BSNL Prepaid Plan: టెలికాంలో ఎన్ని ప్రైవేటు సంస్థలు వచ్చినా ప్రభుత్వరంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ ప్రతిభ ఎప్పుడూ మసకబారలేదు. ప్రైవేటు సంస్థలకు ధీటుగా ఇది ఎప్పుడూ దూకుడుగా వెళ్తూనే ఉంటుంది. తన 4జీ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త కొత్త ఆలోచనలతో పరుగులు పెడుతోంది. కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త ప్లాన్‌లను పరిచయం చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా తన ప్రీపెయిడ్ యూజర్ల కోసం సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది. 60 రోజుల వ్యాలిడిటీతో బీఎస్‌ఎన్‌ఎల్ తన కొత్త రీఛార్జి ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.
BSNL సరికొత్త రీఛార్జి ప్లాన్ వివరాలు ఇవే:
- బీఎస్‌ఎన్‌ఎల్ తీసుకొచ్చిన రూ.345 రీఛార్జి ప్లాన్ 60 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌తో వస్తోంది.
- ఈ ప్యాక్‌లో రోజుకు 1జీబీ డేటా, రోజుకు 100 ఎసెమ్మెస్‌లు ఉంటాయి.
- అపరిమిత కాలింగ్ పొందొచ్చు.
- అయితే ఈ రీఛార్జి ప్లాన్‌లో BSNL ట్యూన్స్, హర్డీ గేమ్స్ తరహా సదుపాయాలు మాత్రం ఉండవు.
- ప్రైవేట్ టెలికాం కంపెనీలన్నీ ఇటీవల టారిఫ్‌లను పెంచేశాయి.
- BSNL మాత్రం అలాంటి చర్యలకు పాల్పడలేదు.
- ఫలితంగా చాలామంది యూజర్లు BSNL ప్లాన్లపై మొగ్గుచూపతున్నారు.
- దీన్ని అవకాశంగా చేసుకొని బీఎస్‌ఎన్‌ఎల్ సరికొత్త ప్లాన్‌లను ప్రవేశపెడుతోంది.
- BSNL తీసుకొచ్చిన ఈ కొత్త రీఛార్జి ప్లాన్‌తో కస్టమర్లు మరింత పెరిగే అవకాశం ఉంది.
ఏఐ ఫీచర్లతో గ్లోబల్‌గా లాంచైన శాంసంగ్ S24 FE - ధర ఎంతంటే? - Samsung Galaxy S24 FE