ETV Bharat / technology

అదిరిపోయే కెమెరా ఫీచర్స్​తో - త్వరలో ఐఫోన్ 16 లాంఛ్​​ - ధర ఎంతంటే? - Apple iPhone 16 launch in 2024

Apple IPhone 16 Launch : ఐఫోన్ లవర్స్​కు గుడ్ న్యూస్​. యాపిల్ కంపెనీ త్వరలోనే ఐఫోన్ 16 సిరీస్​ను లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తోందని సమాచారం. ఈ నయా ఐఫోన్​ను సరికొత్త డిజైన్​తో​, అద్భుతమైన కెమెరా​ ఫీచర్స్​తో రూపొందించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు మీ కోసం.

Apple iPhone 16 features
Apple iPhone 16 launch
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 15, 2024, 4:04 PM IST

Apple IPhone 16 Launch : యాపిల్ కంపెనీ త్వరలోనే ఐఫోన్ 16 సిరీస్​ను లాంఛ్ చేయనున్నట్లు సమాచారం. ఈ ఐఫోన్​ 16 డిజైన్​ చాలా యూనిక్​గా ఉంటుందని, డిస్​ప్లే చాలా పెద్దగా ఉంటుందని తెలుస్తోంది.

IPhone 16 Features : యాపిల్ కంపెనీ ఈ ఐఫోన్ 16లో సూపర్ ఫీచర్స్​ను పొందుపరుస్తున్నట్లు తెలుస్తోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

  1. డిజైన్​ : ఇప్పటి వరకు మార్కెట్లోకి విడుదల చేసిన ఫోన్ల కంటే ఈ ఐఫోన్ 16 డిజైన్ చాలా యూనిక్​గా ఉంటుందని తెలుస్తోంది. లీకైన ప్రోటోటైప్​ మోడల్స్​ను చూస్తూ ఉంటే, ఇప్పటి వరకు ఉన్న త్రిభుజాకార కెమెరా లేఅవుట్​ స్థానంలో, నిలువుగా ఉన్న డ్యూయెల్​-కెమెరా లేఅవుట్​ను తెచ్చే అవకాశం ఉంది. బహుశా యాపిల్​ విజన్ ప్రో హెడ్​సెట్​ కోసం ఈ విధమైన మార్పు చేసి ఉండవచ్చు. ఈ ఐఫోన్​ లేత పసుపు, గులాబీ, నలుపు రంగుల్లో ఉంటుందని తెలుస్తోంది. ఇంకా అదనపు కలర్ ఆప్షన్లు కూడా ఉండవచ్చు.
  2. న్యూ బటన్స్​ : ఐఫోన్ 16లో సరికొత్త వాల్యూమ్ బటన్​, కొత్త క్యాప్చర్ బటన్​లను పొందుపరుస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఈజీగా కెమెరా షట్టర్​ ఓపెన్ చేయడానికి, మరిన్ని ఫీచర్లను యాక్సెస్ చేయడానికి ఉపయోగపడుతుందని సమాచారం.
  3. డిస్​ప్లే సైజ్​ : ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ల డిస్​ప్లే సైజు పాత మోడల్స్ లానే ఉంటుంది. కానీ ప్రో మోడల్స్ డిస్​ప్లే సైజు మాత్రం పెరిగే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఐఫోన్ 16 ప్రో స్క్రీన్​ డిస్​ప్లే 6.3 అంగుళాలు, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ స్క్రీన్​ 6.9 అంగుళాలు ఉండవచ్చు. ముఖ్యంగా ఈ నయా ఐఫోన్​లో ఓఎల్​ఈడీ ప్యానెల్స్​ కోసం మైక్రో-లెన్స్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల బ్రైట్​నెస్​, పవర్ ఎఫీషియెన్సీ పెరుగుతుంది.
  4. ప్రాసెసర్స్ : యాపిల్ కంపెనీ ఈ ఐఫోన్ 16 ప్రీమియం మోడల్స్​లో పవర్​ఫుల్​ ఏ17 చిప్​ను అమరుస్తున్నట్లు సమాచారం. అంతేకాదు 5జీ కనెక్టివిటీని కూడా కల్పిస్తున్నారు. ప్రో మోడల్స్​లో వేగవంతమైన, సమర్థవంతమైన పనితీరు కోసం క్వాల్కమ్ స్నాప్​డ్రాగన్​ ఎక్స్75 మోడెమ్​ను అనుసంధానం చేసుకునే వీలును కూడా కల్పిస్తున్నట్లు తెలుస్తోంది.
  5. కెమెరా సెటప్ : ఐఫోన్లు అంటేనే కెమెరా సెటప్​లకు పెట్టింది పేరు. అందుకే ఈ ఐఫోన్ 16 ప్రో మోడల్స్​లో 48 ఎంపీ ఆల్ట్రావైడ్ లెన్స్​, 5ఎక్స్ ఆప్టికల్ జూమ్​ టెట్రాప్రిజం కెమెరాను అమరుస్తున్నారు. దీనితో సూపర్ క్వాలిటీ ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు.
  6. బ్యాటరీ లైఫ్​ : ఈ నయా ఐఫోన్ 16 ప్రో మోడల్స్​లో స్టేక్డ్​ బ్యాటరీ టెక్నాలజీని ఉపయోగించారు. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. పైగా బ్యాటరీ లైఫ్ కూడా చాలా ఎక్కువ సేపు ఉంటుందని తెలుస్తోంది.
  7. ఓఎస్​ : యాపిల్ కంపెనీ ఈ ఐఫోన్ 16లో ఐఓఎస్​ 18ను పొందుపరిచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది ఏఐ పవర్డ్​ ఫీచర్స్​ కలిగి ఉంటుందని సమాచారం.
  8. ఆడియో : ఈ నయా ఐఫోన్​లో సిగ్నల్-టు-నాయిస్​ రేషియో టెక్నాలజీ వాడారు. కనుక మైక్రోఫోన్​లో చాలా క్రిస్టల్ క్రియర్​గా ఆడియో వినిపిస్తుంది.

IPhone 16 Launch Date : యాపిల్ కంపెనీ బహుశా ఈ సెప్టెంబర్​ నెలలో ఐఫోన్​ 16 సిరీస్​ను లాంఛ్ చేసే అవకాశం ఉంది. ఏదైనా కారణం చేత లేటైనా సరే, 2024లోనే కచ్చితంగా ఐఫోన్ 16ను రిలీజ్ చేసే అవకాశముంది.

IPhone 16 Price : ఐఫోన్ 16 ధర బహుశా ఐఫోన్ 15 కంటే 100 డాలర్లు అధికంగా ఉండవచ్చని తెలుస్తోంది. కానీ దీనిపై యాపిల్ కంపెనీ అధికారికంగా తెలియజేసినప్పుడే అసలు విషయం తెలుస్తుంది.

రూ.12,000 బడ్జెట్లో మంచి ఫోన్ కొనాలా? టాప్​-10 ఆప్షన్స్​ ఇవే!

మంచి స్మార్ట్​వాచ్​ కొనాలా? రూ.2,500 బడ్జెట్లోని టాప్​-10 ఆప్షన్స్ ఇవే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.