Best AI Tools For Content Creators : కంటెంట్ క్రియేటర్ల కోసం నేడు మార్కెట్లో చాలా ఏఐ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో ప్లేహెచ్టీ, హేజెన్, గ్రావిటీ రైట్, అడోబ్ ఫైర్‌ఫ్లై, విద్ర్యాపిడ్, గైడ్, ఆటోడ్రా లాంటి సూపర్ ఏఐ టూల్స్ ఉన్నాయి. వీటితో మీరు సూపర్ కంటెంట్‌ను చాలా సులువుగా క్రియేట్ చేయవచ్చు. అందుకే వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
- PlayHT : ఈ ప్లేహెచ్టీ ద్వారా మీ వాయిస్‌ను క్లోనింగ్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీ సొంత వాయిస్‌తో 30 సెకెన్లకు తక్కువ కాకుండా ఒక ఆడియో ఫైల్‌ను క్రియేట్ చేసి, దానిని అప్లోడ్ చేయాలి. దీనితో మీ క్లోనింగ్ వాయిస్ క్రియేట్ అవుతుంది. దీనిని ఉపయోగించి టెక్ట్స్‌ను మీ వాయిస్‌తో ఆడియో రూపంలోకి మార్చుకోవచ్చు.
- HeyGen Labs : ఈ హేజెన్ ల్యాబ్స్ ఏఐ టూల్ ఉపయోగించి మీ ఆడియో లాంగ్వేజ్‌ను నచ్చిన భాషలోకి ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు. అది కూడా మీ సొంత వాయిస్‌తో, పెర్ఫెక్ట్ లిప్ సింక్‌తో ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు.
- GravityWrite : ఈ గ్రావిటీరైట్ ఏఐ టూల్ ఉపయోగించి అమేజింగ్ కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. దీనిలో కంటెంట్ రైటింగ్, ఫిల్మ్ మేకింగ్, ఎస్ఈఓ, మ్యూజిక్, యూట్యూబ్ టూల్స్ ఉంటాయి. దీనిని ఉపయోగించి మంచి స్క్రిప్ట్, టైటిల్, థంబ్‌నెయిల్స్ క్రియేట్ చేసుకోవచ్చు.
- Adobe Firefly : మంచి ఇమేజ్‌లు క్రియేట్ చేయాలని అనుకునేవారికి అడోబ్ ఫైర్‌ఫ్లై మంచి ఆప్షన్ అవుతుంది. ఈ ఏఐ టూల్ ద్వారా మంచి ఫొటోలను క్రియేట్ చేయడమే కాదు. ఇప్పటికే రెడీగా ఉన్న ఫొటోలను కూడా అద్భుతంగా మార్చుకోవచ్చు.
- VidRapid : యూట్యూబ్ వీడియోలోని కంటెంట్‌ను చిన్నచిన్న టెక్ట్స్ బిట్స్ లాగా మారుస్తుంది. దీనిని ఉపయోగించి యూట్యూబ్ ట్రాన్స్క్రిప్షన్ను సులువుగా పొందవచ్చు. అలాగే సదరు వీడియోలోని టాపిక్‌ను సమ్మరైజ్ చేసి చేసి చూసుకోవచ్చు. అలాగే టైమ్ కోడ్స్ ద్వారా మీకు నచ్చిన పార్ట్లోకి సింపుల్‌గా జంప్ చేయవచ్చు.
- Guidde : స్క్రీన్ రికార్డింగ్ చేయడానికి ఈ గైడ్ ఏఐ టూల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు వీడియోలోని కంటెంట్‌ను హైలెట్ చేయవచ్చు. యారో మార్క్స్ పెట్టుకోవచ్చు. దీనికి వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. లేదా ఏఐ ద్వారా టెక్ట్స్ టూ వాయిస్ చేయించుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా యాడ్ చేయవచ్చు.
- AutoDraw : చేతితో గీసిన చిత్రాలను అద్భుతంగా తీర్చిదద్దడానికి ఈ ఆటోడ్రా ఏఐ టూల్ బాగా ఉపయోగపడుతుంది. ఈ టూల్లో చేతితో గీసిన చిత్రాలను ప్రొఫెషనల్‌గా మార్చుకోవచ్చు. రంగులు కూడా అద్దవచ్చు.
చూశారుగా, ఈ టాప్-7 ఏఐ టూల్స్ ఉపయోగించి సూపర్ కంటెంట్ క్రియేట్ చేసి మీ ఫాలోవర్స్‌ను ఆశ్చర్యపరచండి. ఆల్ ది బెస్ట్!
మీ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ కావాలా? ఈ టాప్-6 టిప్స్ మీ కోసమే!
చాట్‌జీపీటీకి పోటీగా యాపిల్ 'Ask' ఏఐ టూల్ - లాంఛ్ ఎప్పుడంటే?