2025 Honda Amaze Variant Wise Features: కార్ల తయారీ కంపెనీ హోండా కార్స్ ఇండియా నిన్ననే తన లేటెస్ట్ హోండా అమేజ్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ ఈ కారులో అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS)ను అందించింది. అంతేకాక దీన్ని కేవలం రూ. 8 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో బడ్జెట్-ఫ్రెండ్లీగా తీసుకొచ్చింది. దీంతో అడ్వాన్స్డ్ ADAS ఫీచర్‌తో వచ్చిన దేశంలోనే అత్యంత చౌకైన కారుగా 2025 హోండా అమేజ్ గుర్తింపు పొందింది. దీని టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 10.90 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీని ట్రిమ్ వేరియంట్ల వారీగా ఈ కారు ధర, ఫీచర్ల గురించి మరిన్ని వివరాలు తెసుకుందాం రండి.
ట్రిమ్ వేరియంట్స్: కంపెనీ ఈ కారును మొత్తం మూడు ట్రిమ్‌లలో తీసుకొచ్చింది.
- V
- VX
- ZX
1. 2025 హోండా అమేజ్ V ట్రిమ్ ఫీచర్లు:
- ధర: రూ. 8.00 లక్షలు - రూ. 9.20 లక్షలు
- పవర్‌ట్రెయిన్: 1.2 పెట్రోల్ MT, CVT
- కవర్స్‌తో 14-అంగుళాల స్టీల్ వీల్
- LED DRLలతో LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు
- LED టెయిల్‌లైట్‌లు
- షార్క్-ఫిన్ యాంటెన్నా
- పవర్ అడ్జస్టబుల్, బాడీ-కలర్ ORVMs విత్ LED టర్న్ ఇండికేటర్స్
- 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
- వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే
- 7-అంగుళాల MIDతో సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్
- వాయిస్ కమాండ్
- 4-స్పీకర్ సౌండ్ సిస్టమ్
- మాన్యువల్ ఎయిర్ కండిషనింగ్
- స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్
- టిల్ట్ స్టీరింగ్ సర్దుబాటు
- ఫాబ్రిక్ అప్హోల్స్టరీ
- కప్‌హోల్డర్‌లతో రియర్ ఆర్మ్‌రెస్ట్
- పాడిల్ షిఫ్టర్లు (CVT మాత్రమే)
- కీ లెస్ ఎంట్రీ
- కీ లెస్ రిలీజ్‌తో ఎలక్ట్రికల్ ట్రంక్ లాక్
- నాలుగు పవర్ విండోస్
- 6 ఎయిర్‌బ్యాగ్‌లు
- EBDతో ABS
- ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC)
- ట్రాక్షన్ కంట్రోల్
- డే/నైట్ ఇన్సైడ్ రియర్-వ్యూ మిర్రర్స్
- అన్ని సీట్లకు 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లు, హెడ్ రెస్ట్రెయిన్‌లు
- హిల్ స్టార్ట్ అసిస్ట్
- ISOFIX చైల్డ్ సీట్ మౌంట్
- రియర్ పార్కింగ్ సెన్సార్ అండ్ కెమెరా
2. హోండా అమేజ్ VX ఫీచర్లు:
- ధర: రూ. 9.10 లక్షలు - రూ. 10.00 లక్షలు
- పవర్‌ట్రెయిన్: 1.2 పెట్రోల్ MT, CVT
- LED ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్స్
- 15-అంగుళాల అల్లాయ్ వీల్స్
- పవర్ ఫోల్డింగ్ వింగ్ మిర్రర్స్
- డాష్‌బోర్డ్‌పై శాటిన్ మెటాలిక్ గార్నిష్
- పుష్ స్టార్ట్/స్టాప్ బటన్
- రిమోట్ ఇంజిన్ స్టార్ట్ (CVT మాత్రమే)
- MAX కూల్ మోడ్‌తో ఆటో క్లైమేట్ కంట్రోల్
- రియర్ AC వెంట్స్
- వైర్లెస్ ఛార్జర్
- కనెక్టెడ్ కార్ ఫీచర్లు
- అలెక్సా కంపాటిబిలిటీ
- 2 అడిషనల్ ట్వీటర్స్
- రియర్ వ్యూ కెమెరా
- లేన్ వాచ్ కెమెరా
- ఆటో హెడ్‌ల్యాంప్స్, వైపర్స్
- రియర్ డీఫాగర్
3. హోండా అమేజ్ ZX ఫీచర్లు:
- ధర: రూ. 9.70 లక్షలు - రూ. 10.90 లక్షలు
- పవర్‌ట్రెయిన్: 1.2 పెట్రోల్ MT, CVT
- అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్‌తో హోండా సెన్సింగ్ ADAS సూట్
- డ్యూయల్-టోన్ 15-అంగుళాల అల్లాయ్ వీల్స్
హోండా అమేజ్ పవర్‌ట్రెయిన్: 2025 హోండా అమేజ్‌లో ఎలాంటి మెకానికల్ మార్పులు చేయలేదు. ఈ కొత్త అమేజ్ పాత మోడళ్లలో ఉన్న అదే 1.2-లీటర్, 4-సిలిండర్‌తో సాధారణ పెట్రోల్ ఇంజిన్నే కలిగి ఉంది. ఇది 88.5bhp పవర్, 110Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టాండర్డ్‌గా 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. దీని అన్ని వేరియంట్లలో CVT గేర్‌బాక్స్ ఆప్షన్ కూడా ఉంది. దీని మాన్యువల్, CVT గేర్‌బాక్స్ ఆప్షన్స్ వరుసగా 18.65 kmpl, 19.46 kmpl మైలేజీని అందిస్తాయి.
హోండా అమేజ్ కలర్ ఆప్షన్స్: కంపెనీ ఈ కారును మొత్తం ఆరు మోనోటోన్ షేడ్స్‌లో అందుబాటులోకి తెచ్చింది. వీటిలో అబ్సిడియన్ బ్లూ పెర్ల్, రేడియంట్ రెడ్ మెటాలిక్, ప్లాటినం వైట్ పెర్ల్, గోల్డెన్ బ్రౌన్ మెటాలిక్, మెటోరాయిడ్ గ్రే మెటాలిక్, లూనార్ సిల్వర్ మెటాలిక్ కలర్స్ ఉన్నాయి. ఈ రంగులన్నీ హోండా అమేజ్ అన్ని ట్రిమ్‌లలో అందుబాటులో ఉన్నాయి.
మార్కెట్లో పోటీ: ఈ అప్డేటెడ్ హోండా అమేజ్ మార్కెట్లో ప్రధానంగా న్యూ- జనరేషన్ మారుతి సుజుకి డిజైర్‌తో పోటీపడుతుంది. దీనితో పాటు మార్కెట్‌లో దీని ఇతర పోటీదారులు హ్యుందాయ్ ఆరా, టాటా టిగోర్.
ప్రోబా-3 మిషన్ సక్సెస్- నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సీ59
పోకో పవర్ఫుల్ 5G ఫోన్లు వచ్చేస్తున్నాయ్.. అది కూడా ప్రీమియం ఫీచర్లతో అత్యంత చౌకగా..!
MG నుంచి మొట్ట మొదటి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు- సింగిల్ ఛార్జ్‌తో 580 కి.మీ రేంజ్!