ETV Bharat / technology

ఇక చాట్‌జీపీటీలో ఇమేజ్‌ జనరేషన్‌ ఫ్రీ- కానీ ఓ కండిషన్​ - ChatGPT Image Generator - CHATGPT IMAGE GENERATOR

ChatGPT Image Generator Free : ఓపెన్ ఏఐ సంస్థ రూపొందించిన చాట్​జీపీటీ తన డాల్‌- ఇ 3 ఏఐ మోడల్‌ను యూజర్లందరికీ ఉచితంగా వినియోగించుకొనేందుకు వెసులుబాటు కల్పించింది. ఆ ఫీచర్​ ద్వారా చిత్రాలను క్రియేట్ చేసుకోవచ్చని తెలిపింది. కానీ దానిపై పరిమితి విధించింది.

ChatGPT New Feature
ChatGPT Image Generator (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 10, 2024, 10:20 AM IST

Updated : Aug 10, 2024, 10:29 AM IST

ChatGPT Image Generator Free : ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (AI) ఆధారంగా చాట్​జీపీటీ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు పరిచయం చేస్తోంది. ఇటీవల తీసుకొచ్చిన డాల్-ఇ 3 ఏఐ మోడల్ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటి వరకు చాట్​జీపీటీ ప్లస్‌ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే ఉన్న ఈ ఫీచర్​ను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. కానీ దానిపై ఓ లిమిట్ పెట్టింది. రోజుకు రెండు ఫోటోలను క్రియేట్‌ చేసుకోవచ్చని పేర్కొంది.

టెక్ట్స్‌ సాయంతో ఇమేజ్‌ను రూపొందించే సదుపాయంతో చాట్‌జీపీటీ డాల్-ఇ 3 ఎఐ మోడల్‌ను గతేడాది సెప్టెంబరులో తీసుకొచ్చింది. చాట్‌జీపీటీ వెబ్‌సైట్‌లోని సైడ్‌ ప్యానెల్‌ సాయంతో డాల్‌- ఇ3 ఇంటర్‌ఫేస్‌కు వెళ్లొచ్చు లేదంటే చాట్‌జీపీటీ ద్వారా చిత్రాలు రూపొందించొచ్చు. మీకు నచ్చిన ఫొటో రూపొందించడానికి యాంగిల్‌, లైటింగ్‌, కెమెరా డిటైల్స్స్​ను టెక్ట్స్‌ రూపంలో ఇవ్వొచ్చు. ఆండ్రాయిడ్, ఐఫోన్‌ యూజర్లు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ అందరికీ అందుబాటులోకి రాలేదు.

అయితే చాట్​జీపీటీని చాలా మంది వినియోగిస్తున్నారు. కొత్త యూజర్లు కూడా ఈ టూల్ వాడేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే చాట్‌ జీపీటీ ఉపయోగించేందుకు అకౌంట్‌ క్రియేట్ చేసి, సైన్‌ ఇన్‌ కావాల్సిన అవసరం లేదు. లాగిన్ కాకుండానే ఎవరైనా చాట్‌జీపీటీ వాడుకోవచ్చు. ఈ-మెయిల్ ఐడీ లేదా ఫోన్ నంబర్ లేకుండానే చాట్​జీపీటీను వాడుకోవచ్చు. అంతకుముందు యూజర్స్ ఈ-మెయిల్, ఫోన్ నంబర్ ఉపయోగించి గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆపిల్ ప్లాట్​ఫామ్స్​ ద్వారా చాట్ జీపీటీలో సైన్-ఇన్ చేయాల్సి వచ్చేది. అయితే ఓపెన్​ ఏఐ ఏప్రిల్ 1 నుంచి చాట్​జీపీటీ 3.5ను రోల్​అవుట్ చేసింది. ఈ చాట్​జీపీటీ వెర్షన్​లో మీరు సైన్-ఇన్‌ చేయకుండానే, నేరుగా దానిని వాడుకోవచ్చు. అయితే చాట్​జీపీటీ అకౌంట్ క్రియేట్ చేసుకున్న వినియోగదారులు మాత్రమే వాయిస్ చాట్స్, పర్సనలైజ్డ్ ఇన్​స్ట్రక్షన్స్​ లాంటి అదనపు సేవలు పొందగలుగుతారు. మిగతావారికి ఈ సేవలు అందుబాటులో ఉండవు.

ఏదిఏమైనప్పటికీ ఈ చాట్​జీపీటీ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ సున్నితమైన సమాచారాన్ని ఈ ఏఐ చాట్​బాట్​తో పంచుకోకూడదు. ఓపెన్ ఏఐ సంస్థకు చెందిన లేటెస్ట్ చాట్​జీపీటీ 4 లేదా డాల్-ఇ 3లు ఉపయోగించాలంటే మాత్రం, కచ్చితంగా చాట్​జీపీటీ అకౌంట్​లో లాగిన్ కావాల్సి ఉంటుంది. అకౌంట్ లేకుండానే చాట్ జీపీటీని వాడడం ఎలా? అనేది తెలుసుకోవాలనుకుంటే ఈ లింక్​పై క్లిక్ చేయండి.

Last Updated : Aug 10, 2024, 10:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.