ETV Bharat / technology

మీ ఆండ్రాయిడ్ ఫోన్ బ్యాటరీ లైఫ్ పెరగాలా? ఈ 10 సెట్టింగ్స్ మార్చుకోండి! - HOW TO BOOST PHONE BATTERY LIFE - HOW TO BOOST PHONE BATTERY LIFE

How To Boost Android Phone Battery Life : మీ ఆండ్రాయిడ్ ఫోన్​ను పదేపదే ఛార్జ్ చేయాల్సి వస్తోందా? అయితే మీ ఫోన్​ బ్యాటరీ లైఫ్ త్వరగా దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే ఆండ్రాయిడ్ ఫోన్​ బ్యాటరీ లైఫ్ పెంచే టాప్​-10 సెట్టింగ్స్​ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

How To Improve Android Phone Battery Life
How To Boost Android Phone Battery Life (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 1, 2024, 1:25 PM IST

How To Boost Android Phone Battery Life : నిరంతరాయంగా ఫోన్​ను ఉపయోగించడం వల్ల, సహజంగానే బ్యాటరీ త్వరగా డ్రెయిన్​ అయిపోతుంది. దీంతో ఫోన్​కు పదే పదే ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుంది. దీని వల్ల ఫోన్ బ్యాటరీ లైఫ్ తగ్గిపోయే అవకాశం ఉంది. అలాగే మన ఫోన్​లోని కొన్ని సెట్టింగ్స్​ కూడా బ్యాటరీ లైఫ్​ను తగ్గించేస్తాయి. అందుకే ఇలాంటి సమస్య రాకుండా, ఫోన్​ బ్యాటరీ లైఫ్​ను పెంచే, టాప్​-10 సెట్టింగ్స్​​ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. అవసరం లేనప్పుడు డిస్​ప్లేను ఆఫ్​లో ఉంచండి
అవసరం అయినప్పుడు తప్ప మీ ఆండ్రాయిడ్ ఫోన్ డిస్​ప్లేను ఆఫ్​లో ఉంచడమే మంచిది. ఎందుకంటే, డిస్​ప్లే ఆన్​లో ఉంచడం వల్ల గంటకు 1-2 శాతం వరకు ఛార్జింగ్​ తగ్గిపోతుందని కంపెనీలు చెబుతుంటాయి. కానీ వాస్తవంలో ఇంత కంటే ఎక్కువగానే బ్యాటరీ ఛార్జింగ్ తగ్గిపోతుంది. అందుకే మీ బ్యాటరీ లైఫ్​ను పెంచుకునేందుకు డిస్​ప్లేను ఆఫ్​లో ఉంచడం మంచిది. ఇందుకోసం సెట్టింగ్స్ యాప్​ ఓపెన్ చేసి settings > Lock Screen > always show info> Always On Display ఆప్షన్​పై క్లిక్ చేసి, దానిని టర్న్​ఆఫ్​ చేయాలి.

2. ఎనేబుల్​ అడాప్టివ్ బ్యాటరీ
మీ ఫోన్​లో 'అడాప్టివ్ బ్యాటరీ' అనే ఫీచర్ ఉంటుంది. దీనిని ఎనేబుల్ చేసుకోవడం ద్వారా మీ బ్యాటరీ లైఫ్​ను పెంచుకోవచ్చు. ఇందుకోసం సెట్టింగ్స్ యాప్​ను ఓపెన్ చేసి Settings > Battery > Adaptive battery అనే ఫీచర్​ను ఎనేబుల్ చేసుకోవాలి.

3. డార్క్​మోడ్​​ను ఉప‌యోగించ‌డం
మీ ఫోన్​లో OLED డిస్​ప్లే ఉంటే, డార్క్​మోడ్​ను ఎనేబుల్ చేసుకోవడం మంచిది. దీని వల్ల బ్యాట‌రీ లైఫ్ సేవ్ చేసుకోవ‌చ్చు. ఈ ఫీచ‌ర్ ఫోన్‌ డిస్​ప్లే పిక్సెల్స్​ను, బ్యాగ్రౌండ్​​ను కాస్త డిమ్ చేస్తుంది. దీనివల్ల బ్యాట‌రీ వినియోగం తగ్గుతుంది. ఇందుకోసం సెట్టింగ్స్​లోకి వెళ్లి, Settings > Display > డార్క్​మోడ్​ను ఎనేబుల్ చేసుకోవాలి.

4. బ్రైట్​నెస్ తగ్గించాలి!
ఫోన్ బ్రైట్​నెస్​ను తగ్గించడం వల్ల కూడా బ్యాటరీ లైఫ్​ను పెంచుకోవచ్చు. అలాగే Screen timeoutను కూడా ఎనేబుల్ చేసుకోవాలి.

5. అన‌వ‌స‌ర అకౌంట్​లను తీసేయండి
సాధారణంగా మనం ఒక ఈ-మెయిల్ అకౌంట్​తో ఫోన్​లో లాగిన్ అవుతాం. అయితే సోషల్ మీడియా యాప్​ల కోసం, బ్యాకప్ కోసం మరిన్ని ఈ-మెయిల్ అకౌంట్స్​ను కూడా యాడ్​ చేసుకుంటాం. దీని వల్ల కూడా బ్యాటరీ లైఫ్ తగ్గుతుంది. ఎలా అంటే? మీరు సెర్చ్ చేసే సమాచారాన్ని వివిధ మెయిల్స్ మధ్య సింక్రనైజ్​ చేయడానికి ఫోన్​ ప్రతిసారీ రీఫ్రెష్ అవుతుంది. దీని వల్ల బ్యాటరీ లైఫ్ తగ్గుతుంది. అందుకే మీ ఫోన్​లో ఒకటి లేదా రెండు ఈ-మెయిల్స్ మాత్రమే వాడాలి. మిగతావాటిని రిమూవ్ చేయాలి.

6. కీబోర్డ్ సౌండ్​ను ఆఫ్ చేయండి
ఫోన్​లో మనం ఏదైనా టైప్ చేసేటప్పుడు సహజంగానే సౌండ్ వస్తుంది. దీని వల్ల కూడా బ్యాటరీ లైఫ్ తగ్గుతుంది. అందుకే ఈ సౌండ్స్​ను, హాప్టిక్స్​ను టర్న్​ఆఫ్​ చేయాలి. ఇందుకోసం సెట్టింగ్స్​లోకి వెళ్లి Settings > Language and input > keyboard settings> Preferences> Sound on keypress, Haptic feedback on keypressను డిజేబుల్ చేయాలి.

7. అనవసర నోటిఫికేషన్​లను డిజేబుల్ చేయండి!
నోటిఫికేషన్​లు కూడా మీ ఫోన్ బ్యాటరీ సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. అందుకే పలు అనవసరమైన యాప్స్ నుంచి వచ్చే నోటిఫికేషన్​లను డిజేబుల్ చేయాలి. కేవలం అవసరమైన వాటికి మాత్రమే నోటిఫికేషన్​లు వచ్చేలా చూసుకోవాలి. ఇందుకోసం సెట్టింగ్స్ యాప్​లోకి వెళ్లి Settings > Notifications >App notifications ఓపెన్ చేయాలి. అక్కడ మీకు అన్ని రకాల యాప్స్ కనిపిస్తాయి. మీకు అవసరంలేని యాప్ ఓపెన్ చేసి నోటిఫికేషన్స్​ను టర్న్​ఆఫ్ చేసేయండి.

8. 'Hey Google' డిటెక్షన్​ను ఆఫ్ చేయండి
మీ ఫోన్​లో 'హేయ్​ గూగుల్' ఆప్షన్​ను కూడా డిసేబుల్ చేయాలి. ఎందుకంటే గూగుల్ వాయిస్ అసిస్టెంట్ మీరు ఇచ్చే ఆదేశాల కోసం ఎప్పుడూ యాక్టివ్​గా ఉంటుంది. దీని వల్ల మీ ఫోన్​ బ్యాటరీ ఛార్జింగ్ త్వరగా అయిపోతుంది. ఇందుకోసం మీరు గూగుల్ యాప్ ఓపెన్ చేసి Google app> your profile> Settings > Google Assistant > Hey Google & Voice Match> Hey Google ఆప్షన్​ను ఆఫ్ చేయండి.

9. ఫోన్​ స్క్రీన్ రిఫ్రెష్ రేట్​ను తగ్గించండి
మీ ఫోన్ రిఫ్రెష్ రేటును తగ్గించుకోవాలి. అధిక రిఫ్రెష్ రేటు ఉన్న ఫోన్​లలో బ్యాటరీ వినియోగం చాలా ఎక్కువగా జరుగుతుంది. అందుకే ఈ ఫోన్ రిఫ్రెష్ రేటును ఆఫ్ చేయండి. ఇందుకోసం సెట్టింగ్స్ యాప్​లోకి వెళ్లి Settings> Smooth Displayపై క్లిక్ చేసి, రీఫ్రెష్ రేటును తగ్గించండి.

10. వైర్​లెస్ ఫీచర్లను టర్న్​ఆఫ్ చేయండి
వైఫై, బ్లూటూత్, లొకేషన్ సర్వీస్‌ (జీపీఎస్​) లాంటి వైర్​లెస్ ఫీచర్లను టర్న్​ఆఫ్ చేసుకోవాలి. అవసరం అయినప్పుడు మాత్రమే వీటిని ఆన్ చేయాలి. ఎందుకంటే వీటిని ఆన్​చేసి ఉంచితే బ్యాటరీ లైఫ్ చాలా వేగంగా తగ్గిపోతుంది.

బోనస్ పాయింట్​ : మీ ఫోన్​లోని 'లో-పవర్​ మోడ్'​ను ఆన్ చేసుకోవడం వల్ల కూడా బ్యాటరీ లైఫ్​ను పెంచుకోవచ్చు. ఈ లో-పవర్ మోడ్​ అనేది బ్యాక్ గ్రౌండ్​ యాప్స్​ యాక్టివిటీని, యాప్స్​ రీఫ్రెష్ రేటును, స్క్రీన్ బ్రైట్​నెస్​ను బాగా తగ్గిస్తుంది. ఫలితంగా మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది.

హెల్త్​ ట్రాకింగ్ కోసం మంచి స్మార్ట్​వాచ్ కొనాలా? టాప్-5 ఆప్షన్స్ ఇవే! - The Best Smartwatches Of 2024

ఆండ్రాయిడ్ ఫోన్​తో బెస్ట్​ ఫొటోస్​, వీడియోస్ తీయాలా? టాప్-10 టిప్స్ & ట్రిక్స్​ ఇవే! - Android Camera Tips And Tricks

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.