How To Check Phone Battery Health : స్మార్ట్‌ఫోన్ ఒక నిత్యవసర వస్తువుగా మారిన నేపథ్యంలో, దాని పనితీరును ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం తప్పనిసరి. మరీ ముఖ్యంగా మీరు ఉపయోగిస్తున్న ఫోన్ బ్యాటరీ హెల్త్ చెక్ చేసుకోవడం చాలా అవసరం. అందుకే మీ ఆండ్రాయిడ్ ఫోన్ బ్యాటరీ హెల్త్‌ను చాలా సింపుల్‌గా ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్యాటరీ లైఫ్ స్పాన్ పెరగాలంటే?
ఫోన్లు అన్నింటికీ బ్యాటరీలే ప్రధానం. బ్యాటరీ పెర్ఫెక్టుగా ఉంటేనే ఫోన్ బాగుంటుంది. అందుకే బ్యాటరీ పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం వహించకూడదు. ఎందుకంటే ఫోన్ బ్యాటరీపై పడే పనిభారం అంతాఇంతా కాదు. అలాంటి బ్యాటరీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే మొబైల్ బ్యాటరీ లైఫ్ దాని స్థితికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. ఒకవేళ బ్యాటరీలో ఏమైనా లోపాలు/ సమస్యలు ఉంటే వాటిని సవరించుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే మీ ఫోన్ బ్యాటరీ జీవిత కాలం పెరుగుతుంది. మీ డివైజ్ ఎక్కువ కాలం మంచి కండిషన్లో ఉంటుంది.
ఇన్-బిల్ట్ ఫీచర్స్‌తో
ఫోన్ బ్యాటరీ హెల్త్‌ను చెక్ చేసేందుకు అనేక యాప్‌లు నేడు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు కొన్ని ఫోన్లలోని బిల్ట్-ఇన్ ఫీచర్స్ కూడా ఉంటాయి. వాటిని ఉపయోగించి కూడా బ్యాటరీ హెల్త్‌ను చెక్ చేయవచ్చు. ఇందుకోసం మీరు ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అప్పుడు ఏయే యాప్స్ ఎంత మేరకు బ్యాటరీని ఉపయోగించుకుంటున్నాయో తెలుస్తుంది. కొన్ని ఫోన్లు అయితే బ్యాటరీ టెంపరేచర్‌ను కూడా తెలియజేస్తాయి.
ఫోన్‌ను ఫుల్ ఛార్జింగ్ పెట్టిన తరువాత, ఏయే యాప్స్ ఎక్కువగా ఛార్జింగ్‌ను వినియోగిస్తున్నాయో కూడా ఈ స్క్రీన్ చూపిస్తుంది. స్క్రీన్ పైభాగంలో, మూడు చుక్కలతో ఒక సింబల్ ఉంటుంది. దీన్ని నొక్కితే, యాప్‌ల వారీగా బ్యాటరీ వినియోగాన్ని చూడవచ్చు. మీరు కావాలని అనుకుంటే, ఏయే యాప్స్ ఎంత మేరకు బ్యాటరీ యూసేజ్ చేసుకోవచ్చే కూడా సెట్ చేసుకోవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే బ్యాటరీ యుసేజ్ను అప్టిమైజ్ చేసుకోవచ్చు.
బ్యాటరీ స్టాటిస్టిక్స్ చెక్
ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్న యూజర్లు ఆండ్రాయిడ్ డయాగ్నోస్టిక్ మెనును చెక్ చేసుకోవచ్చు. దీని ద్వారా మీరు వాడుతున్న ఫోన్ వివరాలు, వైర్‌లెస్ నెట్‌వర్క్ వినియోగం గురించి సమాచారం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా మీ ఆండ్రాయిడ్ ఫోన్ బ్యాటరీ సమాచారాన్ని చూడవచ్చు.
స్పెషల్ కోడ్
ఫోన్ డయాగ్నోస్టిక్ మెనూ ఓపెన్ చేయడానికి ##4636## నంబర్‌ను ఎంటర్ చేయాలి. దీని ద్వారా మీ ఫోన్ బ్యాటరీ హెల్త్ వివరాలు తెలుసుకోవచ్చు.
శాంసంగ్ యాప్
థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా కూడా బ్యాటరీ హెల్త్ చెక్ చేసుకోవచ్చు. అయితే కొన్ని కంపెనీలు ఇలాంటి యాప్స్‌ను సొంతంగా క్రియేట్ చేస్తుంటాయి. ఉదాహరణకు శాంసంగ్ ఫోన్లో బ్యాటరీ ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా, బ్యాటరీ సామర్థ్యాన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. బ్యాటరీ స్టేటస్ రెడ్ కలర్ ఉంటే, దాని జీవిత కాలం చివరి దశలోకి వచ్చేసిందని, కొత్త బ్యాటరీ మార్చాలని అర్థం చేసుకోవాలి.
కంపెనీలు ఇలాంటి ఆప్షన్ అందించకపోతే థర్డ్ పార్టీ యాప్‌లను ఉపయోగించవచ్చు. ఆక్యుబ్యాటరీ, CPU-Z లాంటి అనేక ఉచిత యాప్‌లు గూగుల్ ప్లేస్టోర్‌లో ఉన్నాయి. ఇవి బ్యాటరీకి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తాయి. ఈ యాప్‌లు ఛార్జింగ్ చరిత్ర, బ్యాటరీ డిశ్చార్జ్ రేట్, ఆరోగ్య అంచనాలు, మెజర్మెంట్స్ చూపిస్తాయి. మరెందుకు ఆలస్యం వీటిని ఉపయోగించి, మీ బ్యాటరీ హెల్త్ చేసుకోండి.
వీడియో ఎడిటింగ్‌కు ఉపయోగపడే టాప్-6 ఫ్రీ ఏఐ టూల్స్ ఇవే! - Free AI Tools For Video Editing