ETV Bharat / technology

టీవీఎస్‌ ఐక్యూబ్‌ను దాటేసిన బజాజ్‌ చేతక్‌ సేల్స్- అగ్రస్థానంలో కొనసాగుతున్న ఓలా - Bajaj Chetak Overtake TVS Iqube

Bajaj Chetak Overtake TVS Iqube: ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రికల్ వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజ కంపెనీల మధ్య పోటీ క్రమంగా పెరుగుతోంది. ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో బజాజ్ చెతక్, టీవీఎస్ ఐక్యూబ్ మధ్య గట్టి పోటీ నెలకొంది. సెప్టెంబర్​లో జరిగిన అమ్మకాల్లో బజాజ్ చెతక్‌ను టీవీఎస్ ఐక్యూబ్ దాటేసింది.

Bajaj Chetak
Bajaj Chetak (chetak)
author img

By ETV Bharat Tech Team

Published : Oct 2, 2024, 4:26 PM IST

Bajaj Chetak Overtake TVS Iqube: ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్​, డీజిల్​ ధరలతో పాటు పర్యావరణ హాని కారణంగా ఇప్పుడు వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లపై మొగ్గు చూపుతున్నారు. దీంతో గత కొద్ది కాలంగా ఎలక్ట్రిక్​ వాహనాల డిమాండ్​ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీలతో పాటు కొత్త స్టార్టప్​ కంపెనీలు కూడా ఎప్పటికప్పుడు తమ ఎలక్ట్రిక్​ వాహనాలను లాంచ్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్​ వాహనాలను ప్రోత్సహించడం, కంపెనీలకు రాయితీలు అందిస్తుండటం వంటివి ఈవీల వృద్ధికి కలిసొచ్చింది.

దీంతో ఎలక్ట్రిక్ టూ- వీలర్ వాహన రంగంలో దిగ్గజ కంపెనీల మధ్య పోటీ క్రమంగా పెరుగుతోంది. ఈవీల విక్రయాల్లో క్రమంగా తమ మార్కెట్‌ వాటాను పెంచుకుంటున్నాయి. ముఖ్యంగా టీవీఎస్‌, బజాజ్‌ కంపెనీల మధ్య ఈ విషయంలో గట్టి పోటీ నెలకొంది. ఇన్నాళ్లు ఓలా తర్వాత టీవీఎస్‌ రెండో స్థానంలో ఉండగా సెప్టెంబర్‌లో బజాజ్‌ చేతక్‌ ఆ స్థానాన్ని ఆక్రమించింది. మరోవైపు అత్యధిక విక్రయాలతో ఓలా ఎలక్ట్రిక్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నా.. మార్కెట్‌ వాటా మాత్రం క్షీణించడం గమనార్హం.

సెప్టెంబర్‌ నెలకు సంబంధించి వాహన సేల్స్​లో ఓలా 23,965 యూనిట్ల విక్రయాలతో అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఒకప్పడు నెలకు సగటున 30 వేల యూనిట్ల వాహనాలును విక్రయించే ఈ ఓలా సంస్థ మార్కెట్‌ వాటా తాజాగా 27 శాతానికి పడిపోయింది. అదే సమయంలో బజాజ్‌ ఆటో తన విక్రయాలను పెంచుకుంటోంది. 18,933 చేతక్‌లను విక్రయించి రెండో స్థానంలో నిలిచింది. టీవీఎస్‌ సైతం 17,865 యూనిట్ల ఐక్యూబ్‌లను విక్రయించింది. ఎలక్ట్రిక్ వాహన స్టార్టప్‌ కంపెనీలు.. ఏథర్‌, హీరో మోటోకార్ప్‌ బ్రాండ్లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఎలక్ట్రిక్‌ మార్కెట్‌లో ఓలా తక్కువ ధరలో మెరుగైన ఫీచర్లతో స్కూటర్లను అందిస్తూ కొన్నేళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. సెప్టెంబర్‌ నెలలోనూ ఆ స్థానం పదిలంగానే ఉన్నా.. బజాజ్‌ ఆటో, టీవీఎస్‌ నుంచి ఎదురవుతున్న పోటీకి మాత్రం కంపెనీ మార్కెట్‌ వాటా క్రమంగా క్షీణించిపోతోంది. దీనికి కారణాలు లేకపోలేదు. ఓలాకు పోటీగా ఈ రెండు టీవీఎస్‌, బజాజ్ కంపెనీలూ చేతక్‌, ఐక్యూబ్‌ మోడళ్లను మరింత అందుబాటు ధరలో తీసుకొచ్చాయి.

ఓలా సర్వీసు సెంటర్ల విషయంలో వినియోగదారుల అసంతృప్తి రెండో కారణం. అదేసమయంలో బజాజ్‌, టీవీఎస్‌కు ఇప్పటికే విస్తృతమైన నెట్‌వర్క్‌ ఉన్నాయి. విడా పేరుతో హీరో మోటోకార్ప్‌ సైతం ఈవీ రేసులో ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. కాస్త ఆలస్యం కావడంతో ఆ స్థాయి డిమాండ్‌ను అందుకోలేకపోతోంది. స్థిరంగా 4 వేల యూనిట్ల సేల్స్​ను మాత్రం నమోదు చేస్తోంది.

ఎలక్ట్రిక్ వాహనాల కోసం కేంద్రం కొత్త స్కీమ్- రూ. 10,900 కోట్లు కేటాయింపు - PM E Drive Scheme

వేగనార్ రికార్డ్ బ్రేక్ చేసిన పంచ్- ఇందుకు కారణం ఏంటో తెలుసా? - Tata Punch Overtakes Maruti Wagonr

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.