్రత్యామ్నాయ కార్యకలాపాలపై ఫోకస్ : మీరు స్మార్ట్ఫోన్లకు బదులుగా ప్రత్యామ్నాయాలపై ఫోకస్ పెట్టాలి. చదవడం, రాయడం, వ్యాయామం చేయడం, ఆటలు ఆడడం, ఫ్రెండ్స్‌తో సరదాగా గడపడం లాంటి పనులు చేస్తుండాలి. ఇలా చేస్తే తప్పుకుండా ఫోన్ అడిక్షన్ నుంచి క్రమంగా బయటపడతారు.
8. మైండ్‌ఫుల్‌నెస్‌ను ప్రాక్టీస్ చేయండి : మీ మెదడు ప్రశాంతంగా ఉండాలంటే ధ్యానం, యోగా లాంటివి చేయాలి. వీటిని ప్రతిరోజూ చేయడం వల్ల మీ ఆలోచన, పనితీరు బాగా మెరుగవుతుంది. దీంతో క్రమంగా ఫోన్‌కు దూరం అవుతారు.
9. సాయం కోరండి : స్మార్ట్‌ఫోన్ అడిక్షన్ నుంచి బయటపడేందుకు, మీ కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారం తీసుకోవడం మంచిది. ఈ విషయంలో ఎలాంటి మొహమాటం పడకూడదు. ఇంకా అవసరమైతే మానసిక వైద్యులను కూడా తప్పక సంప్రదించాలి.
10. వాస్తవాలు తెలుసుకోవాలి: మనం స్మార్ట్ఫోన్లలో చాలా వరకు పనికిరాని విషయాల గురించి చదువుతుంటాం లేదా చూస్తుంటాం. అందుకే అలాంటి వాటి నుంచి బయటపడాలంటే కచ్చితంగా వాస్తవాల గురించి తెలుసుకోవాలి. ఇది అంత ఈజీ కాకపోవచ్చు కానీ మనస్సు పెడితే, కచ్చితంగా మార్గం ఉంటుంది. ఈ విధంగా చేస్తే, మీరు ఫోన్ అడిక్షన్ నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది.
యూట్యూబ్ నయా ఏఐ ఫీచర్స్ - ఇకపై బోరింగ్ వీడియోలకు గుడ్ బై! - YouTube AI Features