Black Friday Online Sale: ప్రస్తుతం అమెజాన్ 'బ్లాక్ ఫ్రైడే సేల్' సంచలనం సృష్టిస్తోంది. ఈ పేరు ఇండియాలో ఎక్కువమందికి తెలియకపోవచ్చు. కానీ అమెరికాలో మాత్రం ఈ సేల్ చాలా ఫేమస్. ఈ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో భాగంగా స్మార్ట్ ఫోన్లు, టీవీలు, గృహోపకరణాలు, గేమింగ్ కన్సోల్స్, ఫ్యాషన్, బ్యూటీ ప్రొడక్ట్స్ వంటి వాటిపై బంపర్ ఆఫర్లను అందిస్తారు. దీంతో ఈ సేల్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని జనాలు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తారు. ఇక ఈ సేల్ సందడి ఇటీవలే ఇండియాలో కూడా మొదలైంది. తాజాగా దిగ్గజ ఈ-కామర్స్ బ్రాండ్ అమెజాన్ మనదేశంలో 'బ్లాక్ ఫ్రైడే సేల్'ను ప్రకటించింది. ఈ సేల్‌లో ఐఫోన్ 13, వన్‌ప్లస్ నార్డ్ CE 3, రియల్మీ GT 6T 5G వంటి అనేక టాప్ స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లను అందిస్తుంది.
బ్లాక్ ఫ్రైడే సేల్‌లో టాప్ డీల్స్ ఇవే!:
OnePlus Nord CE 3 5G (Aqua Surge): అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో 'వన్‌ప్లస్ నార్డ్ CE 3' ఫోన్ మంచి ఆఫర్లో లభిస్తుంది. ఈ ఫోన్లో చాలా మంచి ఫీచర్లు ఉన్నాయి. ఇది 5G నెట్‌వర్క్ కనెక్టివిటీతో వస్తోంది. 8GB RAMతో పాటు ఈ ఫోన్ 128GB స్టోరేజీని కలిగి ఉంది. ఈ మొబైల్ చాలా స్లిమ్‌గా ఆకర్షణీయమైన లుక్‌లో ఉంటుంది. ఇది 80W SuperVOOC ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీంతో ఇది తక్కువ సమయంలో ఫుల్ ఛార్జ్ అవుతుంది. అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ ఆఫర్లో ఇది రూ.16,999 ధరకు లభిస్తుంది.
Apple iPhone 13 (128GB)-Blue: యాపిల్ 'ఐఫోన్ 13' మోడల్లో టాప్ ఫోన్ కొనాలనుకునేవారికి దీనిలోని 128GB స్టోరేజ్ వేరియంట్ బెస్ట్ ఆప్షన్. ఇది బ్లూ కలర్లో వస్తుంది. ఈ మొబైల్ iOS 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. దీనిలోని 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే కూడా చాలా బాగుంది. ఇది అడ్వాన్స్డ్ డ్యూయల్ కెమెరా సిస్టమ్‌తో వస్తుంది. అమెజాన్ ఫ్రైడే సేల్‌లో ఇది రూ. 45,490 ధరతో అందుబాటులో ఉంది.
Realme GT 6T 5G (Fluid Silver, 8GB RAM): గేమింగ్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నవారికి 'రియల్మీ GT 6T 5G' ఉత్తమ ఎంపిక. ఇది దేశంలోనే మొట్టమొదటి 7+ Gen 3 ప్రాసెసర్‌తో వస్తుంది. అంతేకాక AnTuTuలో ఈ ఫోన్ 1.5M+ స్కోర్‌ను సాధించింది. AnTuTu అనేది ఆండ్రాయిడ్ డివైజస్ కోసం అత్యంత ప్రజాదరణ పొందిన బెంచ్‌మార్క్ యాప్‌లలో ఒకటి. ఇది స్మార్ట్‌ఫోన్స్, టాబ్లెట్స్ వంటి డివైజ్‌ల పనితీరును అంచనా వేసి స్కోర్‌ను కేటాయిస్తుంది. ఇక ఈ ఫోన్ 5500mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ లార్జ్ ఫ్లాగ్‌షిప్ డిస్‌ప్లేను కలిగి ఉంది. బ్లాక్ ఫ్రైడే సేల్‌లో దీని ధర రూ. 32,998.
Motorola G64 5G (Ice Lilac, 12GB RAM): 'మోటరోలా G64 5G' ఫోన్ కూడా అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో మంచి ఆఫర్లో అందుబాటులో ఉంది. ఈ 5G స్మార్ట్‌ఫోన్ 128GB స్టోరేజ్‌తో వస్తుంది. దీని 6000mAh బ్యాటరీ చాలా శక్తివంతమైనది. ఇది లాంగ్ ప్లేబ్యాక్ టైమ్‌తో మరింత మన్నికైనది. ఇందులో 12GB RAMని 24GB వరకు పెంచుకోవచ్చు. ఇది ఈ స్మార్ట్‌ఫోన్ పనితీరును మరింత మెరుగుపరుస్తుంది. అంతేకాక ఇది ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో కేవలం రూ. 17,790 ధరకే లభిస్తుంది.
Nothing Phone (2a) 5G (Black, 8GB RAM): అదిరే ఫీచర్లు, స్టన్నింగ్ లుక్స్‌తో 'నథింగ్ ఫోన్ 2a 5G' స్మార్ట్‌ఫోన్ కస్టమర్లను ఆకర్షిస్తోంది. ఇది 256GB స్టోరేజ్‌తో లభిస్తుంది. ఇది చాలా మంచి వీడియోస్ అండ్ ఫొటోలను తీసుకునేందుకు వెనక భాగంలో 50MP OIS కెమెరాను కలిగి ఉంది. దీని AMOLED స్క్రీన్ కూడా చాలా బాగుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 45W ఛార్జర్ సహాయంతో దాదాపు 59 నిమిషాల్లో 100% వరకు ఛార్జ్ అవుతుంది. అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో దీని ధర రూ. 25,400.
ఇవాళ్టి నుంచి ప్రారంభమైన ఈ సేల్.. డిసెంబర్ 2వ తేదీ వరకు కొనసాగనుంది. మరెందుకు ఆలస్యం ఈ అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో మీకు నచ్చిన మొబైల్‌ను మంచి ఆఫర్‌తో కొని పండగ చేస్కోండి.
మతిచెదిరే లుక్‌లో BMW కొత్త కారు- ధర ఎంతో తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే..!
'గ్లోసీ బ్యాక్ డిజైన్'తో లావా మొబైల్.. చూడటానికి అచ్చు ఐఫోన్ లాగే.. కేవలం రూ.6,999లకే..!