ETV Bharat / technology

ఈ స్కిల్స్​ లేకుంటే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల జాబ్స్ ఔట్..!- విశ్లేషకుల హెచ్చరిక

'రిస్క్​లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఉద్యోగాలు'- ఆ నైపుణ్యాలు నేర్చుకోవాల్సిందే..!

80Percent Software Engineers Could Lose Jobs
80Percent Software Engineers Could Lose Jobs (ETV Bharat)
author img

By ETV Bharat Tech Team

Published : Oct 15, 2024, 1:56 PM IST

Updated : Oct 15, 2024, 2:03 PM IST

Software Engineers Need AI Skills: ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రెండ్ నడుస్తోంది. ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతూ అన్ని రంగాలకూ వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏఐకి అవసరమైన స్కిల్స్​ నేర్చుకోకుంటే 80% సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలున్నాయని గార్ట్​నర్​ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

గార్డ్​నర్ విశ్లేషకుల ప్రకారం.. ప్రస్తుతం ప్రపంచం ఏఐ వెంట పరుగులు పెడుతున్న దృష్ట్యా తమ ఉద్యోగాలను కాపాడుకునేందుకు 80శాతం మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు నేచురల్-లాంగ్వేజ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, రిట్రీవల్-ఆగ్మెంటెడ్ జనరేషన్ (RAG) వంటి కొత్త ఏఐ స్కిల్స్​ను నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.

ఇటీవల ప్రచురించిన నోట్​లో గ్లోబల్ రీసెర్చ్ సంస్థ.. ఇంజనీర్ల పోస్టులను ఏఐ భర్తీ చేయదని, అయితే వారికి కొత్త రోల్స్​ను అందించబోతోందని తెలిపింది. "ఏఐ సామర్థ్యంపై బోల్డ్ వాదనలు.. హ్యూమన్ ఇంజనీర్ల డిమాండ్​ను ఏఐ తగ్గించగలదని లేదా వారి స్థానాన్ని పూర్తిగా భర్తీ చేయగలదనే ఊహాగానాలకు దారితీసింది. భవిష్యత్తులో సాఫ్ట్​వేర్ ఇంజనీర్ల పాత్రను ఏఐ పూర్తిగా మార్చేస్తుంది. అయితే సంక్లిష్టమైన, వినూత్నమైన సాఫ్ట్‌వేర్‌ను అందించేందుకు హ్యూమన్ ఎక్సర్సైజ్, క్రియేటివిటీ అవసరం ఎంతైనా ఉంది." - ఫిలిప్ వాల్ష్, గార్ట్‌నర్‌లోని సీనియర్ ప్రిన్సిపల్ అనలిస్ట్

ఈ నేపథ్యంలో US- బేస్డ్​ IT రీసెర్చ్ అండ్ కన్సల్టింగ్ కంపెనీ.. సాఫ్ట్​వేర్ అభివృద్ధిపై ఏఐ ప్రభావం కింది మూడు దశల్లో ఉంటుందని తెలిపింది. అవేంటంటే?

  • 1. ఏఐ టూల్స్ స్వల్పకాలిక పరిమితుల్లో పనిచేస్తాయి. అంటే ఇది ఇప్పటికే ఉన్న సాఫ్ట్​వేర్ ఇంజనీర్ల వర్క్​ఫ్లోస్​ను పెంచుకోవడం ద్వారా ప్రొడక్టివిటీని మెరుగుపరుస్తుంది.
  • 2. AI ఏజెంట్స్.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు నిర్వహించే పనులను పూర్తిగా ఆటోమేట్​ చేయడం ద్వారా బౌండరీస్​ను ముందుకు తీసుకురాగరు. ఆ సమయంలో చాలా వరకు కోడింగ్​ను హ్యూమన్- ఆథర్డ్​ కాకుండా ఏఐ- జనరేట్ చేస్తుంది.
  • 3. రానున్న రోజుల్లో AI ఇంజనీరింగ్ మరింత సమర్థవంతంగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఆర్గనైజేషన్స్.. ఏఐ- సాధికారత కలిగిన సాఫ్ట్​వేర్ కోసం నైపుణ్యం కలిగిన సాఫ్ట్​వేర్ ఇంజనీర్లను నియమించుకునేందుకు చూస్తాయి.

ఇటీవల గార్ట్‌నర్ US, UKలోని 300 సంస్థలపై జరిపిన సర్వేలో 56 శాతం మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు.. ప్రస్తుతం ఏఐ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో AI/ML ఇంజనీర్​ పాత్ర చాలా అవసరం అని తెలిపారు. అయితే వారిలో చాలామంది.. AI/MLతో యాప్స్​ను ఇంటిగ్రేట్ చేసే నైపుణ్యాలు తమకు లేవని అంగీకరించినట్లు తెలిసింది.

కోడ్​ను రూపొందించేందుకు ఏఐని వినియోగించడం అనేది టెక్నాలజీ ఎంత అభివృద్ధి దిశగా ముందుకు పోతుందో తెలియజేస్తుంది. ఇది GitHub Copilot, Anthropic's Claude రోల్​ అవుట్​తో ఏఐ కోడింగ్ టూల్స్ పెరుగుదలకు దారితీసింది. ఈ క్రమంలోనే ఏఐ కోడింగ్ స్టార్టప్​ సూపర్​మావెన్.. గత నెలలో బెస్సెమర్ వెంచర్ పార్ట్‌నర్స్ నేతృత్వంలో ఫస్ట్ అవుట్​సైడ్ ఫండింగ్​ రౌండ్​లో $12 మిలియన్లను సంపాదించి సంచలనం సృష్టించింది.

అయినప్పటికీ కోడింగ్​లో ఏఐ వినియోగం అనే అంశం ఇప్పటికీ చర్చలకు దారితీస్తోంది. ఏఐ మోడల్స్​ను ఉపయోగించి రూపొందించిన కోడ్​ క్వాలిటీ తక్కువగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఏఐ కోడింగ్ టూల్స్ ప్రొడక్టివిటీని పెంచేందుకు గ్యారంటీ ఇవ్వకపోవచ్చు. GitHub Copilot ఉపయోగించి 800 మంది సాఫ్ట్‌వేర్ డెవలపర్‌లపై జరిపిన సర్వేలో.. వారిలో ఎవరూ కూడా ప్రొడక్టివిటీలో మెరుగుదలను కనుగొనలేదు. కోడ్ రాయడానికి AI కోడింగ్ అసిస్టెంట్‌ని ఉపయోగిస్తున్నప్పుడు రిక్వెస్ట్‌లలో బగ్‌లలో 41 శాతం పెరుగుదల ఉన్నట్లు వారు నివేదించారు.

వావ్.. ఇది అంతరిక్ష కేంద్రమా..?- డిజైన్​ చూస్తే మతిపోతోందిగా..!

జూపిటర్‌ చంద్రుడిపై జీవం ఉందా..?- నిగూఢ రహస్యాలు ఛేదించేందుకు రంగంలోకి 'యూరోపా క్లిప్పర్'

Last Updated : Oct 15, 2024, 2:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.