Best Laptops Under 30000 : ఈ డిజిటల్ యుగంలో ల్యాప్టాప్స్ లేకుండా ఎలాంటి పని జరగడం లేదు. స్కూల్ పిల్లల నుంచి ప్రొఫెషనల్స్ వరకు ప్రతిఒక్కరికీ ల్యాప్‌టాప్ తప్పనిసరి అయిపోయింది. అందుకే ప్రముఖ ల్యాప్‌టాప్ తయారీ సంస్థలు అన్నీ, అన్ని వర్గాల యూజర్లకు ఉపయోగపడమే బెస్ట్ ల్యాప్‌టాప్స్‌ను రూపొందిస్తున్నాయి. వాటిలో రూ.30,000 బడ్జెట్లో మల్టీ టాస్కింగ్‌కు ఉపయోగపడే టాప్-5 ల్యాప్టాప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. Lenovo IdeaPad Features : ఈ లెనోవా ఐడియాప్యాడ్ మంచి లుక్‌తో ఉంటుంది. దీనిలో పవర్ఫుల్ ఏఎండీ రైజెన్ ప్రాసెసర్ ఉంది. కనుక చాలా స్మూత్‌గా, ఎలాంటి ల్యాగ్ లేకుండా వర్క్ చేసుకోవచ్చు. బేసిక్ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ చేసేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
- ప్రాసెసర్ : ఏఎండీ రైజెన్ 3 7320యూ
- ర్యామ్ : 8 జీబీ
- స్టోరేజ్ : 512 జీబీ ఎస్ఎస్డీ
- ఆపరేటింగ్ సిస్టమ్ : విండోస్ 11 హోమ్
- బరువు : 1.58 కేజీలు
Lenovo IdeaPad Price : మార్కెట్లో ఈ లెనోవా ఐడియాప్యాడ్ ధర సుమారుగా రూ.27,990 ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
2. Tecno MegaBook T1 Features : ఈ టెక్నో మెగాబుక్ టీ1లో 15.6 అంగుళాల ఐ-కంఫర్ట్ డిస్ప్లే ఉంటుంది. దీనిలో 70 వాట్ సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఉంది. ఇది మూన్‌షైన్ సిల్వర్ కలర్లో లభిస్తుంది. డైలీ వర్క్ చేసుకోవడానికి, మల్టీ టాస్కింగ్ చేయడానికి ఇది చాలా బాగుంటుంది.
- ప్రాసెసర్ : ఇంటెల్ కోర్ 11th జనరేషన్ ఐ5 ప్రాసెసర్
- ర్యామ్ : 16 జీబీ
- స్టోరేజ్ : 512 జీబీ ఎస్ఎస్డీ
- ఆపరేటింగ్ సిస్టమ్ : విండోస్ 11
- బరువు : 1.56 కేజీలు
Tecno MegaBook T1 Price : మార్కెట్లో ఈ టెక్నో మెగాబుక్ టీ1 ధర సుమారుగా రూ.29,990 ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
3. Zebronics NBC 1S Features : జీబ్రానిక్స్ ఎన్బీసీ 1ఎస్ ల్యాప్‌టాప్ 15.6 అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. ఇది యూఎస్బీ టైప్-సీ పోర్టు కలిగి ఉంది. దీనిలో 38.4వాట్ సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఉంది. తక్కువ బడ్జెట్లో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చే ల్యాప్‌టాప్ ఇది.
- ప్రాసెసర్ : ఇంటెల్ కోర్ ఐ3 11th జనరేషన్ 1125జీ4
- ర్యామ్ : 8 జీబీ
- స్టోరేజ్ : 512 జీబీ ఎం.2 ఎస్ఎస్డీ
- ఆపరేటింగ్ సిస్టమ్ : విండోస్ 11 హోమ్
Zebronics NBC 1S Price : మార్కెట్లో ఈ జీబ్రానిక్స్ ఎన్బీసీ 1 ఎస్ ల్యాప్‌టాప్ ధర సుమారుగా రూ.27,990 ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
4. Asus Vivobook 15 Features : ఈ ఆసుస్ వివోబుక్ 15 విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుంది. డైలీ కంప్యూటింగ్ టాస్క్‌లు చేయడానికి, వీడియో కంటెంట్ చూడడానికి కూడా ఇది చాలా బాగుంటుంది.
- ప్రాసెసర్ : ఇంటెల్ సెలెరాన్ ఎన్4020
- ర్యామ్ : 8 జీబీ
- స్టోరేజ్ : 512 జీబీ ఎస్ఎస్డీ
- ఆపరేటింగ్ సిస్టమ్ : విండోస్ 11
- బరువు : 1.8 కేజీలు
Asus Vivobook 15 Price : మార్కెట్లో ఈ ఆసుస్ వివోబుక్ 15 ధర సుమారుగా రూ.27,990 ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
5. HP Laptop 15 Features : ఈ హెచ్‌పీ ల్యాప్‌టాప్‌లో ఇంటిగ్రేటెడ్ యూహెచ్డీ గ్రాఫిక్స్ కార్డ్ ఉంది. అలాగే డ్యూయెల్ స్పీకర్స్ కూడా ఉన్నాయి. హై-ఎండ్ గేమ్స్ ఆడడానికి, వీడియో ఎడిటింగ్ చేయడానికి ఇది చాలా బాగుంటుంది.
- ప్రాసెసర్ : ఇంటెల్ సెలెరాన్ ఎన్4500
- ర్యామ్ : 8 జీబీ డీడీఆర్4
- స్టోరేజ్ : 512 జీబీ ఎస్ఎస్డీ
- ఆపరేటింగ్ సిస్టమ్ : విండోస్ 11
- బరువు : 1.69 కేజీలు
HP Laptop 15 Price : మార్కెట్లో ఈ హెచ్‌పీ ల్యాప్‌టాప్ 15 ధర సుమారుగా రూ.25,930 ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
రూ.20 వేలలో అదిరిపోయే స్మార్ట్ ఫోన్ కొనాలా? టాప్-5 ఆప్షన్స్ ఇవే!
గూగుల్ 'జెమిని' యూజర్లకు అలర్ట్ - ఆ 'డేటా' షేర్ చేశారో - ఇక అంతే!