ETV Bharat / technology

స్పెషల్ కెమెరా, మ్యూజిక్​​ ఫీచర్స్​తో 'ఆండ్రాయిడ్​ 15 ప్రివ్యూ' రిలీజ్ - ఫుల్ వెర్షన్ ఎప్పుడు వస్తుందంటే?

Google Releases Android 15 : ఆండ్రాయిడ్​ యూజర్లకు గుడ్ న్యూస్. గూగుల్ కంపెనీ ఆండ్రాయిడ్​ 15 ఫస్ట్​ డెవలపర్​ ప్రివ్యూను రిలీజ్ చేసింది. త్వరలోనే దీని సెకండ్ ప్రివ్యూ, బీటా వెర్షన్​లను కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. మరి దీనిలోని స్పెషల్ ఫీచర్లు ఏమిటో చూద్దామా?

Android 15 release date
Google releases Android 15 Developer Preview 1
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 18, 2024, 3:20 PM IST

Google Releases Android 15 : గూగుల్ కంపెనీ ఆండ్రాయిడ్​ 15 గురించి పెద్ద అప్​డేట్ ఇచ్చింది. ప్రస్తుతానికి ఫస్ట్​ డెవలపర్​ ప్రివ్యూను మాత్రమే రిలీజ్ చేసిన గూగుల్​, త్వరలోనే దీని సెకండ్ ప్రివ్యూ, బీటా వెర్షన్​లను కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. గూగుల్ కంపెనీ ఈ ఆండ్రాయిడ్ 15 అప్​డేట్​లో 3 కీలకమైన అంశాలపై దృష్టి కేంద్రీకరించింది. అవి ఏమిటంటే,

  1. ప్రైవసీ/సెక్యూరిటీ ఇంప్రూవ్​మెంట్​
  2. సపోర్టింగ్ క్రియేటర్స్​ అండ్ డెవలపర్స్​
  3. మాక్సిమైజింగ్​ యాప్​ పెర్ఫార్మెన్స్​

Android 15 Special Features :

  • ప్రైవసీ/ సెక్యూరిటీ : గూగుల్ కంపెనీ యూజర్ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అప్​డేట్స్​పై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. అందులో భాగంగానే ఆండ్రాయిడ్ ఏడీ సర్వీసెస్​ను ఎక్స్​టెన్షన్​ లెవల్​ 10 వరకు పెంచుతోంది. దీని వల్ల యూజర్ల ప్రైవసీ మెరుగుపడుతుంది. పైగా మొబైల్ యాప్స్​లో యూజర్లకు అవసరమైన పర్సనలైజ్డ్​ అడ్వర్టైజ్​మెంట్స్​ ఇవ్వడానికి వీలవుతుంది.
  • స్క్రీన్ షేరింగ్ : ప్రస్తుతానికి మనం ఫుల్​ స్క్రీన్​ను మాత్రమే షేర్ చేయగలుగుతున్నాము. అదే ఆండ్రాయిడ్​ 15 ద్వారా పార్షియల్​ స్క్రీన్ షేరింగ్ కూడా చేసుకునే వెసులుబాటు కలుగుతుంది.
  • హెల్త్ కంటెంట్​ : గూగుల్ కంపెనీ ఆండ్రాయిడ్ 15 అప్​డేట్​లో హెల్త్ కనెక్ట్ ప్లాట్​ఫామ్స్ ద్వారా యూజర్లకు ఉపయోగపడే ఫిట్​నెస్, న్యూట్రిషన్ డేటాను ఇచ్చేందుకు కృషి చేస్తోంది.
  • మాల్వేర్ డిటెక్షన్ : నేడు సైబర్ నేరగాళ్లు మాల్వేర్లను చొప్పించి యూజర్ల డేటాను దొంగిలిస్తున్నారు. దీనిని అరికట్టేందుకు ఆండ్రాయిడ్​ 15లో సెక్యూరిటీ మెజర్స్​ను పెంచుతున్నారు. దీని వల్ల మాల్వేర్ల నుంచి మన ఆండ్రాయిడ్ డివైజ్​ల్లోని డేటాకు రక్షణ ఏర్పడుతుంది.
  • కెమెరా ఛేంజెస్​ : ఆండ్రాయిడ్ 15లో అనేక కెమెరా ఛేంజెస్ కూడా చేస్తున్నారు. దీనితో తక్కువ వెలుతురులోనూ, కెమెరా ప్రివ్యూ బ్రైట్​నెస్​ పెంచుకోవచ్చు. కెమెరా ఫ్లాష్​ను కూడా కంట్రోల్ చేయవచ్చు.
  • మ్యూజిక్ క్రియేటర్స్​ కోసం : గూగుల్ కంపెనీ మ్యూజిక్ క్రియేటర్ల కోసం ఆండ్రాయిడ్ 15లో UMP సపోర్ట్ కూడా కల్పిస్తోంది. దీని ద్వారా వర్చువల్ ఎంఐడీఐ యాప్స్​ను సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. మ్యూజిక్ కంపొజిషన్​, సింథసైజర్​ యాప్​లను చక్కగా వాడుకోవచ్చు.
  • సూపర్ పెర్ఫార్మెన్స్ కోసం : ఆండ్రాయిడ్​ 15ను 'ఆండ్రాయిడ్​ డైనమిక్​ పెర్ఫార్మెన్స్​ ఫ్రేమ్​వర్క్​' (ADPF)కు అప్​డేట్ చేస్తున్నారు. దీని వల్ల బ్యాక్​గ్రౌండ్ వర్క్​ లోడ్​ ఎంత ఎక్కువ ఉన్నా, యాప్​ పెర్ఫార్మెన్స్ ఏ మాత్రం తగ్గదు. అంతేకాదు దీనిలో థర్మల్​ థ్రోట్లింగ్​ను తగ్గించే థర్మల్ థ్రెషోల్డ్స్​ కూడా ఉన్నాయి.

ఆండ్రాయిడ్ 15 రిలీజ్ డేట్​
ఆండ్రాయిడ్​ ఫస్ట్ ప్రివ్యూ ఇప్పటికే విడుదలైంది. మార్చి నెలలో సెకండ్ డెవలపర్ ప్రివ్యూ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. బీటా వెర్షన్ మాత్రం ఏప్రిల్​-జులై నెలల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక పుల్​ ఆండ్రాయిడ్​ 15 వెర్షన్ అనేది బహుశా ఆగస్టు-సెప్టెంబర్​ నెలల్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ గూగుల్ మాత్రం రిలీజ్ డేట్​పై ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఏయే ఫోన్లలో దీనిని డౌన్​లోడ్ చేసుకోవచ్చు?
ప్రస్తుతానికి గూగుల్​ పిక్సెల్​, ట్యాబ్లెట్స్​లో మాత్రమే ఈ ఆండ్రాయిడ్ 15 డెవలపర్​ ప్రివ్యూ 1ను టెస్ట్ చేయడానికి వీలవుతుంది. పిక్సెల్​ 8, పిక్సెల్​ 8ప్రో, పిక్సెల్​ 7, పిక్సెల్ 7 ప్రో, పిక్సెల్ 7ఏ, పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రో, పిక్సెల్ 6ఏ, పిక్సెల్ ఫోల్డ్​, పిక్సెల్ ట్యాబ్లెట్​ల్లో ఆండ్రాయిడ్​ 15ను డౌన్​లోడ్​ చేసుకోవచ్చు.

ఆండ్రాయిడ్​ 15ను సాధారణ యూజర్లు డౌన్​లోడ్ చేసుకోవచ్చా?
ఆండ్రాయిడ్ 15 అనేది ఇంకా టెస్టింగ్ దశలోనే ఉంది. దీనిలో చాలా బగ్స్ ఉండే అవకాశం ఉంది. కనుక కేవలం డెవలపర్లు మాత్రమే దీనిని డౌన్​లోడ్ చేసుకోవడం బెటర్​. అది కూడా టెస్టింగ్ పర్పస్​ కోసం. సాధారణ యూజర్లు ఆండ్రాయిడ్​ 15 ఫస్ట్ ప్రివ్యూను డౌన్​లోడ్​ చేసుకోకపోవడమే మంచిది అని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ మీకు అంతగా దానిని వాడాలనిపిస్తే, బీటా వెర్షన్ రిలీజ్ అయిన తరువాత ప్రయత్నించమని చెబుతున్నారు.

యూట్యూబర్స్​​ ఎంత సంపాదిస్తున్నారో తెలుసా? వింటే షాక్​ అవడం గ్యారెంటీ!

మీ ఫోన్​/ ట్యాబ్​ నీటిలో పడిపోయిందా? ఈ సింపుల్​ చిట్కాలతో వాటిని సేవ్​ చేసుకోండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.